వెన్నెల కెరటాలు- 19

0
531

ఆహ్వానం లేని ఆగమనం 
అనుమతి లేని నిష్క్రమణ
నువ్వు రంగులద్దిన చిత్రం
వెలసిపోయి నల్లరంగు పులుముకుంది
.
పునర్జీవించిన ఒంటరితనం
నన్ను చూసి నవ్వుతోంది
జార్చుకున్న వెన్నెల క్షణాలని
జ్ణాపకాలు చేసుకుని దానితో పోరాడుతున్నా
.
ఎండుటాకుల గలగలలు
గాయాలకి లేపనాలు పూయలేవు
మౌనపు పుటల పై
రసాత్మక కావ్యాలు లిఖించలేవు
.
బంగారూ! ఆత్మ సహచర్యమంటే
కొద్దిరోజుల కలయిక కాదు
వియోగం లో కూడా
మనసులు కలిసుండడం..


#సిఎస్కే

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.