గురుదక్షిణ – ద్వితీయస్థానం పొందిన కధ

0
444

గురుదక్షిణ


ఏమండీ చూసారా….పేపర్లో ‘పదవీవిరమణ శుభాకాంక్షలు’ అంటూ వృత్తే దైవంగా బావించే అపర సర్వేపల్లి, వినయశీలి…’ అంటూ పెల్లలెంత బాగా రాసారో…..మనిద్దరి కలర్ ఫోటో కూడా వేయించారు…చూడండీ…….’ కిటికీ నుండి బయటకు చూస్తున్న భర్త దగ్గరకు న్యూస్ పేపర్ తో వచ్చి చూపిస్తూ అంది అరుణ.
‘……….’
ఏమిటండీ……వాల్లంతా సంతోషంగా వేయిస్తే మీరేం మాట్లాడరెంటండీ …..’
‘ఈ రోజుతో నా ప్రాణానికి ప్రాణమైన బడితో, నా పిల్లలతో నాకు బంధం తీరిపోతుందంటే బాధగా ఉంది….ఇంకేం మాట్లాడను….’కనుకోలుకుల్లో నిల్చిన నీళ్ళను కొనగోటితో తుడిచేస్తూ అన్నాడు సత్యనారాయణ.

అరుణ అంతరంగం కూడా ఒకసారి బాధతో మేలిపెట్టినట్లయ్యింది. ఆమెకు తెలుసు అతనెంత బాధపడుతున్నాడో… సంవత్సరం నుండి ప్రతి నెల…ప్రతివారం…ప్రతిరోజూ… తన రిటైర్మెంట్ దగ్గరకోచ్చేస్తుందని రోజులు లెక్క పెట్టుకోవడం తానూ చూస్తూనే ఉంది. యాభై ఎనిమిది సంవత్సరాల రిటైర్మెంట్ ను అరవై సంవత్సరాలకు పెంచాలని ఆ బాగావంతునికి రోజు చేసే వెన్న్పాలన్నింటిని గమనిస్తూ, తానూ వేడుకుంటూనే ఉంది. గత వారం రోజులుగా సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. అయినా అతని బాధకు తానూ సానుభూస్తి చూపిస్తూ ‘అయ్యో’ అని జాలి చూపితే, ఆటను మరింత కున్గిపోటాడని బాధపడుతున్న తన మనస్సును నొక్కి అతనికి తెలీకుండా అతని ముందు హుషారుగా ఉంటూ, అతన్ని ఉత్సాహపరచడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది.

భలే ఉన్నారండీ…ఎందుకూ బాధపడటం…మేరె ఇంకా ఫెవికాల్ గా సంవత్సరాల తరబడి కుర్చీకంటుకుంటే మన పిల్లల్లాంటి యువతరానికి జాబ్లేలా వస్తాయి. ఇంతకాలం ‘స్చోల్’…’స్కూల్’ అంటూ లేటెస్ట్గా ఇప్పటి విజ్ఞానికి సరిపదేట్లు భోదించడానికి రోజు మీరు చేసే ‘హోమ వర్క్’, హాలీడేస్ లో తీరిక లేకుండా ఎదో జనాబాలేక్కలు లాంటి పనులతో ఎ తీర్ధయాతరాల కేలదామన్నా ప్రశాంతతే లేకపాయే..ఇపుడు దేవుడు ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగించారని ఎందుకనుకోరు……’సమాదానపరుస్తూ అంది అరుణ.

ఎక్కడో పుట్టి…ఎక్కడో పెరిగి ఇక్కడే సలిసాము…..చదువులమ్మ చెట్టునీడలో….’ రింగ్ తోన్ తో సెల్ మోగడంతో తీసాడు.

