శ్రావణి వెడ్స్ వరుణ్

2
775

మెరుగయిన కథ – వయస్సు 25-45


శ్రావణి  వెడ్స్  వరుణ్


హోరున వాన కురుస్తోంది.ఎక్కడ వీధీ లైట్లు వెలుగు తున్న ధాఖలైన లేవు.మధ్య మధ్య లో మెరిసే మెరుపులకీ దారి మసక మసక గా కనపడు తోంది.జనసంచారం లేనే లేదు.వాతావరణ వారి పుణ్యమాని ముందస్తు సమాఛారం వల్లనే  కాబోలు.ఒక్క మనిషి తిరిగిన జాడయినా లేదు.

కాని మేనత్త కి ఒంట్లో బాగోలేదని తెలిసి తప్పక,తప్పించుకోలేక బయలుదేరాల్సి వచ్చింది.ఏం చేయాలో దిక్కు తోచని స్థితి.ఎక్కడ ఒక్క ఆటో కాని,చివరికి ఒక్క వాహనం కూడా కనపడటం లేదు.అలా అనుకున్నానో లేదో ఇంతలో ఎక్కడో దూరం గా వాహనం వస్తున్నా వెలుగు కనపడింది.బ్రతుకు జీవుడానుకుని దాని కోసం ఎదురుచూస్తున్నాను.వెలుగు దగ్గర పడటం తో చెయ్యేత్తాను ఆపటానికి.  ఒక కోళ్ళ వ్యాను వచ్చింది.దాన్ని ఆపటానికి ఎంతో ట్రై చేసాను.కాని వాడు ఆపకుండా నన్ను దాటి పోనీచ్చాడు .ఏమనుకున్నాడో ఏంటో పాపం  కొంచెం దూరం పోనీచ్చి ఆపాడు.హమ్మయ్య అనుకుని వ్యాను దగ్గరకి పరిగెత్తాను.క్లీనర్ అద్దం దించి ఎక్కడికీ అన్నాడు.ఆలమూరు అన్నాను..వంద రూపాయిలవుతున్ధన్నాడు.మామూలుగా పది రూపాయిలే కాని ఏం చేస్తాం,వాడే నాకు దేవుడూ  ఇప్పుడు.సరేనని ఎక్కాను.అక్కడి నుండి నా పాట్లు ఆ దేవుడి కే తెలియాలి..ఆ దుర్గంధం వల్ల నా ముక్కు పుటాలు ఎగిరిపోతున్నాయి.డ్రైవర్ ఫుల్ ఆన్ లో ఉన్నాడు.ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలీదు.ఇంతలో నేను దిగాల్సిన ఊరు రానే వచ్చింది.యుద్ధం లో జయించినంత ఆనందం.వాడి వంద వాడి ముఖాన కొట్టి అత్త ఇంటికి దారి తీశాను.

తలుపు శబ్దం వినిపించి శ్రావణి తండ్రి ని లేపింది.మావయ్య,శ్రావణి తలుపు తీసి నన్ను చూడ గానే  శ్రావణి ముఖం లో వెలుగు,మావయ్య నారాయణ ముఖం లో ఆశ్చర్యం . రెండు ఒకేసారి కనిపించాయి . సాదరం గా  లోపలి కి తీసుకెళ్ళారు.అత్త పడుకుని ఉంది.మా మాటలు విని నెమ్మది గా”ఎవరూ”అంది.ఆ మాట నాకు వినపడ గానే నేనత్తా అంటూ లోపలి కి వెళ్ళాను.నన్ను చూడగానే ఆనందం ,కన్నీళ్ళు ఉబికి ఉబికి వచ్చాయి.”వరుణ్” అంటూ నన్ను కౌగిలించుకుంది అత్త సరస్వతి.నేను  ఎంత  కంట్రోల్ చేసుకున్న కన్నీళ్ళు గిర్రున తిరిగాయి.అత్త అంత బాధలోను కూడా శ్రావణి పిలిచి నాకు కావాల్సిన ಅನ್ನಿ సదుపాయాలు చూడమని చెప్పింది . శ్రావణి కి ఆనందాని కి అవధులు లేవు కాని అవేమి కనిపించ కూడా తల దించు కుని వెళ్లి పోయింది .మంచం పై పక్క బట్ట లు సరిదిద్దుతూ ఒక్క సారి గతం లోకి పరిగెత్తింది.

