సిటి బ్యూటిఫుల్

0
505

అసలు మనం ఎలా జీవించాలి ?? సమాజానికి నచ్చినట్లా !! మనకు నచ్చినట్లా !! ఈ ప్రశ్న దాదాపుగా అందరం ఏదో ఒక సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకొనే ఉంటాం . మనం వేసే ప్రతి అడుగును, మనం చేసే ప్రతి పనిని సమాజం నిర్దేశించిన చట్రాలో, విలువలో విటి పరిధిలోనే చెయ్యాలా !! సమాజం నిర్దేశించిన ప్రతి విలువ/కట్టుబాటు నిజమగనే ఉచ్చస్థితిలో నే ఉన్నాయా !! అవి మనిషి మానసికోన్నతికి తోడ్పటున్నాయా !! ఏమో !! ఎవరికి తెలుసు !! తెలియాలంటే ఆ కట్టుబాటు దాటెళ్లాలి కదా !! నూటికి తొంభై మంది ఆ సమాజం నిర్దేశించిన విలువల్లో కట్టుబాట్లలో ప్రశాంతంగా , ఆనందంగా ( ఇది నిజమో కాదో ఎవరూ చెప్పలేదు) బ్రతుకు సాగిస్తుంటారు.

మరొ 9 మంది ఆ కట్టుబాట్లు దాటేసి , మరో పరిధో. వృత్తమో, పరివృత్తమో ఏదో ఒకటి గీసేసుకొని దానికో సిద్దాంతం అనే పేరు పెట్టేసుకొని ఆ సిద్దాంత వృత్తంలో నిల్చొని మైక్ పట్టుకొని అందరినీ దానిలొకి ఆహ్వానిస్తుంటారు . ఇక మిగిలిన ఒక్కడు ఉంటాడు, వాడికి తొంభై మంది ఉన్న వృత్తం నచ్చదు, 9 మంది ఎంచుకున్న వృత్తాలు నచ్చవు, వీడో స్వంత వృత్తం గియ్యలేడు. అది బహుశా వాడి తలరాతో, లేక వాడికి వాడు రాసుకున్న రాతో, తెలియదు కానీ ఒక మానసిక సంఘర్షణ లో ఉంటాడు , వాడితో వాడే పోరాటం చేసుకుంటుంటాడు . వాడి మనసుకు, వాడి చేతలకు నిత్య సంఘర్షణ చెలరేగుతుంటుంది . బహుశా ఈ సంఘర్షణ ప్రతివారికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటుంది. కొంతమంది తర్వతర్వాత రాజీ పడతారు, కొంతమంది గెలిచి సమాజాన్ని దాటి వెళ్తారు . చాలా కొద్ది మందే ఆ సంఘర్షణ ను నిత్యం సాగిస్తుంటారు . అటువంటి సంఘర్షణే “ఈ సిటి బ్యూటిఫుల్ “.

తన సహజ శైలి కి భిన్నంగా , కేశవరెడ్డి గారు రాసిన నవల, సాధారణంగా కేశవరెడ్డి నవలలు పల్లెటూరి నేపధ్యంలో అణగారిన వర్గాలు జీవితంతో చేస్తున్న సంఘర్షణ ఇతివృత్తంగా ఉంటాయి, కాని ఇందులో తనతో తనే పడే ఒక సంఘర్షణే ఇతివృత్తం, ఒక మెడికో స్టూడెంట్ రెండు రోజులు అనుభవించిన మానసిక సంఘర్షణ కు ప్రతిరూపం ఈ నవల

నాకెందుకో ఈ నవల చదువుతున్నప్పుడు అస్పష్టంగా అసమర్ధుని జీవయాత్ర గుర్తుకు వచ్చింది.


@Mohan Ravipati 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.