నేను..!

0
369

ఎవరి అభిప్రాయాలు వాళ్లవనే చెప్పు ఆలోచనలు..ఆచరణలు కూడా..
ఇది మాటల కాలం
మోహపు మాయాజాలం.. నేటి సమాజం
నేను..
నా దారి..
నా దారి నాది..
నా ప్రేమ నాది..
నా సమయం నాది..
నా అంటూ నన్ను నేను తెలియచేయగానే
నాకంటూ ఓ ముద్ర వేస్తుంది..
నేను అందరిలా కాదంటూ వేరుచేస్తుంది..
నాపై..లేదా నేను చేసే పనులపై తీర్పునిస్తుంది
తప్పు నాదే అని బల్లగుద్ది వాదిస్తుంది
నాపై అపోహల జడివాన కురిపిస్తుంది
కారుకూతల ఈటెలతో పొడుస్తుంది..
ఏమంటున్నారో.. ఎందుకు అంటున్నారో తెలియదు..
అయినా అనటం మానరు..అలా అయినప్పుడు
ఎవరికి నచ్చినట్టు ఉండాలో..
ఎవరికి కావలసినట్టు చేయాలో..
ఎవరెవరి అభిప్రాయాలకు విలువనివ్వాలో…నాకు అనవసరం..
అది నా సమస్య కాదు..
నాకు నేనే..
నేనంటే..నేనే..
అంతరంగాన్ని అవిష్కరించుకుంటూ నా నైజాన్ని నిజంతో కలిపి సాగటమే నేను..
నాలోని నేనులా నేను మాత్రమే ఉంటూ నన్ను నేను చూసుకోవటమే నేను..
ఎవరికీ ఏమీ చెప్పను..చెప్పే అవసరమే ఉండదు
నాలా నేను సాగిపోవటమే నాకు తెలిసిన నేను..
నేను నాలా మిగిలిపోవటమే నేను..


@ తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.