ఆమె కథ (పార్ట్ 3)

0
455

ఏడేళ్ళకే కుటుంబ బాధ్యతను మీద వేసుకుని, పెద్దరికాన్ని స్వీకరించి ,సినిమాలలో బాల నటిగా మారిన బేబీ మీనాకు ఇప్పుడు 14 సంవత్సరాల వయస్సు వచ్చింది. జయరాజ్,మెహతాబ్,సుఖరామ్ మోడి వంటి ప్రముఖ దర్శకులు ఆమెకు తమ సినిమాలలోనటించే అవకాశమిచ్చారు. వీర ఘటోత్కచ్,శ్రీ గణేశ్ మహిమ,అల్లాడీన్ వంటి స్టంట్,ధార్మిక సినిమాలలో బేబీ మీనా హీరోయిన్ గా నటించింది.

హీరోయిన్ తల్లులకు సహజంగా లభించే డాబూ దర్పంతో ప్రభావతి ఇప్పుడు మేడమ్ గా మారింది.
సౌకర్యాలు ,హంగులూ ఆర్భాటాలు పెరిగాయి. హీరోలతో యుగళ గీతాలు పాడుతూ,రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తూ బేబీ మీనా బాల్యం కాస్తా ఆవిరైపోయింది.

Leather face సినిమాలో బాల నటిగా అవకాశమిచ్చి మెహజబీన్ పేరును మీనాగా మార్చిన దర్శకుడు విజయ్ భట్ ఒక ప్రతిష్ఠాత్మక సినిమాను తీయాలనుకున్నారు. హీరోగా అనుకున్న దిలీప్ కుమార్ ఏ కారణం చేతో తప్పుకున్నారు. హీరోయిన్ నర్గీస్ కూడా నిరాకరించింది. ఆ సమయంలో మీనా విజయ్ భట్ ను కలిసి ఆ అవకాశం తనకు ఇవ్వమని కోరింది.

విజయ్ భట్ ఆమె Screenshotsను తీయించారు. Stunt,ధార్మిక సినిమాల్లో నటించే హీరోయిన్ ను ,తన Prestigious film లో తీసుకోవద్దని కొందరు విజయభట్ పై ఒత్తిడి తెచ్చారు.కానీ ఆయన ఒప్పుకోలేదు.
బేబీ మీనా పేరును మీనా కుమారిగా మార్చి 1952 లో ఆమె హీరోయిన్ గా చేసిన ఆ సినిమాను రిలీజ్ చేశారు.

ఆ సినిమానే Super hit film” బైజూ బావరా”.

(ఇంకా ఉంది).

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.