వెన్నెల కెరటాలు- 21

0
474

సంతోషానికి కొత్త అర్ధాలు నేర్పిన
ఆ క్షణాలని అక్కడే ఆగిపోనీవ్వు
ఓడిపోయిన ఆ ఒంటరితనాన్ని
గుమ్మం బయటే ఉండిపోనీ
.
వెన్నెల తనకే సొంతమనుకున్న
ఆకాశాన్ని అలాగే అమాయకంగా చూడనీ
అమృతం లో మాధుర్యం తమదే అనుకున్న
స్వర్గాన్ని అలాగే విస్మయంగా చూడనీ
.
నీపలుకుల తేనె సంతకాలు
అవతల ప్రపంచాన్ని మూసేస్తోంది
మరలిపోవాలేమో దిగివచ్చిన దేవుడైనా
నీకన్నా పెద్ద వరాన్ని ఇవ్వలేక
.
బంగారూ! నిరంతరం ఏరుకుంటున్నా
జీవన సంగీతం లో నీ చిరునవ్వుల గమకాలు
లిఖిస్తున్నా
నలుపక్షరాలు లేని మన మధుర కావ్యాన్ని ………..


#సిఎస్కే

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.