“అమ్మా అంత మీ ఇష్టమేనా ,నాకు అంటూ కొన్ని ఇష్టాలు ఉండవా ,నన్ను మీరు కన్నారు ,పెంచారు అలా అని మీరు ఎలా చెపితే అలా అడే గంగిరెద్దు ని కాను నేను” .అంటూ వరుణ్ ఇంతెత్తున లేచాడు తల్లి దండ్రుల మీద.జానకి  అడ్డాల నాడు బిడ్డలు  గాని గడ్డలు నాడు కాదే …వీడు మన అభి ప్రాయన్ని ఎప్పుడు గౌరవం ఇచ్చాడు .వాడిని బ్రతిమాలకు ఇక అంటూ శేఖరం ఒక్కసారి కుర్చీ లో నుండి లేచి బయట కి వెళ్లి పోయాడు ..వరుణ్ తండ్రి ని ఆగమని కూడా అనలేదు .ఎందుకంటే తనకి ఇష్టం లేని పెళ్లి ,ఒక పల్లెటూరి అమ్మాయి ని ,తన మేనత్త కూతుర్ని పెళ్లి కూతురి లా ఉహించు కోలేక .

తండ్రి ఎంత చెప్పిన విన లేదు .శ్రావణి మనసు లో వేదన ,కళ్ళల్లో నీరు తప్ప ఇంకేమి లేదు .మేనత్త మనసు పీకుతోంది వీడే నా అల్లుడు కావాలని కాని శ్రావణి తండ్రి కి మాత్రం ఆవేశం కట్టలు తెంచుకుంది .కాని అభిమానం అడ్డొచ్చి ఏమి అనలేక భార్య ని శ్రావణి తీసుకుని అక్కడి నుండి వెళ్లి పోయాడు శ్రావణి తండ్రి నారాయణ .శ్రావణి కి అర్ధం కాలేది ఇప్పటి వరకు కూడా బావ తనని ఎందుకు వద్దు అన్నాడో .”పరి పరి విధాలు పోయింది నేను అందం గా లేనా ,చదువు రాని దాన్నా.ఏం తక్కువ అని తన లో తాను బాధ పడని రోజు లేదు .ఒకసారి తెగించి బావ మెసేజ్ పెట్టింది .”బావా చిన్నప్పటి నుండి నేను నిన్ను ఎంతో అభిమానించాను ,ఉషోదయాన సూర్యుని కోసం తామర పువ్వు లా,స్వాతి చినుకు కై ముత్యపు చిప్ప లా ,పున్నమి రోజున పండు వన్నెల లా  నీకోసం ఎదురుచుసా.ఎప్పటి కయిన నా కోసం నువ్వు ఉన్నావనే ఆశ చావలేదు .నేను నీకు నచ్చలేదు ఎందుకో ఏమిటో నాకు ఇప్పటి వరకు తెలీదు.నేను నిన్ను ఇంకేప్పటికి ఇబ్బంది పెట్టను.దయచేసి నాకు సమాధానం ఇవ్వి బావ ప్లీజ్ అంటూ మెసేజ్ పెట్టింది .ఎంతసేపటి కి బావ నుండి సమాధానం రాక పోయే సరికి ఫోను అక్కడ పెట్టేసి తల్లి దగ్గర కెళ్ళింది.ఇంతలో టింగ్ మని శబ్దంవినపడటం తో పరిగెత్తుకొని వచ్చి ఫోన్ అందుకుని మెజెస్ చూసి అంతే స్పీడ్ లో ఫోను కింద పడేసింది .ఆ శబ్దం విని సరస్వతి పరిగెత్తుకుని వచ్చింది ఏంటి అంటూ.తల్లి ఏం చెప్పకుండా దాచింది .

