ఓయీలాలో

0
150

మన సంస్కృతిలో ప్రతీ భాగం పాటలతో ముడిపడి ఉండేది.. పుట్టినప్పటినుండీ..ప్రతి సందర్భాన్నీ క్లుప్తంగా పాటలలో నిక్షిప్తంచేసేవారు..

నాకు తెలిసిన నాటు వేయటం గురించి నా మాటల్లో…

ఓయీలాలో…ఓ..ఓ..
ఓయమ్మ.. రావమ్మ
పోదాము పొలములోకి
తొలకరి కాలం..కరిమబ్బుల మేళం
సిట సిటా రాలేటి సినుకు రాగం
నీరు నిండిపొంగేటి పొలం
దుక్కి దున్ని దమ్ము చేసిన పొలం
గట్టంత నాని..పుట్టంత అల్లేటి
ఆకుపచ్చ కాలం..
సినుకు రాలేటి సిత్తడి కాలం
సీకుసింత గట్టున పెట్టి కొంగుబొడ్డున దోపి..
నారుకట్టి పట్టి ..నేలతల్లి కడుపున
ఆకుపచ్చ బిడ్డల్ని నాటేద్దాము
బిడ్డలన్ని ఎదుగుతుంటే
కళ్ళలోన ఒత్తులేసి కాపు కాద్దాము
కలుపు తీయాలి…నీళ్లు పెట్టాలి
ఎదిగేటి బిడ్డల్ని కళ్లారా చూస్తూ
చీడ పీడ రానీయకుండా మందు చల్లాలి..
నిండుగర్భిణి ఈనిన పొలం
దిష్టిబొమ్మ కట్టి..ముల్లుకర్ర చేతపట్టి
పాముల..జెర్రిల అదిలిస్తూ
బంగరు రంగు పసిడికాంతులు
మిసమిస మెరుస్తుండగా..
రైతు కళ్ళలోన వెలుగు
నేలతల్లి నవ్వేను నిండుగా..
గాదెల నిండేను..వాకిళ్ళు మెరిసేను..
కలకళలాడెను పల్లెలన్నీ..
ఓయమ్మ రారమ్మ పోదాము పొలములోకి..


తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.