వెన్నెల కెరటాలు – 8

0
434

రాయిని తాకితే ఆడదవడం పురాణాలనుకున్నా
నీ స్పర్శ తో జీవంపోసుకున్న నా మది శిలని చూసేంతవరకు
నిన్ను పరిచయం చేసాకా నన్నొదిలేసిన మనసు
నెరిసిపోయిన జ్ఞాపకాలని లెఖ్ఖేస్తోంది

తేడా లేదు అప్పటికి ఇప్పటికి
మనం చంపిన క్షణాలు
అనుక్షణం నా క్షణాలని కబళిస్తూ ….
జ్ఞాపకాలై పుడుతూనే వున్నాయి

చిరునవ్వుల మధుఫలానిచ్చి
ఎడబాటు విషాదాన్ని తాగమంటున్నావు
ఓడిపోతూనేవున్నా ….తొలగించుకోలేక
బలంగా అల్లుకునే నీ తలపుల తీగలని

బంగారూ! చేపలు శ్వాసించేది నీళ్ళల్లోనే
వియోగపు వొడ్డున విలవిల్లాడుతున్నా
నీ ప్రేమసాగరంలోకి లాక్కున్టావో
ప్రాణం పోసిన నువ్వే, నిర్జీవిని చేస్తావో


#సిఎస్కే

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.