గమ్యం లేని పయనమే అనుకున్నా
నీ పరిచయ మలుపులోకి తిరిగేంతవరకు
సంతోషాలు ఎడారులే అనుకున్నా
నీ చిరునవ్వుల ఒయాసిసులు దొరకేంతవరకు
ఆ చీకటి ఆకాశం ఉక్రోషం చూసావా?
జాబిలీ తనతో పక్షమే అని
మరణించిన ఒంటరితనం సమాధిపై
నీతో క్షణాలు ఎలా క్రీడిస్తున్నాయో చూసావా?
అలలు లేని సాగరాన్ని , చుక్కల్లేని ఆకాశాన్ని
ఒడ్డున ఈదే చేపలని , అమావాస్యలో చంద్రుడిని
తూర్పున ఉదయించని సూరీడిని చూడచ్చేమో
కాని నీ తలపుల ప్రవాహంలో తడవని నా మదిని చూసావా?
బంగారూ! జననమరణాల మధ్య
రంగులు పులుముకుంటేనే జీవనం అనుకున్నా
నేను నేనుగా , ఓ పసివాడి నై
నీ మది వేదిక పై నర్తించగలనని తెలుసుకున్నా