జీవన శైలి

0
443

రెండవ బహుమతి – వయస్సు 25-45


జీవన శైలి


“ఉత్తెజ్ ఈ రొజు సాయంత్రం 8 గ||ల కు హౌటల్ తాజ్ లొ కలుద్దాం..వీలవుతుందా.” అడిగింది శ్రావ్య.

“వీలవుతుందా? వీలు చేసుకొంటాను. నీకంటే, నిన్ను కలవటం కంటే ముఖ్యమైన వారు ముఖ్యమైనది ఉంటుందా నాకీ ప్రపంచంలొ. బై ఐ విల్ బి దేర్ ! ఓకే డార్లింగ్.

“థాంక్యూ డియర్ ఐ నో యూ విల్ మేకిట్.” బై ది బై విశేషమేమిటి? యువర్ బర్త్ డే…మై అడ్వాన్స్…
“వెయిట్.. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అయితే నేను చెప్పబోయే విషయం మన ఇరువురి జీవితాలలో చాలా కీలకమైనదీ.. ఓ రకంగా మలుపు తిప్పే విశేషమే.”
“ఓహ్..వెరీ థ్రిల్లింగ్..ఇప్పటి నుండి క్షణమొక యుగమే నాకు. లెట్స్ మీట్ ఎట్ ద తాజ్. ఓకే డార్లింగ్ ..బై.” అని ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు ఉత్తేజ్.
ఆకాశపు నీలపు రంగు జీన్స్ పాంట్, వైట్ ఫుల్ హాండ్స్ షర్ట్ వేసుకుంది భవ్య. ఉత్తేజకీ ఇష్టమైన శాండల్ పెర్ఫ్యూమ్ చాలా లైట్ గా స్ప్రే చేసుకుంది. షాంపూ చేసుకొని డ్రై చేసుకున్న తల మీద క్లిప్ పెట్టి దువ్వి వదిలిన ఆమె ఒత్తైన పొడవాటి జుత్తు మెరసి పోతుంది. తను వేసుకున్న డ్రస్ కు మ్యాచింగ్ అయ్యే రెండు రంగులతో డై చేసుకొన్న పాయలు వింతగానే గాక, మళ్ళీ మళ్ళీ చూడలనిపించేటట్లు ఉన్నాయి. పెదాలకు లిప్ స్టిక్ రాసుకొని డెబిట్ కార్డ్, తన లెదర్ బ్యాగ్ తీసుకొంది. బుక్ చేసిన క్యాబ్ లో తాజ్ కు చేరుకుంది.

 

అప్పటికే అక్కడకు చేరుకుని ఆమె కోసం ఎదురుచూస్తున్న ఉత్తేజ్ క్యాబ్ లో నుండి దిగుతున్న ఆమెను తన్మయంగా చూస్తూ క్యాబ్ డ్రైవర్ కు ఫేర్ ఇచ్చాడు.

” ఏమిటి డియర్…మొదటి సారి చూస్తునవాడిలా అలా…”అంది గోముగా భవ్య.

“ఐదేళ్ల నుండి చూస్తూనే వున్నా..ఈ రోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నావు. నువ్వు మోడరన్ అప్సరసవి..టు డే విల్ బి ఎ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్ భవ్… అన్నాడు ఉత్తేజ్.

“డెఫినట్ లీ..లెట్స్ గో..అంటూ లోపలికి నడిచింది మంత్ర ముగ్ధుడిలా ఆమె వెనుక అతను.

“అదిగో ..అక్కడ..ఆ కార్నర్ టేబుల్ నీ కిష్టమైంది కదూ ! అని అటువైపు నడిచింది.

నా ఇష్టాలన్నింటిని గుర్తుపెట్టుకొంటావని నీ డ్రెస్, పెర్ఫ్యూమ్, ఈ కార్నర్ చెబుతున్నాయి. ఐ లైక్ యూ ఫరిట్.. తాజ్ లో ఆ కార్నర్ లో కూర్చుని డిన్నర్ చేయడం అంటే ఇద్దరికి ఇష్టం. ముఖ్యంగా ఉత్తేజ్ కు. అందుకనే ముందుగా రిజర్వ్ చేసింది. అక్కడ నుండి విశాలంగా వుండే ఆ హలంతా కనిపిస్తుంది. వేదిక మీద జరిగే సంగీత కచేరి చేస్తున్న వారిని చక్కగా చూడవచ్చు.

ఆ రోజు “వేణునాద” కచేరి. యువ కళాకారుడే అయ్యినా అద్భుతంగా వాయిస్తున్నాడు. “మలయమారుత” రాగంలో వీనులకు చేరుతున్న ఆ వేణు గానం మనసును ప్రశాంత జగత్తులో వివహరిస్తున్నది అక్కడ వారందరకు.

