వెన్నెల కెరటాలు- 20

0
482

మాటలన్నీ రాలిపోయాక 
మౌనం ముళ్ళు గుచ్చుకుంటున్నాయి
కలవరపడే మనసు
కాటుకద్దుకుని బరువౌతోంది
.
జారిపోయిన అద్భుతాలు
జ్నాపకాలై అల్లుకుంటున్నాయి
నిట్టూర్పు వెచ్చదనం
నిన్నాపలేదని గుచ్చుకుంటోంది
.
లయమైన గుండె చప్పుళ్ళు
ఇప్పుడు బరువనిపిస్తోంది
ఏకమైన శ్వాసలు
ఇప్పుడు ఊపిరి భారమవుతోందెందుకో
.
బంగారూ! ఆశని హత్తుకుంటున్నా
అహం పొద్దుల్లో
అస్తమించిన బంధం
ప్రేమ కిరణాలతో ఉదయిస్తుందని ………..


#సిఎస్కే

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.