ఏడు తరాలు

0
601

ఏడు తరాలు
ROOTS


ఆఫ్రికా అంటే చీకటి ఖండం! అక్కడి మనుషులు అడవుల్లో మృగాల మధ్య తిరిగే బర్బరులు! వాళ్ళు నాగరికత,సంస్కృతి,చరిత్ర,వారసత్వం లేని వాళ్ళు!అమెరికా స్వాతంత్ర్య స్వర్గసీమ!ధైర్య సాహసోపేతుల జన్మభూమి!

ఇవీ – విజేతలు రాసిన చరిత్ర కూసిన కారుకూతలు. ప్రపంచాన్ని అజ్ఞానంలో ముంచెత్తిన రాతలు!!
మానవ ఇతిహాసంలో రాతిపనిముట్లు చెక్కి, ఉపయోగించుకున్న చాకచక్యం,సామర్ధ్యం ఆఫ్రికాలో ఇరవై లక్షల యేళ్లనాడే తెలుసునన్నా, ఆసియాలో కనిపెట్టబడ్డ నిప్పు ఐరోపాకి తెలియడానికి లక్షాయాభై వేల సంవత్సరాలు పట్టిందన్నా ఆశ్చర్యంతో మనకి నోటరాదు.

సాధారణంగా విజేతలే చరిత్రలు రాస్తారు,రాశారు.

ఈ వాస్తవం తాలూకు వారసత్వాన్ని,ఆనవాయితీని బద్దలు కొట్టడానికి ఈ ‘ఏడుతరాలు’ బానిసల కధ తోడ్పడుతుందని రచయిత ఎలెక్స్ హేలీ ఆశ,విశ్వాసం.

ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసలను కొనితేవడం 1619లో ప్రారంభమైంది.
బానిసల దుర్భర, అమానుష దాస్యాల మధ్య నలిగిన విధానాన్ని చదువుతుంటే బానిసత్వానికి కొత్త పదాన్ని పుట్టించాలనేంత తపన వస్తుంది.

తన వంశపు ఏడుతరాల పూర్వపు మూలాల అన్వేషణను అత్యంత సాహసోపేతంగా, పట్టుదలతో సాధించి ఈ రచన చేసిన ఎలెక్స్ హేలీకి నిజంగా పాదాభివందనం చేయాలనిపిస్తుంది.
ఈ పుస్తకం నిజంగా ఒక పవిత్ర గ్రంధంగా దాచుకోవలనిపించేంత విషయాలు ఇందులో ప్రతీ పాత్ర మనతో చెప్తుంటాయి.

బానిసల పోరాటం, విముక్తికై వారు చూపిన సహనం తల్చుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంసి. కళ్లు చెమరిస్తాయి!

ఈ పుస్తకం గురించి విశ్లేషణ రాసేంత స్దాయి నాకు లేదని, పుస్తక పరిచయంగా ఈ పోస్టుని పెడుతున్నాను.
మీరు చదవడమే కాక ముందు తరాలకూ ఈ పుస్తకాన్ని అంద చేస్తే చరిత్రలో బానిసల ఆత్మ ఘోష, నిజాలు తెలుస్తాయి వారికి!

ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన సహవాసి గారికి ప్రత్యేక ధన్యవాదాలు!
గుండెకి దగ్గరిగా చేరిన పుస్తకాల్లో దీనికి నేను అగ్రస్ధానమివ్వడమే అలెక్స్ హేలీ గారికి నేనిస్తున్న గౌరవం!!!!!!!!!!


@  Raghu Alla

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.