పది రూపాయల నోటు

0
397

పది రూపాయల నోటు

రచయిత: కిషన్ చందర్

మానవ సంబధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని రచయిత చాలా సూటిగా ఈ పుస్తకంలో చెప్తాడు.
మనం తయారు చేసుకున్న ఒక కాగితం ముక్కకి కరెన్సీ అని ఒక పేరు పెట్టుకోని, దానికో విలువ అని మనమే నిర్ణయించుకోని,దానికో నిర్దిష్ట కొలతలను పెట్టి మన విలువల్ని, ఆత్మాభిమానల్ని ఆ నోటు ముందు ఏరకంగా తాకట్టు పెట్టి మనుగడ సాగిస్తున్నామో,
కుంటిదైన నాగరికత ను నోట్ల చేతికర్ర సాయంతో మన జీవితాల్ని ఎలా కొనసాగిస్తున్నామనేది ఈ పుస్తకంలో మనకు చక్కగా వివరించబడుతుంది.

ఒక పది రూపాయల నోటు ఎక్కడెక్కడ తిరిగింది? ఎంతమంది చేతులు మారింది? వారి జీవితాల్లోకి తొంగి చూసి మనకేం చెప్పింది! అనేది ఈ పుస్తకంలోని సారాంశం.

మనిషి మనుసులో ఉన్న తప్పులకు, తను ముద్రించబడినప్పుడు తనపై పడిన అచ్చుతప్పులకు విలువను పోల్చుతూ ఒక మంచి సందేశాన్ని నేటి లోకానికిస్తుంది.

పది రూపాయల నోటు ఆత్మకధే ఈ పుస్తకం.

చాలా అద్భుతమైన కధనం మరియు అంశం.
విశాలాంధ్ర వారి ప్రచురణ!
కిషన్ చందర్ రచనలన్నీ మన జీవితంలోని ఏదొక భాగాన్ని స్పృశిస్తాయి.
ఒక అద్భుత భావనకు గురిచేస్తాయి.
సరళమైన భావాలతో ఏకధాటిగా చదివిస్తాయి.
చదవాల్సిన పుస్తకం!
ఆ “పది రూపాయల నోటు” చెప్పే కబుర్లని,కథల్ని తప్పకుండా వినాల్సిందే!

“ఒక మంచి పుస్తకం”!


Raghu Alla

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.