వెన్నెల కెరటాలు – 16

0
396

కొన్ని రూపాంతరాలు కనబడవు
ప్రేమగా మారిన నీ పరిచయం లాగే 
అనంత క్షణాల నీ సంయోగంలో
మరో ప్రపంచం లోకి నన్ను లాక్కెళుతుంది
.
విసిరేయబడ్డ విషాదాలు విచారంగా చూస్తుంటాయి
మాటల జలపాతాలని వొంపుకుంటూ
వెన్నెల కోసి ,నువ్వు పరిమళాలందిస్తుంటే
నీతో కలిసి హరివిల్లుకి రంగులద్దుతుంటా
.
నా మది వృక్షాన్ని చూశావా?
ఒంటరితనపు ఎండుటాకులు రాలిపోయి
నీ తలపుల పచ్చదనంతో
ఎలా వసంతాన్ని నింపుకుందో
.
బంగారూ! నువ్వోచ్చాకే తెలిసింది
దేహ సౌందర్యం రగిల్చేది ఆకర్షణేనని
మనసందం చూడగల్గితేనే
మిగిల్చేదే నిజమైన ప్రేమని..


#సిఎస్కే

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.