నవ్వు నవ్వించు

0
762

నవ్వు నవ్వించు..
నవ్వు నలభై విధాల మంచిది..
నవ్వండి అరోగ్యంగా వుందాం..
మనస్పుర్తి గా నవ్వుదాం..

ఎదుటి వారి బాధల్ని చూసి నవ్వకండి,రేపు మనకీ అదే పరిస్తితి వస్తుంది..
ఈ నవ్వులోనూ రకాలున్నాయ్ అండోయ్..

హాయిగా నవ్వేది ఓ నవ్వు ఈ నవ్వుని చూసి పక్కవాళ్ళు నవ్వుతారు..
ఆహ్లాదాన్ని చూసి వారి మనసుకు ప్రశాంతంగా అనిపించటం ఖాయం.

ఆరనవ్వు..మళ్ళీ ఇందులో రెండు రకాలు..
మొహమాటంగా కాస్త ఇబ్బందిగా నవ్వట0 ఓ రకమైతే..
నవ్వలేక నవ్వేదాన్ని కూడా అరనవ్వే అంటారు.

కొత్తవారిని కలసినప్పుడు చిరునవ్వు తో స్వాగతించండి ఆ అనందమే వేరు..
త్వరగా కలవటానికీ, మొహమాటాలు పోవటానికీ ఉపయోగపడుతుంది.

ఈడొచ్చిన ఆడపిల్ల అలా చూస్తూ ఓ కొంటె నవ్వు నవ్వితే కుర్రాళ్ళ మనసులు గాలిలో తేలాల్సిందే..

భర్త కోసం ఎదురు చుసే ఇల్లాలు తను కనపడగానే నిండుగా ఓ నవ్వు నవ్వుతుంది.
ఆ నవ్వు లో వున్న అత్మీయతకి ఆ రోజు పడిన శ్రమంతా మరచిపోతాము..

అమ్మ దగ్గర ఓ నిష్కల్మషమైన నవ్వు వుంటుంది…
ఆ నవ్వు చుస్తే ఎన్ని బాధలున్నా మర్చిపొతాము.

ఆసూయ,ఈర్ష తో నవ్వేది వంకర నవ్వు..
ఈ నవ్వు కొంచెం ప్రత్యేకం..అందరూ నవ్వలేరు..
నవ్వ వద్దు కూడా…

ఇంకోరకం నవ్వు…వీళ్లు పెదాలతో నవ్వుతూనే ఉంటారు..
నొసటితో వెక్కిరిస్తారు..
ఈ నవ్వుని ఉదాహరణకి కూడా చూపలేం.. ఇలా నవ్వటానికి చాలా ప్రాక్టీస్ కావాలి..మనసులో బోలెడు కుళ్ళు ఉండాలి..అందరికీ అసాధ్యం..

ఏంతమందిలో వున్న పెద్దగా నవ్వుతారు కొందరు..వారికి దాచుకోవటం తెలియదు. లోపలా బయటా ఒకేలా ఉంటారు.
ఏవరో ఎదో అనుకుంటారని వారు నవ్వుని ఆపుకోలేరు మనస్పూర్తిగా వుంటారు..

నవ్వుతూ వుందాం..
నవ్విస్తూ జీవితం గడిపేద్దాం..
నలుగురితో కలసి సాగిపోదాం…


@తులసి..

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.