Cervical Spondylosis

0
554

గ్రీవా కశేరుకల క్షీణత (Cervical Spondylosis) కోసం గృహ నివారణలు

వెన్నెముక సౌలభ్యతను (flexibility) ప్రభావితంచేసే ఆర్థరైటిస్, దీనికి సరళమైన నిర్వచనం. Spondy అనగా వెన్నెముక అని అర్థం; losis అనగా సమస్య అని అర్థం. కానీ నేడు వైద్యులు ప్రత్యేకంగా వెన్నెముకలో కలిగే నొప్పులు (arthritis in the spine) అనే అర్థంలో దాన్ని చెబుతున్నారు.

Spondylosis కాలవ్యవధి (part of aging) యొక్కభాగం, అంటే వెన్నెముక క్షీణత వలన కలిగిన రుగ్మత. మెడ ఎముకల వద్ద మృదులాస్థి మరియు అసాధారణ అరుగుదల ఉన్నప్పుడు, ఈ cervical spondylosis రుగ్మత సంభవిస్తుందని చెబుతారు. దీనికి cervical osteoarthritis, మరియు neck arthritis పర్యాయములు.

వయస్సేకాక, ధూమపానం, కూర్చొనే లేదా నడకలో తప్పు భంగిమలు, అధిక శరీర బరువు, మెడ మీద ఎక్కువ ఒత్తిడి కలిగించే వృత్తులు, కొన్ని మెడ గాయాలు, నిశ్చల జీవనశైలి (sedentary lifestyle), జన్యు కారకాలు (genetic factors), కుటుంబచరిత్ర (family history), లోతు అంచనా లేని దముకుడు (Jerk), మెడ రుబ్బుతున్నట్లున్న శబ్దాలు, అదే సమయంలో మెడలో చలనాలు, మరియు విరామం లేని పర్వతారోహణము, మనసు కలుగు బెదరు (Trauma) తదితర హాని కారకాలు, సర్వైకల్స్పాండిలోసిస్ కలిగించవచ్చు.

చాలా మంది లో ఈ రుగ్మతను గుర్తించటానికి వీలైన లక్షణాలు కనపడవు. అయితే, కొంత మందిలో మెడ నొప్పి, భుజం చుట్టూ స్వల్పమైన లేదా దీర్ఘకాలిక నొప్పి, మెడ దృఢత్వం, కండరాల బలహీనత, తలనొప్పి (ఎక్కువగా తల వెనుక), చేతులు మరియు వేళ్లు నొప్పి, భుజాలు మరియు చేతుల జలదరింపు సంచలనం కలుగుతుంది. అప్పుడప్పుడు, బ్యాలెన్సు కోల్పోవడం వంటి లక్షణాలు కలిగిఉండవచ్చు.
అదృష్టవశాత్తూ, కొన్నిమందులు, సాధారణ జీవనశైలి మార్పులతో మరియు కొన్ని సాధారణ గృహ నివారణలు యొక్క సహాయం తో, ఈ రుగ్మత లక్షణాలను నియంత్రించి మరియు నొప్పి లేని జీవితమును తిరిగి పొందవచ్చును. ఇది చాలా శాతం మానసీక, శరీర రుగ్మత (Psycho-Somatic) అయినందున వినియోగించే మందు, వ్యాయామం పై గట్టి విశ్వాసము చాలా అవసరం. నమ్మకం తో సగం రుగ్మత నివారణ అవుతుందని చెప్పడంలో ఎటు వంటి అతిశయోక్తి లేదు.


1. క్రమబద్ధమైన వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం లేకపోవడం స్పాంన్డిలోసిస్ యొక్క ప్రధాన కారణాలలో ఒకటి. అందువలన, మీరు మీ జీవనశైలి కి సాధారణ భౌతిక వ్యాయామం చేర్చడం ద్వారా మీ మెడ మరియు భుజాలు చుట్టూ నొప్పి మరియు దృఢత్వం తగ్గిస్తుంది.

సవ్య మరియు అపసవ్య (Clockwise and Anti clockwise) రెండు దిశలలోనూ ఒక దాని తరువాత మరొక దిశలో మీ తలను తిప్పండి, మరియు భుజం నుండి కుడి, ఎడమ వైపులకు మెడ వంచండి. రోజుకు 10 నిమిషాలు 2 లేదా 3 సార్లు చేయండి. ఈ వ్యాయామం తీవ్రమైన మీ మెడ నొప్పికి ఉపశమనం అందించడంలో సహాయం చేస్తుంది.
 సవ్య మరియు అపసవ్య దిశల్లో మీ చేతులు మెల్లగా త్రిప్పండి, మరియు నొప్పిని నియంత్రించడానికి క్రమ అంతరాలలో మీ పిడికిలి ని ఒక దాని తరువాత మరొకటి మెల్లగా బిగించడం, తెరవడం చెయ్యండి.
అలాగే, ఈత లేదా చురుకైన వాకింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు వారానికి కనీసం 5 సార్లు 30 నిమిషాల పాటు చెయ్యండి.