నాన్నా….పదవీ విరమణ శుభాకాంక్షలు నాన్న……’కూతురు, ఆ తర్వాత అల్లుడు విషెస్ చెప్పారు. చాలా దూరంగా డిల్లీలో ఉండటాన, అతనికి సెలవు దొరక్క రాలేకపోతున్నందుకు బాధపడుతూ కాస్సేపు మాట్లాడి పెట్టేసారు. ఆ తర్వాత, కేరళలో ఉన్న కొడుకు, కోడలు కూడా మాట్లాడారు. అలా ఆత్మీయుల నుండి, బంధువుల నుండి ఫోన్ లు వస్తూనే ఉన్నాయి.

అన్యమనస్కంగానే తయారయ్యాడు. ‘సత్యనారాయనగారంటే’ సమయ పాలనకు, క్రమ శిక్షణకు, వినయవిధేయతలకు పెట్టింది పేరుగా, పేరు తెహ్చుకునాడు. ప్రతి రోజు కన్నా పావుగంట ముందే వెళ్ళాడు. ఉపాధ్యయనీ, ఉపాధ్యాయులంతా ప్రదానోపాధ్యాయుని తో సహా గౌరవపూర్వకంగా అతన్ని కలిసి విషెస్ చెప్పారు. ప్రార్ధన మొదలయ్యింది….’

వందేమాతరం….సుజలా…సుఫలాం….మలయజసీతలాం…’ ఇక రేపటినుండి తన జీవితంలో ఈ ప్రార్ధన వినబదదేమో…..

భారతదేశం ణా మాతృభూమి…భారతీయులందరూ ణా సహోదరులు….’ ఈ ప్రతిజ్ఞ ను తను వినలేదు. వందేమాతరమైనా ప్రతి రోజు ప్రొద్దుటే రేడియోలో వింటాడు, ఎదో పిల్లలతో కాకపోయినా, విద్యార్ధులందరికీ ‘వందేమాతరం’ బకిం చంద్ర చటర్జీ’ రాసాడని తెలుసుగాని, ప్రతిజ్ఞ ఎవరు రాసారో తెలీదు. తానూ ఆ విష్యం అడుగుతూ, ఇలా ‘ పైడి మర్రి వెంకట సుబ్బారావు 19 62 లో ‘ రాసాడని చెబితే, పిల్లలెంత సంతోషించారని……. అసలు వాళ్ళతో తనకున్న అనుబంధం మామోఒలుది కాదు. ఇంట్లో తన పిల్లలను అంతగా పట్టించుకోలేదేమోగాని, ఈ పిల్లలు మాత్రం తన పంచ ప్రాణాలు. తను కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమె చెప్పేవాడు కాదు. సమయసంద్ర్భానుసారంగా ఆయా తేడీల్లో వచ్చే ప్రత్యేకమైన పండగలు, వాటి చరిత్ర నీతి కధలు, సంస్కారం ఇలా చాలా చాలా ఆసక్తి కలిగేలా చెప్పేవాడు.

స్వాతంత్ర్యదినోత్సవం రోజు, దాని వెనక ఎందరి వీరుల త్యాగాలున్నాయో, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం , జలియన్ వాలీబాగ్ సంమవేశంలో జనరల్ ‘డయ్యర్’ చేసిన దురంతం, భగత్‌సింగ్, అల్లూరి ఇలా చాల చెప్పేవాడు. వినాయకచవితి గురించి చెబుతూ, శ్లో కానికి అర్ధం చెప్పేవాడు. గురుపూజోత్సవం రోజు ‘నైతిక విలువలను కాపాడే బాధ్యతా ఉపాద్యయులాడే. ఆటను సమాజ నిర్మాత, సామాజిక వైద్యడు’ అంటూ, సర్వేపల్లిగారు రాష్ట్రపతి అయాక పుట్టినరోజున సంమానించడానికి వచ్చి వారితో ఆ రోజు ఉపాధ్యాయదినోత్సవంగా జరుపుకుంటే సంతోషిస్తానని చెప్పిన విశేషాలు, ‘విధ్యాతురానాం న సుఖం న నిద్ర’ అంటూ, ‘ప్రారన్మ్భించారు నీచ మానవులు..’ పద్యాన్ని, ‘చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు’ అంటూ నీటి పద్యాలను, శతకాలను, ఇలా పీరియడ్ లో ప్రత్యేకంగా పది నిమిషాలు వీఇతికి కేతాయిన్చేవాడు. అలేగ్జందర్ చనిపోయినపుడు తన చేతులు ‘కెఫీన్’ లో నుండి బయటకు పట్టి, ఎ సందేశం ఇచ్చాడో ఆ కదా ఇలా చాలా చాలా చెప్పేవాడు. అందుకే పిల్లలంతా నిజంగా తనని బాగా ఇష్టపడతారు.

