మనసు మనిషి

0
564

మనసు సున్నితం.
మనసు భావతరంగాల- 
సమాహారం..
నీదీ నాదీ ఏదీ లేదు..
నువ్వు నేను కలిస్తే-
అంతా మనమూ మనదే!

మనిషి యాంత్రిక జీవన తులాభారం.
నీదీ-నాదీ..
నీకెందుకు-నాకిందుకు?
నీవెందుకు-నేనందుకు..
నీవెక్కడ-నేనిక్కడ?
నీకింత-నాకింత..
అంటూ తక్కెటలో తూకాలే!

అలుపూ,సొలుపూ లేని
మరమనిషి అయ్యాడు..
కాదు కాదు ఆశ,స్వార్ధం-
కోపం,అసూయల చేతిలో..
కీలుబొమ్మ అయ్యాడు..
మన అన్న పదాన్నే
మరచాడు!

మనసుని మరచి,
మంచిని విడిచి..
మనసుని వంచించుకుని..
మంచికీ-చెడుకీ తేడా తెలియక
చేసేదే మంచని తలంచి..
ముందుకు సాగుతున్నాడు.
బంధాలను గాలికెన్నడో వదిలేసి..
డబ్బువెనకనే పరిగెడుతున్నాడు!

ఈ పయనమెక్కడికో..
ఆశకి అంతం లేదు..
మనిషికి అలుపు లేదు..
ఎందుకో?ఎవరికోసమో-
ఈ తాపత్రయం?
ఉన్నవాటిని కాదనీ,
లేని దానికోసం వెంపర్లాట..
మనసులేని మనుషుల
అనితర పోరాటం.ఎక్కడికో? ఎందుకో?…….తెలియదు ఎవ్వరికీ….


@తులసి..

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.