ఆరు బయట మంచం మీద పడుకున్నారు నారాయణ కుటుంబమంతా .అందరి కి చల్లని వెన్నెల ,శ్రావణి కి మాత్రం ఆ చల్లని వెన్నెల, కిరణాలు చాలా వేడి గా ఉన్నాయి .ఎందుకంటే ఇంకా బావ మెసేజ్ తన  వెంట ఉంది కనుక .ఒకసారి మళ్ళీ   మెసేజ్ ఓపెన్ చేసి చూసింది .”నేను చదువు కున్న వాడ్ని ,నువ్వు “నాగరికత’’ లేని పల్లెటూరి దానివి , నేను మోడ్రన్ ,నువ్వు పల్లెటూరి మొద్దు వి ,నీకు నాకు సరిపడదు ,ఇంకెప్పుడు నాకు మెసేజ్ పంపొద్దు .నీకు సరిపడా ఒక పల్లెటూరి వాడ్ని చూసుకుని చేసుకో .అని ఉందా మెసేజ్ లో “.ఎలాగయినా బావ కి బుద్ది చెప్పాలను కుంది. కాని  ఆ బుద్ది కి తెలుసు వాడికి గుణపాఠం చెప్పాలని ,కాని మనసు కి తెలీదు గా .

కొన్నిరోజులు రాకపోకలు లేవు వారింటి మధ్య.ఆ అన్నాచెల్లెళ్ళు  మధ్యకూడా చాలా దూరం పెరిగింది.ఉన్నట్టుండి ఫోను రింగ్ అయ్యింది శేఖరం ఫోనెత్తి హలో అన్నాడు .”బావ నేను నారాయణ ని..చెప్పు బావా చెప్పు చాలా రోజులయ్యింది నీతో మాట్లాడి అంటూ ఎంతో ఆత్రుత అడిగాడు శేఖరం.ఏంలేదు  మీ చెల్లి కి అస్సలు ఏం బాలేదు .మంచం పట్టి ఉంది ఎప్పటి నుండో అన్నాడు .శేఖరాని కి గుండె ఆగినంత పని అయ్యింది .ఏం జరిగింది అంటూ గద్గాధ స్వరం తో అడిగాడు . ఈ మధ్య దిగాలు తో మంచం పట్టింది .ఎన్నో మందులు వాడాము.కాని ఏమి పని జరగలేదు.నిన్ను చూడాలని అంటోంది.నాకే మనసొప్పక ఈ చివరి దశ లో నయినా అంటూ గొంతు మూగ బోయింది.నువ్వేమి బాధ పడకు బావ ఎంత ఖర్చు అయిన పర్వలేదు ,నేను సరస్వతి మామూలు మనిషి ని చేస్తా అని ధైర్యాన్ని ఇచ్చాడు.సరే నేను ఊర్లో లేను రెండు రోజుల్లో వస్తాను ,అందాక వరుణ్ వచ్చి సరస్వతి ని హాస్పటల్ కి తీసుకెళతాడు..సరే బావ నీ ఇష్టం అంటూ ఫోను పెట్టేసాడు శేఖరం .

