భయం

0
699

“భయం” మనల్ని నిర్వీర్యులని చేసే జబ్బు.
మనలోని బలహీనతలను చేతకానితనాన్నీ ఎత్తి చూపుతుంది.
మనలోని బలన్ని మనకు చూపదు..అణచివేస్తుంది.
కీటకాలు మురికి ప్రదేశాలలో పెరిగినట్లు,
భయాలు అజ్ఞానంతో నిండిన మనసులలో పెరుగుతాయి.

ఏదైనా ఒక విషయం గురించి కానీ,దాని పర్యావసానాల గురించి కానీ,
పనులవల్ల సంభవించే పరిణామాల గురించి కానీ
తెలియనితనమే భయాన్ని కలుగచేస్తుంది.

ఎక్కడ విషయ అవగాహన వుంటుందో
అక్కడ భయం వుండదు.
భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవటమే
భయాన్ని జయించటానికి ఉత్తమమైన మార్గం.

దేనిని గురించి భయపడతామో దానికి ఎదురుగా నిలబడాలి.
మనసులో ధైర్యం నింపుకుని ముందడుగు వేయాలి.
పరాజయ భయం ఉన్నవారు విజయాన్ని సాధించలేరు.

విష్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని ముందుకు వెళితే
భయం వెనకడుగు వేస్తుంది..
పరాజయ భయమో,ఇంకొకరు ఏమనుకుంటారో
అన్న అలోచన వల్ల కలిగే భయాన్ని అధిగమించాలీ.

మన మనసుకు మనమే ధైర్యాన్ని ఇవ్వాలి..
స్ప్పూర్తిని నింపుకోవాలి..

మన పూర్వికులైనటువంటి వేమనగారు విజయ సూత్రాన్ని ఏనాడో చెప్పారు …

“అజ్ఞానమే భయము..అది పోయినచో పరమార్ధము స్పష్టమగును” అనీ.

పిరికివాడు సేనాని అయితే యుద్ధం చేయకనే “ఓటమిపాలు” కావటం ఖాయం…


@తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.