మెల్లగా పడుతున్న వాన చినుకుల చిటపటలు
మెలమెల్లగా తెరచుకుంటున్న జ్ఞాపకాల తలుపులు !
అప్పుడప్పుడూ ఝుమ్మంటూ వీచే చల్లటి గాలి
ఆ గాలిలో తేలుతూ మనల్ని తాకే జ్ఞాపకాల అనుభూతులు!
ఉన్నట్టుండి మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు
వాటితోపాటు ఆగక వర్షించే కన్నులు!
నేలను తాకి నిశ్శబ్ధంగా ఇంకిపోతున్న వాన చుక్కలు
కన్నీటిధారలన్నీ మనసులోకి ఇంకి ఆనవాళ్ళు మాత్రం వదిలినట్టు చారికలు!
ఎంత నీటినయినా పీల్చి తనలో దాచుకునే నేలతల్లి
జ్ఞాపకాలనన్నింటినీ గుప్పెడు గుండెలో దాచేస్తూ మనం!
వానవెలసిన ప్రశాంతత ప్రక్రుతికి
జ్ఞాపకాల అనుభూతులు వర్షించిన కనులకి!
తడిసి మురిసిన నేలతల్లి చిరునవ్వులు మొలకల రూపంలో
చిరునవ్వులు చిందిస్తూ కొత్త అనుభవాలు స్వాగతిస్తూ జీవితం!..
@తులసి..