పైగా తానూ వచ్చినపుడు పాఠశాలలో కొంతమంది విద్యార్ధులే ఉండేవారు. తానూ, మరో ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి ఊరంతా తిరిగి, కూలినాలి చేసుకునే వారి పిల్ల్లల్ని, గొర్రెల కాపర్లుగా ఉన్న పిల్ల్లల్ని బలవంతాన వారి తల్లితండ్రుల్ని నయాన, భయానా ఒప్పించి పాఠాశాలలో చేర్పించారు. అలాంటి నలుగురైదుగురు పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు తానె కొనిచ్చేవాడు. అందరి చప్పట్లతో ఆలోచనలనుండి బయటపడ్డాడు. ఆరోజు పదవీవిరమణ సందర్భంగా ప్రేయర్ లో పిల్లలందరితో హెడ్ మాస్టర్ చప్పట్లు కొట్టించారు. లయ బద్దంగా అందరూ ఒకేలా కొట్టేట్లు తానె నేర్పించారు పిల్లలకి. ఇప్పుడు తనకే నీరాజనాలిస్తున్నారు చప్పట్లతో. చప్పట్ల వాళ్ళ ‘ఆక్యుపంచర్’ విధాన ద్వారా ఎంత లాభమో కూడా పిల్లలకి తానె చెప్పాడు. ఇక ఈ ఆలయం లాంటీ పాథశాల ప్రాంగణం తో తన అనుబంధం తీరిపోయింది. ఇన్ని సమ్వత్సరాలూ దీనితో ఉన్న బంధం ఇక దూరమైపోతుంది. విశాలమైన ప్రాంగణం శుబ్రం చేయించి, మొక్కలు నాటించేవాడు. వాటికి నీల్లుపోయడం, కలుపు మొక్కలు తీసేయడం, పాదులు తవ్వడం చేయించేవాడు. అలుపు తెలియకుండా పాటలు పాడించేవాడు. ఆటలకు అనువుగా గౌరండ్ ఉంచడం నేర్పేవాడు.

బెల్ కొట్టడంతో ఇహలోకంలోకోచ్చి క్లాస్ రూమ్ వైపు నడిచాడు. లోనికేల్లగానే పిల్లలంతా లేచి విష్ చేసారు. ఇక రేపటినుండి ఈ పిల్లలంతా తనకు కనబడరు అనుకోగానే మనస్సు బాధగా మూలిగింది. జేబులో నుండి పెను తీసి ‘శంకర్’ అని పిల్చాడు. అతను రాగానే ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ చెబుతూ ఇచ్చాడు. ఎప్పటిలాగే పిల్లలందరితో అనిపిస్తూ చపట్లు కొట్టించాడు. ఈ క్లాస్ టీచర్ అయ్యాక ప్రతి విద్యార్ధి పుట్టినరోజుకి ఇలా ప్రత్యేకంగా ఏదైనా తెచ్చివ్వడం అతని అలవాటు. అది చాలా చిన్న బహుమతి అయినా ఆ లేత మనస్సులో అతనికి చిరస్థాయి స్థానాన్ని ఏర్పరచింది. ఆటను పిల్లల్నేప్పుడూ దండిచలేదు. హోమ్‌వర్క్ చేసుకురాకపోతే అనునయంగా ఎందుకో కారణం తెలుసుకునేవాడు. ఆ సాయంత్రం ఎక్కువసేపుంది చేయించేవాడు. అలా చదవకపోతే జరిగే పరిణామాల గురించి హెచ్చరించి కార్యోన్ముఖుల్ని చేసేవాడు. చాలా మంది పేద విద్యార్ధులే అవడంతో అడపాదడపా తానూ పట్నం నుండి హోల్‌సేల్ గా తెచ్చిన పెన్నుల బాక్స్ లోని పెన్నులను పంచేవాడు. ప్రతిరోజూ చదువులో వనకబడిన విధ్యార్ధులను గుర్తించి సాయత్రం వారితో ఉంది ప్రత్యెక శ్రద్ధతో వివరంగా భోధించేవాడు.