ఇంతలో తలుపు చప్పుడు విని వెనక్కి చూసింది శ్రావణి…వరుణ్ తలుపు దగ్గర ఉంది ఏదో గొణుకుతున్నాడు ..ఏంటి బావా అంది ,కొంచెం మంచి నీళ్ళు కావాలి అన్నాడు.నీ మంచం పక్కనే పెట్ట తీసుకో అంది.ముఖం తన వైపు కి తిప్పకుండానే .వరుణ్ కి కొంచెం అహం అడ్డు రావటం వల్ల,ఏమి సమాధానం చెప్పకుండానే తన గది లోకి వెళ్లి పోయాడు.మర్నాడు ప్రొద్దున్నే పేపర్ బాయ్ రాజు అక్కా అక్కా అంటూ పరిగెత్తు కొచ్చాడు ,ఇల్లంతా వెదికాడు శ్రావణి కోసం.ఏమయ్యింది రా అలా రోప్పుతున్నావు అంటూ నారాయణ నిలదీశాడు .నీకు చెప్పను పెద్దయ్య  అంటూ పెరట్లో కి పరుగు తీసాడు.అక్కడ వరుణ్ కనిపించాడు రాజు కి .ఏయ్ మా అక్క ని చూసావా అంటూ అరా దీస్తూ  వరుణ్ మొహం కేసి ఎగాదిగా చూసాడు ,ఇంతకి నువ్వెవరు అన్నట్టు ప్రశ్నార్ధకం ఫేస్ పెట్టాడు.వరుణ్ సమాధానం చెప్పేలోగా ,ఏరా రాజు నా గురించి వెతుకుతున్నవట  ఏంటి రా ఏమయ్యింది అంటూ శ్రావణి పిలుపు విని ,రాజు అక్కా అంటూ శ్రావణి హత్తుకున్నాడు .ఏంటిరా నీ ఆనందం అంటూ నారాయణ అడిగాడు .ఏమి లేదు పెద్దయ్యా, అక్క కి   ఫస్టు క్లాసు  వచ్చింది అంటూ ఎగిరి గంతేశాడు .ఆ వార్త విన్న నారాయణ ఎగిరి గంతేసినంత పని చేసాడు.కాని శ్రావణి కి బావ ఉండగా  కొంచెం అభిమానం అడ్డొచ్చి ,ఆనందాన్ని మనసు లో సంతోషాన్ని కళ్ళ వెనుక దాచేసింది. ఇప్పుడు ఆశ్చర్యం వరుణ్ వంతయ్యింది .

ఎందులో ఫస్టు వస్తా నీకు అంటూ కళ్ళ తోనే అడిగాడు శ్రావణి ని.కాని ఆత్మాభిమానం కి కేరాఫ్ అడ్రెస్స్ శ్రావణి  కదా తన నోటి నుండి రిప్లై రాలేదు ,ఇది అర్ధం చేసుకున్న నారాయణ ,అల్లుడు అనబోయి వెంటనే ఆగి  వరుణ్ శ్రావణి కి చదువు అంటే చాలా ఇష్టం  కదా ,తన కాళ్ళ మీద తను నిల బడాలని హ్యూమన్ రిసోర్స్ మీద పిజి చేసింది .అందులో తనకి ఫస్ట్ క్లాస్ వచ్చింది.ఇప్పుడు జిల్లా కలెక్టర్ అవ్వాలని తన తాపత్రయం .సరే లే ఒక్క గానొక్క కూతురు కదాని నేను అడ్డు చెప్పలేదు.