“గుడ్ ఈవెనింగ్ మామ్ అండ్ సర్” అంటూ విష్ చేసాడు అలవాటైన, పరిచయమైన స్టీవార్డు. చాలా తరచుగా అక్కడ డిన్నర్ చేయడం వారికి అలవాటే. బహుశా టిప్ కూడా బాగా ఇస్తారేమో, ఎంతో ఆత్మీయత స్వరంతో పలుకరించాడు.

“మే ఐ ఫెచ్ యువర్ యూజువల్…” అంటున్న అతనికి భవ్య తలవుపింది. అతను వెను తిరిగాడో లేదో.

చెప్పు డార్లింగ్..ఏమిటి సర్ప్రైజింగ్ ట్రీట్..ఏమిటి స్పెషాలిటీ..ఉదయాన నువ్వు ఫోన్ చేసిన దగ్గరనుండి ఒకటే ఉత్కంఠ..నరాలు తెగిపోతున్నాయ్..కమాన్, స్పీక్ అప్ అన్నాడు ఉత్తేజ్.

“డియర్ ..మా బావను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. అంది భవ్య ఏ ఉపోద్ఘాతం లేకుండానే.

“వాట్ …!! ఏమన్నావు? మీ బావ నా! ఆ పల్లెటూరి బైతునా..? అన్నాడు వెటకారంగా.

“ఏమైతేనేం ! ఏ రోజు మా బావ అత్యంత అస్థిపరుడు. కొత్త రాజధాని ప్రాంతంలో ఉన్న వారి భూములకు అనూహ్యమైన ధర పలికింది. కోట్లకధిపతయ్యాడు. మూడు తరాలు కూర్చుని తిన్నా తరగని అక్షయం లాంటి అస్థి ఐశ్వర్యం.

మరి …మన పెళ్ళి మాట..అడిగాడు గొంతు పేగుల్చుకుంటూ.

మన పెళ్ళా! ఇంకెక్కడ మన పెళ్ళి! అంది స్పూన్ తో పలావ్, మిక్స్డ్ కర్రీ కలిపి నోట్లోకి తీసుకొంటూ.

ఒకరి కొకరు చేసుకొన్న బాసలు! ఒక్కపుడు చేసుకున్నాం..! ఇప్పుడు నా ఉద్దేశం మార్చుకొన్నాను. అందుకే ఈ సడన్ చేంజ్. అంది భవ్య ముఖం మీద పడుతున్న జుత్తు ను వెనక్కు తోసుకొంటూ.

మాటకు కట్టు బడటం, విలువలకు గౌరవమివ్వటం మనేవి లేవా నీకు.

వీటికి మన యువత సుదీర్ఘ దూరంలో ఉంది. బాసలు చేయడం, నిలబెట్టు లేకపోవడం, క్షమార్పణలు చెప్పడం మనకు ఒంట బట్టిన కళే కదా!

మనలో ఎవరికి లేవని నీ ఉద్దేశం.. “నీకా …నాకా” ..జేపురించిన ముఖంతో ఆవేశంగా అరిచాడు.

“కూల్ డౌన్ ఉత్తేజ్..కూల్ డౌన్..లెట్స్ బి ఫ్రాంక్..మనమిద్దరం సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నాం. ఎప్పటికప్పుడు మనల్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే మన ఉద్యోగానికి భద్రత, మనకు మంచి ఆదాయం. ఈ అరటంలో ఒక్కొక్క సారి అడ్డ దోవలు తొక్కాం. మనకన్నా ప్రతిభ ఉన్న వాళ్ళని తొలగించుకున్నాం. అవునా! ఇది అన్యాయం కదా! అని మన పరిచయం ప్రేమగా పరిఢవిల్లు తున్న దశలో అన్నాను …గుర్తుందా?

అవును..అది వృత్తి ధర్మం. మన ఉద్యోగాన్ని కాపాడుకునే పద్ధతి. ఓ రకంగా భద్రత. దీన్నే లౌక్యమంటారు. ఇది అవసరం కాదని నీ ఉద్దేశమా !

లౌక్యం కావాలి.. మన జీవితాన్ని సజావుగా చేసుకొనేందుకు, హాయిగా గడిపేందుకు. కాని ఇతరులను మోసం చేయటానికి కాదు. వారి జీవితాలను అస్తవ్యస్తం చేయటానికి ఉపయోగించవచ్చా? నువ్వు విక్రమ్ ని, ప్రతాప్ ని అక్రం గా, అన్యాయంగా పక్కకు నెట్టి ఉన్నతస్థాయికి చేరుకున్నావు! దీన్ని లౌక్యమంటారా?