ఆటను ఆలోచనల్లో ఉండగానే కాలిపై తడిగా అనిపించడంతో కిందికి చూసాడు. శంకర్ రెండు కాళ్ళపై పది ఏడుస్తున్నాడు. ఆ విన్తనే క్లాస్ లో వరుసగా వెక్కిళ్ళు, ఏడుపులు వినిపించాయి. దాదాపు పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఇంట వయసున్న తానె రేపటి నుండి రానని అంతర్మధనం తో బాధపడుతుంటే ఇక చిన్న పిల్లలు, తనతో ఉన్న అనుబంధానికి బాధ పడటం సహజమేననిపించింది. అతన్ని పేలి ‘నేనేక్కదికేలుతునాన్రా..కేవలం స్కూల్ కి రానంతే’ అంటూ గాధంగా హత్తుకున్నాడు. ఆటను విదివద్దాడో లేదో, కాళ్ళను కన్నీళ్ళతో అభిషేకిస్తూ చుట్టేశారు , తిరుపతి, శివ, వెంకన్నలు… బలవంతాన లేపాడు.
‘సార్…మీ వల్లే నన్ను మా వాళ్ళు స్కూల్ కి పంపిస్తున్నారు సర్… ఇక మీరేలితే నన్ను పంపారు సర్….నాకు బాగా చదువుకుని మీ అంట పెద్దగా కావాలనుంది సర్….’ అంటూ ఏడుస్తున్నాడు తిరుపతి.
అతన్ని పంపిచడానికి అతని తల్లితండ్రులస్సాలు ఒప్పుకోలేదు. గొర్లను కాయడానికి ఎవరూ లేరని, రెక్కాడితేగాని డొక్కాడని బ్రతుకులకి అతని పుస్తకాలకి డబ్బులెక్కడ నుండి పెడతామని ….. ఇలా ఎన్నో వాదించారు. ఆ అబ్బాయి ఉత్సాహం గుర్తించి ‘మీరు పెట్టలేని బలవర్ధకమైన మధ్యాహన్న భోజనం పాఠశాలలో తాము పెడతామని, పుస్తకాలూ, పెన్నులు తానే కొనిస్తానని వారి పిల్లలు కూడా వారిలాగే ఉండాలో పైకి ఎదగాలో నిర్ణయించుకోమని, పిల్లలపై ప్రేముంటే పాఠశాలలో చేర్పించాలని లేకపోతె అలాంటి చిన్నపిల్లలతో పనులు చేయిస్తే బాల కార్మిక నిర్మూలన చట్టం కింద అరెస్టు చేస్తారని, నయాన భయాన చెప్పి ఒప్పించి పాఠశాలలో చేర్పించాడు.