కాని ఇప్పుడు అన్నింటికీ తానే కష్టపడుతోంది .మీ అత్త కి ఒంట్లో బాలేక పోవటం నుండి కొద్ది గా చదువు కి ఇబ్బంది అవుతోంది .కాని అలానే చదువు తోంది .పల్లెటూరి వారందర్నీ ,పట్నం వారి కి ఏమి తీసిపోకుండా చేయాలనేదే తన ఆశ .అందుకే ఈ రాజు  ని చేరదీసి చదివిస్తోంది.వీడికి నా అన్నవాళ్లు ఎవ్వరు లేరు పాపం.వరుణ్ కి కొద్దిగా సిగ్గని పించింది .ఇంతలో సరస్వతి అరుపు వినిపించి అందరూ రూమ్ లోకి పరిగెత్తారు .ఆయాసం వల్ల  ఊపిరి ఆడటం లేదు .వెంటనే ఆ ఊరి లో ఒక కారు ని పిలిచి వెంటనే తన ఊరి కి తీసుకెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చేసాడు .సీరియస్ కండిషన్ ఏమి చెప్పలేం అన్నారు డాక్టర్లు.ఐసియు లో ఉంచారు .శ్రావణి కి నారాయణ కి అందోళన పెరిగి పోయింది.వరుణ్ తండ్రి కి,తల్లి కి  ఫోను చేసాడు .అందరు అక్కడే ఉన్నారు .శేఖరం కి కొంచెం పలుకుబడి ఉండటం వాళ్ళ పెద్ద పెద్ద డాక్టర్లు అందరు అక్కడే ఉన్నారు .24 గంటల తర్వాత కాని ఏమి చెప్పలేము అన్నారు .శేఖరం నారాయణ ని తీసుకుని జానకి తో ఇంటికి బయలు దేరుతూ .వరుణ్ నువ్వు శ్రావణి కి సాయం గా ఇక్కడే ఉండు.మేము ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాము అన్నాడు .సరే అని బుర్ర ఊపి శ్రావణి కేసి చూసాడు నీతో ఇక్కడే ఉండొచ్చా అన్నట్టు.వాళ్ళు అలా వెళ్లి పోయాక” శ్రావణీ నువ్వు ఏమి తినలేదూ….. రా…అలా  కేంటిన్ దగ్గర ఏదన్న తిందువు గాని” అని పిలిచాడు .ఒద్దు అంటూ ఒక్కసారి గా వరుణ్ పట్టుకుని ఏడ్చేసింది .వరుణ్ కి ఏం చెయ్యాలో ఎలా ఓదార్చాలో తెలిలేదు .తల మీద చెయ్యి వేసి దగ్గర కి తీసుకుందాం అనుకునేలో గా శ్రావణి వెనక్కి వెళ్ళిపోయి సారీ బావ పొరపాటున నిన్ను కౌగిలించుకున్న అంది.ఇంకెప్పుడు నిన్ను ముట్టుకోను అంటూ కుర్చీ లో కూల బడిపోయింది.వరుణ్ ఒక్కసారి గా చెప్పు తో కొట్టినట్టయ్యింది.

