వెన్నెల కెరటాలు2

2
610

బలహీనతలే లేవు అనుకున్నానీ

తలపులు నాకో వ్యాపకం కానప్పుడు

వ్యసనమే లేదనుకున్నా
నిన్ను మరచిపోవడం తెలీనంతవరకు

ఇన్ని అక్షరాలూ జల్లి, ఓ శిల్పం చెక్కుతాను
అది విచిత్రంగా నీ రూపమవుతుంది
నక్షత్రాలు మూటగట్టి ఆకాశంలోకి విసురుతాను
అక్కడ నువ్వు జాబిలై కనబడతావు

ఒంపుకున్న ఆ క్షణాలు కావాలనిపిస్తుంది
చూపుల సంగమంలో
రెండు మనసుల గుసగుసలు
ఒకరిలో ఒకరు కోల్పోతో ..

రెండు ఆత్మలు అనుసంధానమయితే
కలయిక , వియోగం తేడ తెలీదేమో
బంగారూ! దూరమయ్యింది భౌతికమే
అసంకల్పితంగా నీ తలపులనే శ్వాసిస్తున్నంతవరకూ


CHANDRASEKHAR KANCHI

 

2 COMMENTS

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.