అలాగే వెంకన్న తల్లితండ్రులు రోడ్లపై దేవుడి చిత్రపటాలను రంగు రంగుల చాక్ పీసులతో వేసి భిక్షం అడుక్కునేవాళ్ళు. వాళ్ళు కూడా అతన్ని అస్సలు పంపమన్నారు. ఇలాగే వారినీ కన్విన్సు చేసాడు. ఇప్పుడు వాడూ ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఆ రోజనతా పిల్లల్ని సమాదానపరుస్తూ, చిన్న చిన్న జోక్స్, కధలతో అలరిస్తూ, ఇక ముందు ముందు పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి సమయాన్ని వృధా చేయకుండా వారు అనుసరించాల్సిన టైం టేబుల్ని తానూ వెళ్ళినా తానూ మొదలుపెట్టిన అన్ని పద్ధతులు క్రమం తప్పక పాటించాలని, అవి చేసే మేలును వివరిస్తూ గడిపాడు. పోటీ ప్రపంచంలో ప్రైవేట్ విద్యాసంస్థలలో చద్విన పిల్లలను తట్టుకోవాలంటే తామూ ఇగ్లీష్, కమ్యునికేషను స్కిల్స్ పెంచుకోవాలని ప్రతిరోజూ కిక్షనీ నుండి ఒక చిన్న ఆంగ్లపదాన్ని రోజుకొకరితో చెప్పించేవాడు. ఆ పదం అర్ధాన్ని, వాక్యంలో ఉపయోగించే విదాన్నాన్ని చెప్పి నలుగురైడుగురితో వేరే వాక్యాలు చెప్పించేవాడు. అలా నేర్చుకోవడం మానోద్దంటూ అందరినీ పలకరిస్తూ గడిపాడు. అందరికీ తన సెల్ నంబర్ ఇచ్చి , ఎప్పుడు మాట్లాదాలనిపించినా మాట్లాడమన్నాడు. అలా అన్ని పీరియడ్స్ లో తానూ వెళ్ళే అన్ని తరగతుల విధ్యార్ధులతో తృప్తిగా గడిపాడు. ఆయాలతో సహా అందరినీ పలకరించి వీడ్కోలు తెలిపాడు.

ఆ రోజు భోజనాలు అందరికీ సత్యనారాయనగారే స్పాన్సర్ చేసారు. పేరు పేరునా ప్రతి ఒక్కరినీ పలకరించాడు. భోజనాలు కాగానే పదవీ విరమణ మీటింగ్ అరేంజ్ చేసారు. ప్రత్యెక ఆహ్వానితులైన డీ ఈ వో కూడా వచ్చారు. చుట్టూ ప్రక్కలున్న నాలుగు స్చూల్ల నుండి టీచర్లు, రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ కమిటీ లీడర్లు, ఇంతకుముందు పనిచేసిన పాఠహాల్ల నుండి కూడా కొందరు విద్యార్ధులు వచ్చారు. సత్యనారాయణ, అరుణ దంపతులను పూలు చల్లుతూ వేదిక పైకి ఆహ్వానించి మహారాజా కుర్చీల్లో ఆసీనులను చేసారు. పిల్లలు రకరకాల పాటలు, నృత్యాలతో ఆయనకు నమోవాకాలర్పిస్తూ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో నీరాజనాలర్పించారు. అలా చాలా చాలా వైభవంగా కార్యక్రమాలు ముగిసాయి. తీచార్లందరూ కలిసి వారి గుర్తుగా బంగారు ఉంగరంతో శాలువాతో సత్కరించారు. ఒక్కో తరగతి వారంతా కలిసి ఒక్కి బహుమతిని మాస్టారికి గురుభాక్తితో సమర్పించుకున్నారు.