శేఖరం ,నారాయణ ఇంటి నుండి వచ్చారు .వరుణ్ ,నువ్వు శ్రావణి ఇంటికి వెళ్లి ప్రేష్ అయ్యి రండి అన్నాడు శేఖరం.మావయ్యా నేను ఇక్కడే ఉంటాను ,ఇంటి కి ఒద్దులే అని అంది శ్రావణి.దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వరుణ్ ముఖం పాలిపోయింది.అహం అంతా నీరు గారి పోయింది.తన అంటే పడి చచ్చే మరదలు ఐ డోంట్  కేర్ అన్నట్టు సమాధానం చెప్పే సరికి ఎం చెప్పాలో అర్ధం కాలేదు వరుణ్ కి శేఖరాని కి కూడా.సరే లే అని రిప్లై మాత్రం ఇచ్చాడు.శ్రావణి ,వరుణ్ కి తెలుసు తన తల్లి ఈరోజు ఇలా అవ్వటాని కి కారణం వరుణే  అని. బెంగ తోనే మంచం పట్టి ఈరోజు ఇలా ఉంది అని బాధ తోనే ఉన్నాడు వరుణ్.ఇంతలో నర్సు పరిగెత్తు కుని వచ్చి ఆవిడ కి సృహ వచ్చింది .మీ అబ్బాయి ని  పిలుస్తున్నారు అంది.నారాయణ కి అర్ధం కాలేదు.అమ్మా నాకు అబ్బాయి లు లేరు ఉన్నదీ ఒకత్తే అమ్మాయి అన్నాడు  .అవునా ,కాని ఆవిడా ఏదో పేరు తో పిలిచారు ఆ….వరుణ్  అని కలవరిస్తున్నారు .నేనే అంటూ ముందుకొచ్చాడు వరుణ్.లోపల కి వెళ్ళాక అత్తా ….అని పిలిచే టప్పటికి ,సరస్వతి కళ్ళు తెరిచింది.”ఒరేయ్ వరుణ్ నన్ను క్షమించు రా ,నేను నీ మనసు లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసు కోకుండా మా ఆశలు నీ మీద రుద్దలనుకున్నాను.నన్ను క్షమించు రా అనేటప్పటి వరుణ్ పూర్తి గా అహం పోయి సిగ్గు తో అత్తా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు.నన్నే క్షమించు అత్తా నాకు శ్రావణి తప్ప  మరో అమ్మాయి ఒద్దు నాకు.ఇప్పుడు తను ఒప్పుకోకపోయోయినా సరే ఎన్ని సంవత్సరాలు అయిన వెయిట్ చేస్తా .నాకు తెలుసు ఇప్పుడు శ్రావణి ఒప్పు కోదు అనేసరికి సరస్వతి కి ప్రాణం లేచి వచ్చినంత పని అయ్యింది.ఇంతలో నర్సు బయట కి వెళ్ళమని సైగ చేసింది.వరుణ్ బయట కి రాగానే అందరు ఎలా ఉంది అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసారు ..జస్ట్ బానే ఉంది అని రిప్లై ఇచ్చాడు.సరే ఇప్పుడు ఓకే కదా మీరీద్దరు ఇంటికి వెళ్లి ప్రేష్ అయ్యి రండి అని శేఖరం గట్టి గా అనటంతో వేరే గత్యంతరం లేక వరుణ్ వెంట అడుగులేసింది.ఒకరి వెనుక మరొకరు అలా వెళ్తుంటే శేఖరానికి ఏదో ఆశ మెదలయ్యింది.అది తెలిసిన నారాయణ ఒద్దు అన్నట్టు గా చెయ్యి ని నొక్కాడు .ఇంటికి వెళ్లి న వెంటనే తన రూమ్ లోకి తీసు కెళ్ళాడు.అప్పుడు తనలో ఏదో తెలియని కొత్త అనుభూతి,సంతోషం ఉన్నాయి .తన గది లోకి ఓ దేవకన్య వస్తున్నట్టే ఫీలింగ్ పెట్టాడు.స్నానం చేసి గబా గబా రెడీ వస్తూంటే  వరుణ్ ,శ్రావణి మాట్లాడాలని అనుకున్నాడు.కాని శ్రావణిఆ అవకాశం ఇవ్వలేదు.రెడీ అయ్యి హాస్పిటల్ వెళ్లారు.సరస్వతి కి బానే ఉందన్నారు.ఒకటి రెండు రోజుల్లో తగ్గి నార్మల్ అవుతుందన్నారు.అలానే సరస్వతి డిశ్చార్జ్ చేసారు.శేఖరం తన ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు.అదే బావ నారాయణ ని అడిగాడు .ఇంతలో శ్రావణి మావయ్య ఒద్దులే ,ఇప్పటి కే నువ్వు చాలా హెల్ప్ చేసావు .మేము ఇంటి కే వెళ్లిపోతాం అంది.ఏం సమాధానం చెప్పలేక శేఖరం మౌనం గా ఉంది పోయాడు.శ్రావణి వదులు కోలేక  కారు ఎక్కే ముందు చెయ్యి పట్టి ఆపాడు. ఐ లవ్ యు  అంటూ.కోపం తో చెయ్యిని విదిల్చుకుని ,వరుణ్ కేసి చూసింది.

