పుష్పార్చకం…!

0
508

పూబాల ఎంత సుకుమారమో, ఆ పువ్వులని నలిపేసే మా మనసు అంత ఖాటిన్యం..
నవ్వులు చిందే పువ్వుకి ఎలా మన చేతుల్లో మరణం..??
సౌందర్యాన్ని వేదజల్లె సుమాలకి తప్పదా ఈ ప్రాణగండం..??
ఆ సుమాల విషాదమే మన సరస సల్లాపాల ప్రణయమా..??
పూజకి కూడా విరుల మరణమే శరణ్యమ..??

మలినమైన పాదాల క్రింద మసిబారిపోటమే వాటికి శాపమా..??
అందానికి అలంకారమై అవి మనకి దాసోహం అవ్వటమే పువ్వుల జన్మ రహస్యమా..??
దారానికి దారగతం అవ్వటమే మందార మకరంద వినాసనమా..??
గుచ్చి గుచ్చి గాయపరచి అల్లికలు అల్లటమే వాటికి మన బహుమానమా..??
ఓ గులాబి నీ కింద వున్నా ముళ్ళు కన్నా ఖర్కసమమ్మ మా మనో ఫలకం..

ఓ పువ్వమ్మా మన్నించమ్మ మా మనసు లేని మానవుల దోషం..
ఓ పుష్పమా ఏమిచ్చి తీర్చుకోము నీ సున్నిత జన్మ ఋణం..
నేర్పుమ మాకు మరణంలో కూడా నీల నవ్వులు చిందే తత్వం..
ఓర్చుకోనుమా నీ వేదనం ఆ నవ్వుతోనే ఓ సుమం..
ఏనాటికి నేర్చుకోలేము నీలా మేము సాయపడే గుణం..
కష్ట నష్టాలలో కూడా మందహాసం చిందించటమే నీ అపురూప జన్మకు దొరికిన మనోహర వరం…..


@ అభిలాష

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.