ఇక సత్యనారాయణ మాస్టారు క్లాస్ టీచర్‌గా ఉన్న తరగతి లోని వాళ్ళంతా ఒక్కొక్క విద్యార్ది వ్యక్తిగతంగా తమ అభిమానాన్ని చిన్న చిన్న బహుమతుల రూపేణా చూపించుకున్నారు. అంటా చూస్తున్న వెంకన్న మనస్సు మనస్సులో లేదు. గత వారం పది రోజులనుండి బాగా ఆలోచిస్తున్నాడు. అతని క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదో చిన్న చిన్న బహుమతులైనా ఇస్తున్నామని చెప్పడం చూపెట్టడం అతని మనస్సుని కల్లోలపరిచింది. కానీ అతని తల్లితండ్రులు రోడ్డుమీద చిత్రపటాలకు వచ్చే చిల్లర పైసలపైనే బ్రతకాలి. అవి వారి పోత్తకే సరిపోవు. ఊరి చివరన చిన్న పూరి గుడిసె. చిరుగుల చొక్కాతో స్చూల్కి రాలేకపోతే, మాస్టారు ఎందుకు రావడం లేదని ప్రత్యేకంగా కనుక్కున్నాడు. తానూ చెప్పలేక చెప్పలేక చెబితే, తనకు మూడు డ్రెస్సులు కుట్టిచాడు. ఇప్పుడు మిగతా వారందరికన్నా తనవే బాగున్నాయి. ఎన్నిసార్లు పెన్నులు, పుస్తకాలు, బాగ్‌లు ఇలా ఎన్నో కొనిచ్చాడు. తానూ క్లాస్ ఫస్ట్ వస్తాడు. అలాంటి ఆయన ఇక మొత్తానికే రిటైర్ ఐ వెళ్లిపోతుంటే గుందేలనిడా ఎంత అభిమానముంటే మాత్రం తానెం ఇవ్వలేదా…తన ప్రేమను ఎ రకంగానూ చాటుకోలేడా…. ఇలా ఆలోచించి, ఆలోచించి చివరకు రాత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిద్రపోకుండా తాననుకున్న పని శ్రద్ధగా , దీక్షగా పూర్తీ చేసాడు. అది చిన్న పేపర్ లో చుట్ట బెట్టుకుని వచ్చాడు. వీలయితే ఎవరికీ తెలియకుండా , ఎవ్వరు నవ్వకుండా సార్ ఒక్కరే ఉన్నప్పుడైనా ఇద్దామనుకున్నాడు. కాని ఆ రోజంతా సార్ చాలా బిజీగా అందరితో మాట్లాడుతూనే కనిపించాడు. ఇక సార్ వెళితే తన చదువు సాగదని వాడికి తెలుసు. దానివల్ల కూడా అతని ఏడుపు ఉద్రుతంయ్యింది. చివరకు రోజు కూలి నాలి చేసుకునే అమ్మానాన్నలున్న తిరుపతి కూడా మంచి పెన్నునుబహుమతిగా ఇస్తున్నాడు. శివ తల్లితండ్రులు కుండలు చేస్తారు కాబట్టి వాడు ఆ మట్టితో మాస్తారిలా చిన్న బొమ్మ మట్టితో చేసి చూపించాడు.

ఇలా ఇంతమంది తెచ్చిన విలువైన బహుమతుల ముందర తాను ఇవ్వదల్చుకున్నది వెలవెల బోతుందేమో… వేదిక పైకి తన స్నేహితులందరూ ఒక్కొక్కరు వెళ్లి సార్ దీవెనలు తీసుకుని దిగిపోతున్నారు. ఏమీ ఇవ్వలేని వెంకన్నను చూసి వారి కళ్ళు గర్వంగా నవ్వుతున్నాయి. వాడికి ఏడుపు వాళ్ళ కాళ్ళ ముందున్న మాస్టారు మసక మసకగా కనబడుతున్నాడు. వెంకన్న రాక పోయేసరికి, వాడి ఏడుపు చూస్తున్న మాస్టారు తానె వేదిక పైకి పిలిచాడు. వాడు అంగీ కింద తానివ్వ్వదల్చుకున్నది దాచుకుతూ వెళ్ళాడు.

ఎరా…. ఎం దాచుకున్నావ్….’ మాస్తారదగడంతో తీసాడు. ఏమీ ఇవ్వలేని నిస్సహాయతతో కూడిన వాడి తల నేలకు వంగిపోయింది.
దానిని చూసిన మాస్టారి కళ్ళు ఆశ్చర్యానందాలతో విప్పారాయి. దానిని పైకెత్తి అందరికీ చూపించాడు.

