ఆమె కథ (పార్ట్ 2)

0
452

మీనాకు తన వయసు పిల్లలతో కలసి స్కూలుకు వెళ్ళాలని,వారితో కలసి ఆడాలని,అల్లరి చెయ్యాలని కోరిక ఉండేది. తండ్రి కూడా మీనా కోరికలను కాదనకూడదనుకున్నాడు.

కానీ తల్లికి తమ యధార్థ దారిద్ర్య స్థితిని తట్టుకునే శక్తి లేదు. అందుకే ఆ పాపను తీసుకుని ప్రముఖ దర్శకుడు విజయ్ భట్ వద్దకు వెళ్ళింది. తన కూతురుకు సినిమాలో అవకాశమివ్వమని బ్రతిమలాడింది.

ముద్దులు మూటకట్టే చిన్ని పాపకు ఆయన తన Leather face సినిమాలో ఒక రోల్ ను ఇచ్చాడు.
బేబీ మీనా గా పేరు మార్చాడు. చదువుకోవాలనే కోరికను తల్లికి భయపడి అణచుకుందేగానీ ,ఆ తీరని కోరిక గుండెలలో గాయమై జీవితాంతం బాధ పెడుతుందని ఊహించ లేక పోయింది.

ఒక సీన్ లో పిల్లి తన ముఖం నాకుతుంటే విపరీతమైన భయం వేసినా ,ఉరుముతున్న తన తల్లి కన్నులు మరింతగా భయపడేలా చేశాయా పాపను. తోటి పిల్లలతో ఆటపాటలను,చదువును వదులుకుని,వాటికి బదులుగా తన కుటుంబానికి తిండి,గుడ్డ,ఇంటిని కానుకగా ఇచ్చింది.

ఒక రోజు స్టూడియో లో ఆడుకుంటున్న మీనా ను చూసిన హీరో ఒకరు’త్వరగా పెద్దైపో ,నా ప్రక్కన హీరోయిన్ గా నటించాలి నువ్వు’అని జోక్ చేశాడు. కాలం గిర్రున తిరిగింది.
14 ఏళ్ళకే హీరోయిన్ అయ్యి హీరోలతో యుగళ గీతాలు పాడుతూ ,రొమాన్స్ సీన్లలో నటించాల్సి రావడం

ఆమె బాల్యానికి తగిలిన మరొక దెబ్బ.
ఆ హీరో అన్నట్లుగానే జరిగింది.
ఆ హీరో ప్రక్కన హీరోయిన్గా ఆమె బుక్ అయ్యింది.
అతనే ఆ నాటి ప్రముఖ హీరో అశోక్ కుమార్ ,
ఆమె మన ఈ కథకు నాయకి ,ట్రాజెడీ క్వీన్ గా ప్రసిద్ధురాలైన హీరోయిన్ ….”మీనా కుమారి” .

(ఇంకా ఉంది)@ మీనాక్షి సాక్షి..

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.