Saturday, February 29, 2020
Tags వెన్నెల కెరటాలు

వెన్నెల కెరటాలు

వెన్నెల కెరటాలు- 22

గజిబిజి గా సాగిన నా అక్షరాలు  నిన్ను చేరి , అర్ధవంతమయ్యాయి ఒంటరితనపు చీకట్లు విషాదం పులుముకున్నాయి . అదేంటో పెరట్లో గడ్డిపూలు కూడా పరిమళిస్తున్నాయి ఆ ఎండిన చెట్లు చూడు ఎలా చిగురుతొడిగాయో . ఘనీభవించిన ఆ శూన్యం ఎప్పుడు జారిపోయిందో వెలుగు కిరణాలకి కరిగిపోయిన మంచు బిందువుల్లా . బంగారూ! మనసు...

వెన్నెల కెరటాలు- 21

సంతోషానికి కొత్త అర్ధాలు నేర్పిన ఆ క్షణాలని అక్కడే ఆగిపోనీవ్వు ఓడిపోయిన ఆ ఒంటరితనాన్ని గుమ్మం బయటే ఉండిపోనీ . వెన్నెల తనకే సొంతమనుకున్న ఆకాశాన్ని అలాగే అమాయకంగా చూడనీ అమృతం లో మాధుర్యం తమదే అనుకున్న స్వర్గాన్ని అలాగే విస్మయంగా చూడనీ . నీపలుకుల తేనె...

వెన్నెల కెరటాలు- 20

మాటలన్నీ రాలిపోయాక  మౌనం ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కలవరపడే మనసు కాటుకద్దుకుని బరువౌతోంది . జారిపోయిన అద్భుతాలు జ్నాపకాలై అల్లుకుంటున్నాయి నిట్టూర్పు వెచ్చదనం నిన్నాపలేదని గుచ్చుకుంటోంది . లయమైన గుండె చప్పుళ్ళు ఇప్పుడు బరువనిపిస్తోంది ఏకమైన శ్వాసలు ఇప్పుడు ఊపిరి భారమవుతోందెందుకో . బంగారూ! ఆశని హత్తుకుంటున్నా అహం పొద్దుల్లో అస్తమించిన బంధం ప్రేమ కిరణాలతో ఉదయిస్తుందని ........... #సిఎస్కే

వెన్నెల కెరటాలు- 19

ఆహ్వానం లేని ఆగమనం  అనుమతి లేని నిష్క్రమణ నువ్వు రంగులద్దిన చిత్రం వెలసిపోయి నల్లరంగు పులుముకుంది . పునర్జీవించిన ఒంటరితనం నన్ను చూసి నవ్వుతోంది జార్చుకున్న వెన్నెల క్షణాలని జ్ణాపకాలు చేసుకుని దానితో పోరాడుతున్నా . ఎండుటాకుల గలగలలు గాయాలకి లేపనాలు పూయలేవు మౌనపు పుటల పై రసాత్మక కావ్యాలు లిఖించలేవు . బంగారూ!...

వెన్నెల కెరటాలు- 18

నిశి ని సైతం అందంగా చేస్తూ వెన్నెల జల్లులు కురిపించే  జాబిలి చల్లదనపు నీ "మాటలు" కావాలి తెల్లని నురుగు ని పాదాలకి రాసేసి కవ్వింపుగా వెళ్లిపోయే ఆలల చిలిపి తనపు నీ"చిరునవ్వు" కావాలి ఎద భారమవుతుంటే విషాద శిఖరాలని గడపదాటనివ్వని అమ్మ స్పర్శ లాంటి నువ్విచ్చే"చైతన్యం" కావాలి అస్తమించిన...

వెన్నెల కెరటాలు -17

గుప్పెడు వెన్నెల కళ్ళలో ఒంపుకుని నాకంటి మలుపులో ,నీ చూపునాపేసి ఆర్తిగా చూస్తూ అడుగుతావ్ “నేనంటే నీకెందుకింత ఇష్టం” అని . వికసించే పుష్పం చెట్టునెందుకు ప్రేమిస్తుందంటే ఏం చెప్పను? శ్వాసించే చేప నీటికన్నా దేన్ని ఇష్టపడుతుంది? . నువ్వు మరింత ముందుకి వచ్చి ఓ చిలిపి నవ్వుని...

వెన్నెల కెరటాలు – 16

కొన్ని రూపాంతరాలు కనబడవు ప్రేమగా మారిన నీ పరిచయం లాగే  అనంత క్షణాల నీ సంయోగంలో మరో ప్రపంచం లోకి నన్ను లాక్కెళుతుంది . విసిరేయబడ్డ విషాదాలు విచారంగా చూస్తుంటాయి మాటల జలపాతాలని వొంపుకుంటూ వెన్నెల కోసి ,నువ్వు పరిమళాలందిస్తుంటే నీతో కలిసి హరివిల్లుకి...

వెన్నెల కెరటాలు – 15

నిశబ్దంగా జారిపోయే రాత్రులు నన్ను వెక్కిరిస్తూ పగటిలో కలిసిపోతుంటాయి నేను మటుకు ఒంటరితనంతో యుధ్ధం చేస్తూ విరహపు చీకట్ల లోనే ఉండిపోతుంటా . మౌనపు వంతెనపై నువ్వు అవతలి తీరం చేరావు మన క్షణాల ముత్యాలేరుకుంటూ, నేను ఇక్కడే ఉండిపోయా వేడి పూలేవో...

వెన్నెల కెరటాలు -14

అమావాస్య తెలీని ఆకాశం చూసావా? నేను చూసాను నీ పరిచయం తో  నీతో క్షణాల వెన్నెల పరిమళాలు మది గోడలకి హత్తుకునే వుంటున్నాయి - ఆ దుఖానికెంత దుఖమో తన్నోదిలేసానని నువ్వొచ్చాకా నీ చిరునవ్వుల అమృతం అంటుకుంటుంటే అవతలి ప్రపంచం మాయమవుతుంటుంది - గెలుపోటములు నాకు రెండుసార్లే నువ్వు...

వెన్నెల కెరటాలు – 13

ఎంత పిచ్చివాడినో కదా జ్ఞాపకాలు నవ్వుతున్నాయి వెళుతున్న నిన్నొదిలేసి వాటిని దాచుకున్నాననిఅప్పుడు తెలీలేదు నీ నిశబ్ద సంగీతం నన్నల్లుకుంటుంటే నా మది నావకి చిల్లు పడిందని నీ ప్రేమ కడలిలో మునిగిపోయానని కాలిపోయిన ఒంటరితనం మళ్ళీ ప్రాణం పోసుకుని కాటుక పూసుకున్న క్షణాలని వెన్నెల లేని...

This function has been disabled for RGB Infotain.

error: Content is protected !!