వీడ్కోలు..!

0
505

మనకి ఇలాంటి సందేహం చాలా సార్లు కలిగి ఉంటుంది కనీసం ఒక్క సారయిన మనం మనసులో అనుకుని ఉంటాం!! ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అ ప్రయత్నంగా మన కంటి నుండి కన్నిటీ ధారా పడుతూనే ఉంటాది ఇలాంటి అనుభవాలు అనుభూతులు మనదగ్గేరెన్నో ఉండి ఉంటాయి.

“విద్యాబుద్దులు నేర్పిన గురువు చివరిసారిగా తన వీడ్కోలు సభలో ఉద్వేగంగా మాట్లాడుతున్న వేళ”.. “మనకన్ని తానే అయి మననుండి ఏమి ఆశించకుండా ఆకస్మికంగా కన్ను మూసినా ఒక నేస్తాన్ని కడ సారి చూసిన వేళ”….

“జీవితాంతం తోడు ఉంటుందనుకున్న ప్రేమ బంధం కాలం వేసిన కాటుకి కనుమరుగైన వేళ”…. ఇలాంటి జ్ఞాపకాలు మనదగ్గేరెన్నో… వారెవరో తెలియకుండా మన పరిచయం మొదలవ్తుంది ఒక జ్ఞాపకాన్ని మాత్రం మిగులుస్తుంది..

వీడిపోతే వారి విలువ తెలుస్తుందని కాదు ఎందుకంటే మనకేందుకో మనం వారిని వీడిపోతామని వారికి దూరంగా ఉంటామనే ఆలోచనే రాదు.. వీటన్నింటికి ఒకే ఒక కారణం అదే ప్రతి మనిషికి వీడ్కోలు ఒక భాగమేనని… కాని మనం దీనికి ఒప్పుకోము కాదా…!!!


@ నరేష్ పెద్దిరెడ్డి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.