వెన్నెల కెరటాలు-5 

0
379

వెన్నెల కెరటాలు-5


ఎంత ఆర్తిగా హత్తుకుంటాయి నీ తలపులు ?
ఎన్నో రాత్రులని దొర్లించేస్తూ
ఒకోసారి మదికి నీ చల్లని స్పర్శేదో తాకినట్లుంటుంది
మరోసారి చెమ్మగిల్లిన చూపులు చూస్తుంటుంది

కొన్ని నిర్జీవక్షణాలని ఒంపుకుంటూ
నిశబ్ద సంగీతాలు నన్నావరిస్తుంటే
కొన్ని ఆకులు రాల్చిన ఆ చెట్టు పై
నల్లని వెన్నెలని చూస్తుంటా

.
కొన్ని రాత్రులని దగ్ధం చేసి
వెలుతురు కోసం ఎదురుచూస్తూ
కొన్ని తీపి సముద్రాల్ని తాగి
ఊరడించుకుంటా నువ్వోచ్చేస్తావని

.
జీవించడం నేర్పిన నువ్వు
నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో చెప్పలేదు
బంగారూ ! వియోగపు అనుభూతులు మధురమే
నా గుండె నీ జ్ఞాపకాల సవ్వడి చేస్తున్నంతవరకు

#సిఎస్కే

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.