మీరు ఒక క్రమ పద్ధతిలో సైక్లింగ్ కూడా చేయవచ్చు. అయితే, వెన్ను నేరుగా ఉంచి సైక్లింగ్ చేయాలి.
వైద్యని సలహా పై ఫిజియోథెరపీ అనుసరించడం ఒక మంచి పద్దతి.
గమనిక: ఎలాంటి వ్యాయామమైన చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి కలిగితే, అది చేయడం ఆపి మీ వైద్యుడను సంప్రదించడం చాలా ముఖ్యం.

2. వేడి మరియు చల్లని సంపీడనం (Hot and Cold Compresses)
మెడ నొప్పి ఎదుర్కోవటానికి మరో సులభమైన మార్గం, ప్రభావిత ప్రాంతం మీద వేడి మరియు చల్లని సంపీడనం ఉపయోగించండి. వేడి సంపీడనం రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు నొప్పిగా ఉన్న కండరాలకు విశ్రాంతి ఇస్తుంది. చల్లని సంపీడనం వాపును తగ్గిస్తుంది.
• వేడి ఒత్తిడి చేయడానికి, ఒక సన్నని టవల్ లో వేడి నీటి సంచి (hot water bag) ని చుట్టండి.
• చల్లని కుదింపు చేయడానికి, ఒక సన్నని తువ్వాలులో కొన్ని ఐసు ముక్కలు చుట్టండి.
• 2 నుండి 3 నిమిషాలు ప్రభావిత ప్రాంతం మీద వేడి ఒత్తిడి ఉంచండి.
• వేడి నీటి సంచి తొలగించండి మరియు 1 నిమిషం చల్లని ఐసు మక్కలు చుట్టిన టవల్ ప్రభావిత ప్రాంతం మీద ఉంచండి. .
• 15 నుండి 20 నిమిషాలు ఈ విధానాన్ని పునరావృతం చెయ్యండి.
• ఉపశమనం వచ్చేవరకు ఈ సాధారణ పరిష్కారం కొన్ని సార్లు రోజువారీ అనుసరించండి.

గమనిక: ప్రభావిత ప్రాంతం ఎరుపు మరియు అసహనం కలిగిస్తే వేడి సంపీడనం ఉపయోగించ వద్దు. రక్త ప్రసరణ సమస్యలు ఉంటే చల్లని సంపీడనం నివారించండి. మరువకండి.


3. ఎప్సోమ్ ఉప్పు బాత్
ఒక క్రమ పద్ధతిలో ఒక ఎప్సోమ్ ఉప్పు స్నానం సర్వైకల్ స్పాంన్డిలోసిస్ సంబంధించిన లక్షణాలు తగ్గించే మరొక మంచి నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఎప్సోమ్ ఉప్పు లోని మెగ్నీషియం మెడ మరియు భుజాల లో దృఢత్వం, మంట మరియు నొప్పి తగ్గించి క్రమంగా శరీరంలోని pH స్థాయిని నియంత్రిస్తుంది.

1 – 2 టేబల్ స్పూనుల ఎప్సోమ్ ఉప్పును నీటితో కలిపి మందపాటి పేస్ట్ చేయండి. ఓదార్పు పొందుటకు 15 నుంచి 20 నిమిషాలు ప్రభావిత ప్రాంతం మీద పూత పూయండి. ప్రతి రోజు ఈ పద్దతి ఆచరించండి.
ప్రత్యామ్నాయంగా, వెచ్చని స్నానం చేసే నీటికి టబ్ కు 2 కప్పుల ఎప్సోమ్ ఉప్పు ను జోడించండి. 15 నుండి 20 నిమిషాలు ఆ నీటిలో ఉండండి. ఈ స్నానం ఒక వారం లో 2 లేదా 3 సార్లు చేయండి.

గమనిక: మూత్రపిండ సమస్యలు, గుండె సమస్యలు లేదా మధుమేహం ఉన్నవారు. ఈ పరిహారం ఉపయోగించకూడదు.


4. వెల్లుల్లి
సర్వైకల్ స్పాంన్డిలోసిస్ లక్షణాలకు వెల్లుల్లి మంచి ఫలితాలు ఇస్తుంది. వ్యతిరేక-వాపు మరియు అనాల్జేసిక్ లక్షణాలు కలిగి మెడ మరియు పరిసర ప్రాంతాల్లో నొప్పి, మరియు వాపులకు ఉపశమనం ఇస్తుంది.

