మానవశరీరం స్వయంనివారణ శక్తి

0
631

మానవ శరీరం స్వయంగా నివారణ చేసుకొనే శక్తిని కలిగి ఉంది.

ఆలోచనలు శరీరం మీద ప్రభావాలను కలిగి ఉన్నట్లు ప్రయోగశాలలో కనుగొనబడింది. ప్లేసిబో ప్రభావం (ఒకానోక మందు లేదా ఆలోచనల పై గల నమ్మకం): ఈ నమ్మక ప్రభావం కనీసం 1/3 రుగ్మతలను ఒక వ్యక్తి యొక్క జీవశాస్త్ర పరిమితులను అధిగమించగలదు. నేను సరిగ్గా ఉన్నానని ఉద్దేశపూర్వకంగా తలవడం వలన శరీరానికి తనకు తానుగా సరిచేసుకోవడానికి సమాచారం అందజేయబడుతుంది.

మన ధ్యాస అనుకూలమైన ఆలోచనల (Positive thoughts) పై మళ్ళించడం ద్వారా మన శరీర ఆరోగ్యం పెరుగుతుంది. అనుకూలమైన ఆలోచనలు పెంపొందించుటకు పరికరాలుగా యోగా (ఆసనములు, ధ్యాన, ముద్రలు), ఆక్యూ ప్రెషర్ ఎంచుకొన వచ్చు.

మనము సానుకూల ఆలోచనలతో (positive thoughts) ఉన్నప్పుడు, మనము మన శరీరం లోనికి సానుకూల రసాయనాలు విడుదల చేస్తాము.

ఉదాహరణకు, ఒకరిని హృదయ పూర్వకంగా శ్లాఘించడం వలన శ్లాఘించబడిన వ్యక్తికి మనసు ఆనందమయమయి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

  • చప్పట్లంటే చేతులు చరచడం కానీ మనము ఆలోచించిన దాని కంటే ఈ పని చాలా ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది.
  • సాధారణంగా ప్రజలు ఇతరులను వారి మంచి పనులు మరియు విజయాలను అభినందించడానికి ఆనందంతో చప్పట్లు కొడతారు.
  • పవిత్ర స్థలాలలో పాటలు, భజనలు, మరియు ప్రార్థనలు పాడుతున్నప్పుడు కూడా ప్రజలు చప్పట్లు కొడుతూ ఉంటారు.
  • అనేక వ్యాధులను నయం చేసేందుకు ఈ చప్పట్ల వ్యాయామం చాలా ప్రభావవంతమైనదని శాస్త్రీయంగా నిరూపించబడింది.
  • చప్పట్లు చేతులలోని రిసెప్టర్స్ ను ప్రేరేపించడం ద్వారా మెదడు లోని విస్తార ప్రాంతానికి క్రియాశీలతను కలిగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • మన అరచేతి మీద దాదాపు అన్ని అవయవాల కోసం 39 వేర్వేరు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి, ఇవి చప్పట్లు చరచడం ద్వారా క్రియాశీలమవుతుంది మరియు చర్య నెమ్మదిగా కానీ సమర్థవంతంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఉదయం 10 నుంచి 12నిముషాల పాటు చప్పట్లు సక్రియంగా కొట్టే చర్య మన శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.
1. జీర్ణాశయ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు చప్పట్లు సమర్థవంతమైన ఔషధం.
2. నడుము నొప్పి, మెడ నొప్పి మరియు మోకాలి నొప్పికి ఉత్తమ చికిత్స.
3. గౌట్ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు చప్పట్ల ద్వారా సులభంగా నివారించవచ్చు.
4. తక్కువ రక్తపోటు రోగికి సహాయపడుతుంది.
5. గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి నయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
6. ప్రధాన మరియు పరస్పర ఛానళ్ల నుండి అడ్డంకులను తొలగిస్తుంది. ఫిట్గాను మరియు ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
7. రోజువారీ ఈ వ్యాయామం అభ్యాసం చేస్తున్న పిల్లలు కేవలం కొన్ని Spelling mistakes మాత్రమే చేస్తారు మరియు ఇతరులకన్నా కష్టపడి చదువుతారు.
8. చప్పట్ల వ్యాయామం వారి చేతివ్రాతను మెరుగుపరుస్తుంది.
9. చప్పట్లు కొట్టడం వలన పిల్లల మెదళ్ళు పదునవుతాయి.
10. శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతికూల ఆలోచనలు (Negative thoughts) యొక్క ప్రభావాలు:
ప్రతికూల ఆలోచనలు మన మనసు లోనిక ప్రవేశించినంతనే,
1. శరీరం ప్రతికూల ఆమ్లాలను విడుదల చేస్తుంది.
2 – మన సౌరభం (aura) తగ్గుతుంది.
3 – మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
4 – మన సిస్టమ్ యొక్క విధులు ప్రభావితమవుతాయి.
5 – మన హృదయ స్పందన పెరుగుతుంది.
6 – మన రక్తపోటు పెరుగుతుంది.
7 – అవాంఛిత హార్మోన్లు విడుదలవుతాయి..
ప్రతికూల ఆలోచనతో మనము ఇతరులకు హాని చేయలేకపోవచ్చు … కానీ మనకి ఖచ్చితంగా హాని కలగడం ఖాయం!

మన మెదడ్లు మారుతూ ఉంటాయి మనకి తెలుసు. అలాగేమన శరీరం కూడా మారుతూ ఉంటుందని మనకి తెలుసు. కేవలం, 1/3 రుగ్మతలు సానుకూల ఆలోచన కలిగి ఉంటే మరే ఇతరమైనదేదైనా చేయకుండా నివారణ అవుతాయి.
మరిన్ని వివరాలకు gaia.com ద్వారా తెలుసు కొనవచ్చను.


Subbarao Kasturi 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.