ఆమె కథ (The conclusion)

0
475
రైలు ప్రయాణంలో తనపై కవిత వ్రాసిన ,తను చూడని ఆ అపరిచిత వ్యక్తి ధ్యాసలో షాహిబ్ జాన్ పూర్తిగా మునిగిపోతుంది.స్వప్నలోకాలలో విహరిస్తుంది.
ఫారెస్ట్ ఆఫీసరైన అతనితో (సలీం)మూడు సందర్భాలలో కలిసే అవకాశం వస్తుంది.కలిసిన ప్రతిసారి విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
నాలుగో కలయికలో సలీం ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తను ఒక నాట్యకత్తెననే నిజాన్ని అతనికి తెలియచేస్తుంది.సలీం ఆమె పేరును పాకీజా(పవిత్ర)గా మార్చి,వివాహమాడేందుకు మసీదుకు తీసుకుని వెళతాడు.కానీ తనను గుర్తుపట్టే మగవారివల్ల ,సలీం అవమానపడ్డం చూసి,భరించలేక అక్కడి నుండి పారిపోయి తిరిగి తన ఇంటికి చేరుకుంటుంది.
సలీం తన పెళ్ళి వేడుకలలో నాట్యం చేయమని పాకీజాకు వర్తమానం పంపుతాడు.అక్కడ జరిగిన అనూహ్య పరిణామాలలోభాగంగా కథ కొన్ని మలుపులు తిరిగిన తర్వాత సలీం పాకీజాల వివాహం జరిగి సినిమా సుఖాంతమౌతుంది.
Bombay లోని మరాఠా మందిర్ లో పాకీజా ప్రీమియర్ షో చూసిన సమీక్షకులు ఒక Failure movie గా దానిని తేల్చేశారు.
ఆ సమయంలో మీనా కుమారి అనారోగ్యంతో నడవలేని పరిస్థితిలో ఉంది.(1972 ఫిబ్రవరిలో పాకీజా సినిమా విడుదలైంది.)1972 మార్చిలో ఆమె స్పృహ కోల్పోయినందున సెయింట్ ఎలిజిబత్ హాస్పిటల్ రెండవ అంతస్థులో 24 వ నెంబర్ రూమ్ లో ఆమెను చేర్చారు.
29 మార్చి -కమాల్ కు,తన చెల్లెళ్ళకు బెంగపడొద్దని మీనా ధైర్యం చెప్పింది.
30మార్చి-డాక్టర్లు మందులు పని చేయడం లేదని,దైవ ప్రార్ధనలు చేసుకొమ్మని సన్నిహితులకు సలహా ఇచ్చారు.
31 మార్చి-కమాల్ విపరీతమైన వేదనలో మునిగిపోయాడు.అందరూ ప్రార్ధనలు చేయసాగారు.
3.24 గం।।కు కోమా లో ఉన్న ఆమె ఒక నిముషం సేపు కళ్ళు విప్పి చూసింది.
3.30గం।।కు డాక్టర్లు ఆక్సిజన్ ట్యూబ్ లు తొలగించేందుకు కమాల్ ను అనుమతి కోరారు.
3.35గం।।కు Indian tragedy queen (తన 39వ ఏట )శాశ్వత నిద్రలోకి జారుకుంది.
(రహమతాబాద్ శ్మశానవాటికలో ఆమె  సమాధిని చూడవచ్చు.ఆ సమాధి ప్రక్కనే  కమాల్ సమాధి కూడా ఉంటుంది)
మీనా కుమారి మరణం తర్వాత పాకీజా సినిమా సూపర్ హిట్ అయ్యింది.సినిమా చరిత్రలోనే  ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నది.కానీ ఆ విజయానందాన్ని అనుభవించడానికి  మీనాకు ప్రాప్తం లేకుండా పోయింది.
ఆమెకు బ్రతికివుండగా విశ్రాంతి లేదు.మరణించిన తర్వాత లభించాల్సినంత  గౌరవం దొరకలేదు .
ఆమె జ్ఞాపకాలతో ఇక సెలవు.

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.