రెండు ముడి వెల్లుల్లి పాయలు నీటితో ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో సేవించండి. మీరు వెల్లుల్లి గుళికలు (garlic capsules) కూడా తీసుకోవచ్చును, కానీ మీ వైద్యుడ్ని సంప్రదించిన తర్వాత మాత్రమే.
మరొక ఎంపికగా ఒక పాన్ లో వెజిటబుల్ నూనె తో 2 – 3 పిండిచేసిన వెల్లుల్లి పాయలను వేసి మరిగించండి. చల్లబరిచి, ఆ తర్వాత 5 నుండి 10 నిమిషాలు బాధాకరమైన ప్రాంతంలో మసాజ్ చేయండి. ఆ తర్వాత వేడి నీటి స్నానం చెయ్యండి. రోజూ ఈ పద్దతి 2 సార్లు చేయండి. మీరు పూర్తిగా నివారణ పొందే వరకూ ప్రతి దినమూ ఈ నివారణలు కొనసాగించండి.


5. పసుపు
దాని వాపు నిరోధక లక్షణాల కారణంగా, పసుపు సర్వైకల్ స్పాంన్డిలోసిస్ నివారణ కోసం మరొక ప్రసిద్ధ నివారణ మార్గంగా చెప్పవచ్చు. అదనంగా, పసుపు కండరాల దృఢత్వం మరియు నొప్పి తగ్గిస్తుంది రక్త ప్రసరణ పెరుగుతుంది.

ఒక గ్లాసు పాలలో పసుపు పొడి 1 టీస్పూన్ కలపాలి. 5 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించండి. చల్లబరచి, ఆపై కొద్దిగా తేనె జోడించండి. రోజువారీ 2 సార్లు త్రాగండి.

ప్రత్యామ్నాయంగా, రోజువారీ, పసుపు గుళికలు (turmeric capsules) 3 సార్లు తీసుకోండి. సరైన మోతాదు కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.


6. నువ్వులు
సర్వైకల్ స్పాంన్డిలోసిస్ పరిష్కరించేందుకు ప్రముఖ ఆయుర్వేద ఔషధంగా నువ్వులను ఉపయోగిస్తారు. ఇవి కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, జింక్, భాస్వరం మరియు విటమిన్లు కె మరియు D, సమృద్ధిగా ఉంటాయి. మీ ఎముకలు మరియు మొత్తం ఆరోగ్యానికి మంచివి. నువ్వులు నూనె కూడా మెడ నొప్పి తగ్గించుటకు ప్రభావవంతమైన ఔషదం.

10 నిమిషాలు ప్రభావిత ప్రాంతం మీద వెచ్చని నువ్వుల నూనె వేసి మర్దన చేయండి. తరువాత ఆ ప్రాంతం మీద వేడి ఓత్తిడి పెట్టండి రోజువారీ ఈ 3 లేదా 4 సార్లు చేయండి. మీరు వెచ్చని నువ్వుల నూనెలో, లవెందర్ నూనె కొన్ని చుక్కల జోడించవచ్చు మరియు మెడ ప్రాంతంలో మసాజ్కు దానిని ఉపయోగించవచ్చు.

ఇతర ఎంపికలుగా రోజువారీ ఉదయం ఒకసారి వేయించిన తెలుపు నువ్వులు 1 టేబుల్ స్పూను నమలండి లేదా ఒక గ్లాసు వెచ్చని పాలలో 1 టీస్పూను వేయించి, పొడి చేసిన నువ్వుల విత్తనాలు కలిపి మరియు రోజువారీ 2 సార్లు సేవించండి. అలాగే, మీ వంటల్లో నువ్వులు వాడండి.


7. అల్లం
అల్లం సర్వైకల్ స్పాంన్డిలోసిస్ పరిష్కరించేందుకు మరొక విస్తృతంగా ఉపయోగించే గృహ వైద్యం. ఈ మూలికలో శోథ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి మరియు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందువలన, అది మెడ మరియు పరిసర ప్రాంతాలలో నొప్పి మరియు వాపు తగ్గించే విషయంలో సహాయపడుతుంది.

రోజూ 3 సార్లు అల్లం టీ త్రాగండి. టీ తయారు చేయడానికి 1 టేబుల్ స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించండి, వడబోసి, తేనె జోడించి సేవించండి.
ప్రత్యామ్నాయంగా, ఎండిన అల్లం వేరు, సెలరీ విత్తనాలు మరియు జీలకర్ర సమాన మొత్తంలో ఉపయోగించి పొడి తయారు చేయండి. రుచి మెరుగుపరచడానికి రాతి ఉప్పు జోడించండి. రాత్రి పడుకునే ముందు ఈ పొడి 1 టీస్పూను, నీటి తో సేవించండి.

రోజువారీ అల్లం నూనె తో కూడా ప్రభావిత ప్రాంతంలో కొన్ని సార్లు మసాజ్ చేయవచ్చు.