చూసారా…ఏమీ ఇవ్వలేనివాడి బాధ, వాడిలోని సృజనత్మతకతను వెలికి తీసింది. డ్రాయింగ్ బాగా వేస్తాడని తెలుసుగానీ, ఇంకా కల ఉందని నాకూ ఇప్పటివరకు తెలీదు…’ అన్నాడు. ఆ బహుమతి ఒక చిత్ర పాఠం. ఎడమ చేతిలో పుస్తకం పట్టుకుని కుడి చేతితో దీవిస్తున్నట్లుగా ఉన్న ఆ చిత్రంతో ఉన్నది మాస్టారు. అతని రూపురేఖలు, వేషధారణ ఆ చిత్రంలో ప్రస్పుటంగా ద్యోతకమవుతున్నాయి. అంతేకాదు ఆటను దీవిస్తున్నాది క్రింద తన కాళ్ళకి ప్రణామం చేస్తున్న విద్యార్ధికి. అలా నమస్కరిస్తున్న విద్యార్ధి వీపుపైన ‘వెంకన్న’ అని రాసి ఉంది. ఇక అతని చేతిలోని పుస్తకం పై నున్న సరస్వతీదేవి, తన దీవిస్తున్న చేయితో దీవెనలని ఆ మొక్కుతున్న వెంకన్నపై పడుతున్నట్లు కిరణాలతో దించాడు. అసలు ఆ బొమ్మ ఎంత హృద్యంగా ఉందంటే హాలు హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ చప్పట్లకు తల పైకెత్తాడు వెంకన్న. మరుక్షణం మాస్టారి కాళ్ళపై పడ్డాడు. మాస్టారు ఆప్యాయంగా లేవనెత్తి హత్తుకుని నుదిటిపై ముద్దిచ్చాడు. వాడి తనువంతా పులకించింది.

ప్రాంగానమంతా ఆయన నేర్పించిన లయబద్ధమైన చప్పట్లతో హోరెత్తింది. అంటా అలా ఆపకుండా కొడుతూ వెంకన్నను కొనియాడారు. ఇప్పుడు వాడి కళ్ళల్లో సంతృప్తి కనిపించింది. హెడ్ మాస్టార్ చివరగా మాస్టారి స్పందన తెలుపమనడంతో మాస్టారు లేచి నిలుచున్నారు.

మీ అందరి అభిమానానికి నాకు ధన్యవాదాలు తెలుపడానికి భాష దొరకడం లేదు. పలకడానికి మాటలు రావడం లేదు. ఇందరి అభిమాన్నాన్ని చూరగొన్న నేను ఏంటో అదృష్టవండుడిని. నిజానికి నేను చేసింది ఏమ్మీ లేదు. ణా విధి నేను సక్రమంగా నిర్వర్తిన్చానంటే. అయితే నాకు వేరే మూడు ఉద్యోగాలోచ్చినా వదులుకుని ఉప్పధ్యాయవ్రుట్టినే ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి రాజ్యానికి రాజైనా, మాత్రయినా, కలెక్ట రైనా , లాయైనా, డాక్టరైనా, శాస్త్రవేత్త అయినా ఎవరైనా ముందు ఈ విద్యా నారుమడిలో నుండి మొలకేట్టాల్సినవారే. అంటే ఎంతతివావారైనా ముందు ఈ బడిలో పాఠాలువినాల్సిందే. అంటే దేశంలోన్జరిగే ప్రతి పరిణామానికి ముందు బీజం ఇక్కడే పడుతుంది.

