ఉగాది కథానికల పోటీ

0
506

RGB Infotainment 2017లో ప్రధమ ఉగాది కథానిక పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది – రచయితల వైవిధ్యభరితమైన విషయాల ఎంపిక – ప్రతిభాపూర్ణ శైలీగత అభివ్యక్తీ కరణ, మా ఆలోచనలకు ప్రోత్సహాన్ని అందించాయి..

పాఠకుల ఆదరణ రచయితలు తోడ్పాటుతో – ఈ సంవత్సరం కూడా “ఉగాది కథానిక పోటీలు” నిర్వహించాలని RGB నిర్ణయించింది..

వయసుతో సంబంధం లేకుండా సమకాలీన సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ కధావస్తువుల ఎంపిక చేసుకొని రచనలు చేయవలసిందిగా మా విజ్ఞప్తి..

ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.10,000/-, 7500/-, 5000/- నగదు బహుమతులతో పాటుగా, మూడు ప్రోత్సాహక బహుమతులు రూ.2500/- నగదు బహుకరించబడుతుంది.


• రచనలు సరళంగా, సూటిగా వుండాలి. యూనికోడ్ లో టెక్స్ట్ ఫార్మాట్ గా ఈమెయిలు కు పంపితే మంచిది.
• వ్రాత పత్రులు అయితే పేపర్‌కు ఒకవైపు మాత్రమే స్పష్టంగా రాయాలి. డి.టి.పి. చేయించి పంపితే మరీ మంచిది. కవరు మీద 2018 ఉగాది కథల పోటీ కోసమని రాయాలి. పోటీకి పంపిన రచనలు ఎట్టి పరిస్థితిలోను తిరిగి పంపబడవు కాబట్టి కాపీలను మీ వద్ద ఉంచుకోగలరు.
• మీరు పంపిన కథలు ఇంతక ముందు ఏ పత్రికలో, వెబ్ సైట్లలో, బ్లాగులలో కానీ ప్రచురించబడలేదు అని మరియు మీ సొంత రచన అని హామీ పత్రం ఇవ్వవలసి వుంటుంది.
• బహుమతి గెల్చుకున్న రచనలతో పాటు, ఎంపిక చేయబడిన వాటిని వీలు వెంబడి rgbinfotain వెబ్ సైట్లో ప్రచురిస్తాం.
• కథ నిడివి ఆరు వేల పదాలు లోపు వుండాలి.
• ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.
• న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
• మరింత సమాచారం కోసం మా ఫేస్బుక్ పేజిhttps://www.facebook.com/rgbinfotain/ నందు లేక టెలిగ్రామ్ మెసెంజర్ ఛానల్ t.me/rgbinfotain లో కానీ అడగవచ్చు.

RGB కార్యాలయంకి అందవలసిన చివరి తేది: February 28, 2018

పంపవలసిన చిరునామా :
RGB infotain
Plot No: 146, 4th Road
RTC Colony, Pantakaluva Road
Vijayawada – 520010
Email: rgbinfotain@gmail.com
Mobile: 7780393941

@ rgb infotain

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.