పాలెగాడు

0
460

★ పాలెగాడు ★
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
————————————–

“చరిత్ర” – అదంతే ఒక మహారణ్యం
దాని గురించి మనం ఎంత తెల్సుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంటుంది.
తెలుగోడి భీకర పౌరుష ప్రతిభా పాటవాల్ని పోత పోసి ఒక ఆకారమిచ్చి దానికి ఒక ఆగిపోని మెరుపుతో ప్రాణం పోస్తే దాని పేరు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” అవుతుంది.
కుంఫిణీ (బ్రిటీష్) పాలకుల గుండెల్లో ఉరుమంటి కత్తిలా దిగబడుతుంది ఆ పేరు.
ఆయన జీవిత చరిత్రలో ఏనాడు వెనుదిరగని తత్వం మనందరి భుజాల్ని సగర్వంగా నిలబెట్టి ఆ స్ఫూర్తిని మోయాలనిపించేలా చేస్తుంది.

1800 దశకాల్లో స్వాతంత్ర్య సమరోత్సాహాన్ని మన తెలుగునేలపై మొదలెట్టిన మహాధీరుడీ వీరుడు. ఆయన పోరాటాల్లో కొంత భాగాన్ని క్లుప్తంగా తెలియచేసే పుస్తకమీ “పాలెగాడు”.
చదువుతున్నంత సేపు కొన్ని పేజీలు మండుతూ, ఎర్రగా విప్లవ నేపధ్యాన్ని మనెదురుగా జరుగుతున్నట్లుంటుంది.

రాయలసీమలో ఒక్కడి గా పోరాటాన్ని మొదలెట్టి లక్షలాది మంది గుండెల్లో స్వాతంత్ర్యాకాంక్ష్యని రగిలించిన ధీరోధాత్తుడు.

బ్రిటీష్ వారి గుండెల్లో ఇతను చేసిన గాయం, ఎలాంటిదంటే బంధించి అన్యాయంగా ఉరి తీసి కోటకు ఉయ్యాలవాడ తలని దశాబ్ద కాలం వేలాడదీసారంటే అర్ధం చేసుకోవచ్చు.

ప్రతీ ఒక్కరు చదవాల్సిన అద్భుతపుస్తకమిది.

త్వరలోనే ఈ చరిత్ర తెరకెక్కబోతుంది.
“ఉయ్యాలవాడ నరసింహారెడ్డి”ని కళ్లు పెద్దవి చేసుకోని చూడండి ఈ పుస్తకంలోని అక్షరాల్లో!!!

జోహార్ వీరుడా
జోహార్ ఉయ్యాలవాడ నరసింహుడా..
జోహార్!!!!

#Raghu_Alla

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.