నన్ను తప్పుపడుతునవా..దెప్పిపొడుస్తున్నవా ?

రెండు కాదు ! మనం అనుకున్నది సాధించాలంటే ఏయే ఎత్తులు కుయుక్తులు ఎపుడెలా వేయాలో నీ సహచర్యంలోనే నేర్చుకున్నాను. నేను నా ఎదుగుదల నా జీవితం – ఇవ్వే నాకు ముఖ్యం.

నువ్వు నేర్చుకున్నది నా మీదే ప్రయోగిస్తున్నావా?

ప్రయోగించటం కాదు. నా జీవితాన్ని సుస్థిరం చేసుకునేందుకు నీ దగ్గర నుండే నేర్చుకున్న లౌక్యం. బావను చేసుకోవాలని నాన్న పట్టు పట్టినప్పుడు – నేను ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్ పాలయ్యానని నాన్నకు తెలియచేసి నాన్న ఆలోచన విరమించేటట్లు చేసావు. ఈ లౌక్యం తోనే కదా! ఆఫ్ కోర్స్..ఆ ఉదంతంలో నా పాత్ర వుందనుకో! అప్పుడు మనమిద్దరం ఒక్కటవ్వాలనుకొన్నాం.

ఇప్పుడు… గట్టిగా అరిచాడు ఉత్తేజ్.

వేణువు నుండి వెలువడుతున్న ఆ కల్యాణి రాగం తారాస్థాయికి చేరుకుంది.

డోంట్ బి ఎమోషనల్ డియర్..నేను నిన్ను చేసుకోవడం కన్నా – అతన్ని చేసుకుంటేనే సుఖపడతానని అనుకుంటున్నాను.

సుఖం అంటే డబ్బే నా!

బి సెన్సిబుల్ అండ్ ప్రాక్టికల్. ఈ డబ్బు చుట్టూతానే మనుష్యులు తిరుగుచుంటారని అదే వారి సర్వస్వమని ఎన్నో సార్లు అనుకోలేదా మనం. అబ్రాడ్ వెళ్ళి కూడా డబ్బు సంపాదించాలని అనుకున్నాం. అందరికి దూరంగా ఎన్నో గంటలు కష్ట పడితే గాని మనకు చేరని డబ్బు మా బావ దగ్గర ఉందిప్పుడు. దాన్ని పది రేట్లు చేయగల తెలివి నా దగ్గర ఉంది. నా అదృష్టపు త్రాసులో మీ ఇద్దరిని పెట్టి తూచాను. మొగ్గు మా బావ వైపే చూపింది. అతను నీ కన్నా బెటర్ ఛాయిస్. కదా.!

ఆఫ్ కోర్స్..ఒక్కసారి వద్దన్న నిన్ను అతను నిన్ను చేసుకుంటాడునుకొన్నవా ?

నేనంటే పడి చచ్చేవాడు.. వద్దనడని నా గట్టినమ్మకం. అతని నిర్ణయం వేరే విధంగా ఉన్నా అతన్ని నా వైపు తిప్పుకోగల లౌక్యం, యుక్తి నాకున్నాయి.

మరి …! అంటూ ఏదో చెప్పబోతున్న ఉత్తేజ్ ని చేతితో వారిస్తూ లేచి నిలబడింది భవ్య. లెట్స్ ఫుట్ ఫుల్ స్టాప్ టు దిస్. ఈ రోజే మా ఊరు వెళుతున్నాను. మా నాన్నగారు నా నిర్ణయం – అదే బావను చేసుకోవడం – ఆమోదించారు. ఆఫ్ కోర్స్ మన విషయం ఆయనకు తెలియదనుకో!

బై ది బై …ఐ విల్ స్టాండ్ యూ దిస్ డిన్నర్..అంటూ బయటకు నడిచింది భవ్య తన జుత్తు ను వెనక్కి తీసుకుంటూ, మనోహరంగా నవ్వుతూ..

డామిట్ కధ అడ్డంగా తిరిగింది. రాధిక, స్మిత భవ్య లలో బెస్ట్ ఛాయిస్ భవ్య అనుకున్నాను..మిస్సయ్యాను. ఇప్పుడు రాధికో , స్మితో, మరెవ్వరో…

కల్యాణి రాగంలో వినిపిస్తున్న వేణు నాదం మరింత తారాస్థాయికి చేరుతుంది..


బొడ్దపాటి చంద్రశేఖర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.