మాతృదేవోభవ, పితృదేవోభవ అని తల్లితండ్రుల తర్వాత ఉత్కృష్ట స్థానాన్ని ‘ఆచార్యదేవోభవ’ అని గురువులకిచ్చారు. వారిని ఉన్నత విద్యావంతులుగా విద్య చెప్పడమే కాదు, సంస్కారం నేర్పి దేశానికి మంచి పౌరున్ని, బావితరాలకు మంచి వ్యక్తిత్వం గల మానవతావాదిని తయారుచేయడం మన చేతుల్లోనే ఉంది. ఈ దశలో పిల్లలు కుమ్మరి చేతిలోని మట్టిలాంటి వారు. మనం ఎలా వారిని మలిస్తే అలాగే తయారవుతారు. మనం చెక్కిన ఈ శిల్పాలు రేపు సంఘం లో ఏంటో కీర్తిని తెస్తారు. ‘ఇటీవలకాలంలో జరిగిన అధ్యయనాలలో తేలిన విషయం ఏమిటంటే చాలా మంది నేరస్తుల జీవితాల్లో బాల్యం నిర్లక్షం చేయబడింది. అలా మంచి పునాది లేని వారే అలా తయారయ్యారు. కాబట్టి చిన్నతనం నుండే వారికి మంచేదో చెడేదో నేర్పాలి. ఇక చాలా మంది పిల్లలకు పుస్తకాలు, పెన్నులు కొని పెట్టానని పొగిడారు, అది చాలా చిన్నది. అన్ని దానాలలోకి ‘విద్యాదానం’ చాలా గోప్ప్పది . అది వారి జీవితాల్ని నిర్దేశిస్తుంది. ఎ దొంగా దోచుకోలేదు. ఎదో దేవుడు ఇచ్చినవరకు ఎ లోటు లేకుండా గడిచిపోతుంది. దాన్లో నేను వీరికి ఖర్చు పెట్టింది చాలా తక్కువ. ఇక ముందు భవిష్యత్తు గురించి కూడా నేనొక నిర్ణయానికొచ్చాను. హీరో మహేశ్ బాబు, క్రీడాకారులు సచిన్ లాంటి ఎందఱో ప్రముఖులు ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. కొందరు రైతులను దత్తత తీసుకుంటున్నారు. నేను బాగా ఉన్నవాడిని కాను కాబట్టి అంత పెద్ద పనులు చేయకపోయినా, ఎదో నా చేతుల్లో గల చిన సహాయమైనా నేను చేయలేనా అనిపించింది. అందుకే నేను శంకర్, శివ, తిరుపతి, వెంకన్నలను దత్తత తీసుకుంటున్నాను. వారి ఉన్నత విద్యకు కావాల్సిన అన్ని ఖర్చులు నేను భరిస్తాను. అంతేకాదు, నేను కేవలం స్కూల్ నుండి రిటైర్ అయ్యాను గాని నా ఇంటి తెలుపులు విద్యాగంధం పంచడానికి ఎప్పటికీ తెరిచే ఉంటాయి. ఇక్కడ స్కూల్ అయిపోయాక భోదిన్చేదే ఎవరు ఎప్పుడు ఇంటికి వచ్చ్సినా చెబుతాను. నాకు తెలిసింది నలుగురికి పంచితే ణా విజ్ఞానం ఇంకా పెరుగుతుంది. దానం చేసినకొద్దీ పెరిగే విశ్సిష్ట గుణం కేవలం విద్యకే ఉంది. అందుకే ‘విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నారు. అలాగే ణా గుర్తుగా ఈ పాఠశాలకు ఏదైనా డొనేట్ చేయాలనుకున్నాను. అందుకే మన పిల్లలంతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగడానికి సరిపడే వసతులు అంటే మైక్, మౌత్ పీస్, పోడియం అన్నీ నేను సమకూరుస్తాను. ఇలా ఇన్ని చేయడానికి

నాకు చేయుతనిచ్చిన శ్రీమతికి, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మా పిల్లలకు, నా మానస పుత్రులు ఈ పిల్లలందరికీ నా శుభాశీస్సులు ….’ ఆపకుండా అలా ఆ ప్రాంగానమంతా చప్పట్లతో మార్మ్రోగిపోయింది. హర్షాతిరేకంతో జయజయ ద్వానాలు చేసారంతా. ‘తధాస్తు’ అన్నట్లు శుభసూచకంగా గుడిలోని జేగంటలు మంగళప్రదంగా మ్రోగాయి.


నామని సుజనాదేవి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.