తొలి ఉపాధ్యాయుడు

0
391

యునెస్కో అంచనా ప్రకారం అత్యధికంగా చదవబడే సమకాలీన రచయితల్లో “చింగీజ్ ఐత్ మాతోవ్” ఒకరని సగర్వంగా చెప్పవచ్చు.

అతన్నొక కమ్యూనిస్టు రచయిత మాత్రమే అనుకునుంటే చాలా పొరపాటని, ఆయన స్పృశించిన సామాజిక అంశాలు, మానవీయ కోణాలు, ఆధునికతకూ..సంప్రదాయాలకు మధ్య తలెత్తే వైరుధ్యాలను, ఒత్తిళ్లను ఒడిసి పడుటూ ప్రతి రచననూ హృద్యంగా అక్షరీకరించిన తీరు మహాద్భుతమని ఒప్పుకోకతప్పదు.
1962 లో తొలి ముద్రణైన ‘తొలి ఉపాధ్యాయుడు’ నవల లో చదువు కోసం తాపత్రయపడే ‘ద్యూయ్ షేన్’ అనే వ్యక్తి, తన శిష్యురాలైన ‘అల్తినాయ్’ అనే ఆవిడ మధ్య జరిగే అద్భుత భావ వ్యక్తీకరణలో రచయిత మన మనస్సులను ఆద్యంతం రక్తి కట్టిస్తాడు. ఓ తొలితరం ఉపాధ్యాయుడు బాహ్య ప్రపంచపు విజ్ఞానాన్ని,విద్యనూ తన కుగ్రామంలోకి తీసుకువచ్చి వారి జీవితాల్లో తీసుకువచ్చే అనూహ్య మార్పును…
ఆ ఉపాధ్యాయుడు పడే సంఘర్షణను,వ్యధను మనతో చర్చించి చివర్లో కంటతడి పెట్టిస్తుందీ నవల.
మారుమూల కిర్గిజ్ గ్రామం నుంచి మొదలైన అల్తినాయ్ అనే యువతి తన తొలి ఉపాధ్యాయుడిని అత్యంత విద్యావంతురాలై తన స్వగ్రామానికి చేరి కలిసిందా లేదా…!? ఆమె తన కృతజ్ఞతని ఎలా తీర్చుకుంది అనేది మన మాటల్లో చెప్పలేమనేది అక్షర సత్యం!

నా మాటల్లో చెప్పాలంటే..
ఇదొక అత్యద్భుత ప్రేమ కధ..
చదువుని ప్రేమించే ప్రతి ఒక్కరికీ,
ఆ చదువు ప్రేమలో ఉన్న వారందరికీ…
చదువులపై రాసిన, కంట తడి పెట్టించే అమూల్య రచన!

“చింగీజ్ ఐత్ మాతోవ్” కు మాత్రమే సాధ్యమైన రచనాద్భుతం!!!

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.