మనిషి-మనసు

0
713

మనిషి-మనసు

మనిషిలోనే మనసు
మనిషికి స్వార్ధం
మనసుకి స్వేచ్చ
మనిషికి డబ్బు,దర్పం
మనసుకి అభిమానం,ఆలంబన
మనిషిలోనే మనసున్న అలోచన వేరు!


అలోచనా-ఆవేశం

అలోచనా అవేశం-
మనసిషిలోనే పుట్టినా
అలోచన వల్ల వివేకం కలిగి
అనిషి ముందు తరాలకు దారి చూపుతాడు.
అదే ఆవేశం అయితే …
అలోచన కోల్పోయి..
బుద్ధి మందగించి
వినాశనానికి కారణమయ్యి
ముందు తరాల వారికి పాఠం గా మిగులుతాడు!


జ్ఞానం-అజ్ఞానం

జ్ఞానం అజ్ఞానం
మనసులోనే పుట్టినా
జ్ఞానం తనని తాను తెలుసుకుంటూ
ఇతరులకు తానేమిటో తెలియచేస్తుంది.
అజ్ఞానం తనని తాను మరచి
చుట్టూ ఉన్న వారిని అరచేలా చేసి
మూర్ఖత్వపు జాడలలోకి నెట్టేసి
ఉర్ఖునిగా తయారుచేస్తుంది!


చీకటి-వెలుగు

చీకటి వెలుగులు
ఒకదానితోనే రెండోది
ఒకటి ఉంటేనే..
రెండవ దాని విలువ తెలిసేది
చీకటిలో మనిషి గయం కోసం ఆరాటం
పోరాటం సాగించి వెలుగును కనిపెడతాడు.
వెలుగు వచ్చాక సాధించిన పోరాటాన్ని
మరచి తానేమిటో తనకేం కావాలో
విస్మరిస్తాడు..వెలుగులో ఉంటూనే
చీకటిలో బ్రతుకుతుంటాడు..


@తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.