బావా నేను “నాగరికత లేని దాన్ని ,నాకు అంటూ ఉన్నది మా అమ్మ ,నాన్న ,ఇంకా నా ఊరు ,సారీ  నా పల్లెటూరు.నన్ను గన్న ఊరు.నీ అంత తెలివి తేటలు నాకు లేవు ,ఎందుకంటే నేను పల్లెటూరి లో పుట్టటం వల్ల,నా వాళ్ళు అనే భావన మా పల్లెటూరి గాలి లోనే ఉంటుంది.మాకు మీలా ఉండటం తెలీదు.ఎదుటి వ్యక్తి సహాయం చేయటం,ప్రేమ ,ఆప్యాయతల్ని పంచటం .ఒకరి కొకరు స్నేహ భావం తో  ,తోటి వారి ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం;వారి కష్టాన్ని తనది గా అనుకుని వారికి చేయూత ని ఇవ్వటం.మాకు తెలీదు బావ నీలా ఏమి కావాలో ,మాకు ఒకటే తెలుసు  “ఏమి ఇవ్వాలో”.అదే నీ భాష లో చెప్పాలంటే ,వుయ్ నో వాట్ వుయ్  కెన్ గివ్, వుయ్ డోంట్  నో వాట్ టు టెక్ ..మనిషి ఎక్కడున్నా తోటి వారి కి సహాయం చెయ్యని చెయ్యి ఎక్కడున్నా ఒక్కటే .నాగరికత అంటే  ఎలా ఉన్నామని కాదు.ఎలా ఉండాలో నేర్పేది.నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్టు మెకానికల్ జీవితాలు కావు మావి.నాగరికత అంటే విడి విడి గా ఉండటం కాదు .కలిసి ఉంటూ కొత్త పద్ధతు లలో ఉండటం.మనం నేర్చుకున్నది పది మంది కి ఎలా ఉపయోగ పడేలా ఉండాలో  అల ఉండటం.నాగరికత మనిషి ని ,వాళ్ళ వెనుక ఉన్న ఆస్తుల్ని బట్టి రాదు.మనిషి యొక్క వ్యక్తిత్వం బట్టి వస్తుంది.వారియొక్క నడవడిక మీద ఉంటుంది.మనిషి ని మనిషిలా చూసే విధానం లో నుండి వస్తుంది.అయిన నీకు ఇవన్ని తెలుసు ,కాని నువ్వు అనే నీ నాగరికత లో నువ్వు ఒక్కడి వే ఉంటావు.కాని  నా నాగరికత లో నాతో పాటు ప్రతి ఒక్కరు ఉంటారు.ఉంటా బావ అని వెళ్లి పోతుంటే .వరుణ్ కి కళ్ళ వెంట కన్నీళ్లు బోట బోట నెల రాలాయి .శ్రావణి నాకు బుద్ది వచ్చింది .చచ్చిన పామునే ఇంకా చంపకు .నిన్ను వదులు కునే ప్రసక్తే లేదు.నువ్వు అనుకునే ప్రప౦చం లో ఇక నేను ఉంటాను అంటూ కారు కి అడ్డం పడ్డాడు.సరస్వతి ,నారాయణ కి మొహం లో కోటి కాంతు లు  వెలిగాయి.ఒప్పుకో అన్నట్టు గా శేఖరం కూడా చూసాడు.కాని శ్రావణి అందుకు ఒప్పుకోలేదు.మార్పు అన్నది స్వతహాగా రావాలి కాని ఏదో ఒక సంఘటన ని బట్టి కాదు.అయిన నాకు పది మందికి సేవచేయ్యలనే  ఆశ .కొన్ని రోజులు పేదవాళ్ళ కి ,అవసరం ఉన్నవారికి సేవ చెయ్యాలి ఇప్పుడూ , అంటూ ఆగిపోయింది.కొన్ని రోజులు తర్వాత అయితే ఓకే కదా .అప్పటి దాక నే కాదు నీకోసం ఎన్నేళ్ళయిన వెయిట్ చేస్తా అంటూ ఎగిరి గంతేశాడు.అందరి మొహాల్లో ఆనందం .కొన్నాళ్ళకి  శ్రావణి వెడ్స్  వరుణ్ అని బోర్డు అందరికి ఆహ్వానం పలికింది.

ఏదేశమేగినా  ఎందుకాలిడినా ,ఏ పీటమేక్కినా అన్నట్టు వెనుక హంగుల బట్టి కాదు.వారి ఆహార వ్యవహారాలని బట్టి,వారి ఆధునీకత ని బట్టి ఉండాలి.అదీ ఉపయోగపడేలా ఉండాలి ..అదే నవ్య సమాజ నాగరికత.


వాడ్రేవు వెంకట సుబ్బారావు

2 COMMENTS

  1. చాలా బాగుందండి కధ. ఈకాలం పల్లెలయినా, పట్నాలయినా అందరూ చదువుల్లో నాగరికతల్లో ఒకేస్థాయిలో ఉన్నారు. పల్లెల్లో అదనంగా ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ విస్మరించి శ్రావణిని వద్దనుకున్న వరుణ్ కు చక్కని పాఠం దొరికింది. అభినందనలు

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.