8. ఆపిల్ సైడర్ వినెగార్
శోథ నిరోధక మరియు క్షార లక్షణాలు పుష్కలంగా ఉన్న, ఆపిల్ సైడర్ వినెగార్ కూడా సర్వైకల్ స్పాంన్డిలోసిస్ కోసం ఒక మంచి పరిష్కారం. ఇది సమర్థవంతంగా మెడ భాగం లో నొప్పి మరియు వాపులకు ఉపశమనాన్ని ఇస్తుంది.

ప్రభావిత ప్రాంతం పై ఆపిల్ సైడర్ వినెగార్ లో ముంచిన ఒక కాగితపు టవల్ ఉంచండి. కొన్ని గంటలు వదిలేయాలి. రోజూ 2 సార్లు చేయండి.

మరొక ఎంపికగా గోరు వెచ్చని నీరు గల స్నానం టబ్బులో 2 కప్పుల ఆపిల్ సైడర్ వినెగార్ జోడించండి. ఆ నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉండాలి ఇలా రోజు కు ఒకసారి చెయ్యండి.
ఒక గ్లాసు నీటికి 1 టేబుల్ స్పూను ముడి సేంద్రీయ ఆపిల్ సైడర్ వినెగార్, మరియు కొద్దిగా తేనె జోడించి రోజువారీ ఒకసారి సేవించండి.


9. కారపు పొడి 
సర్వైకల్ స్పాంన్డిలోసిస్ కు మరో సమర్థవంతమైన గృహ నివారణ కారపు పొడి. అది శోథ నిరోధక లక్షణాలు అనాల్జేసిక్ కలిగినందు వలన మెడ నొప్పి మరియు వాపు తగ్గించడానికి సహాయపడుతుంది.

1 టీ స్పూను కారపు పొడి, 2 టేబులు స్పూనులు గోరు వెచ్చని ఆలివ్ నూనె కలిపి ప్రభావిత ప్రాంతం మీద రాయాలి. ఒక కట్టు తో నొప్పి ప్రాంతం కవర్ చేసి కొన్ని గంటలు లేదా రాత్రి పూటంతా వదిలేయాలి. నివారణ పొందే వరకు రోజూ ఈ పద్దతి అనుసరించండి.

ప్రత్యామ్నాయంగా, ఒక గ్లాసు వెచ్చని నీటిలో 1 టీస్పూను కారపు పొడి జోడించండి. రోజువారీ 2 – 3 సార్లు ఈ పానీయం సేవించండి.


10. ఇండియన్ లిలక్ (వేప)
ఇండియన్ లిలక్ ను, వేప అని కూడా పిలుస్తారు సర్వైకల్ స్పాంన్డిలోసిస్ కారణంగా వచ్చే నొప్పి, వాపు మరియు మెడ వాపు తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే నొప్పి అణచివేసే లక్షణాలు కలిగి ఉంది.

1 టేబుల్ స్పూను వేప పొడికి కొద్దిగా నీరు జోడించి మందపాటి పేస్ట్ చేయండి. కొన్ని నిమిషాలు ఒక డబుల్ బాయిలర్ లో (గిన్ని లో గిన్ని పెట్టి లోపల గిన్నెలో పేస్ట్ ఉంచి బయటి గిన్నెలో నీరు పోయాలి) పేస్ట్ వేడి చేయండి. ప్రభావిత ప్రాంతాల్లో ఈ వేడి పేస్ట్ (వేడి భరించదగినంతగా ఉండాలి) పూయండి. 30 నిమిషాలు పాటు వదిలి, అప్పుడు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. రోజూ కొన్ని సార్లు (4 – 5 సార్లు) పునరావృతం చేయండి.

మరొక ఎంపికగా 1 కప్పు నీటిలో కొన్ని వేప ఆకులు మరియు వేప పూవులు వేసి మరిగించండి. ఇది చల్ల బడిన పిమ్మట వడబోసి రోజువారీ రెండు సార్లు త్రాగండి.

మీరు వేప నూనె తో కూడా ప్రభావిత ప్రాంతంలో రోజు కు 2 సార్లు మసాజ్ చేయవచ్చు.


అదనపు చిట్కాలు
• భోజనం మరియు విందు తర్వాత కొద్దిగా కరక్కాయ తినడం కూడా నొప్పి మరియు దృఢత్వం నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది.
• భౌతిక శ్రమ నివారించండి. భారీ వస్తువులు ఎత్తడం వలన, సమస్య మరింత హానికరం అవుతుంది
• రాత్రి మంచి నిద్ర పొందండి. ఒక గట్టి, సన్నని దిండు మీద నిద్ర, మీ మెడ మీద ఒత్తడి తగ్గించేలా ఉండాలి; కాని అనేక దిండ్లు ఉపయోగించ రాదు. వీపు భాగం పరుపు వెైపు లేదా ప్రక్కకు తిరిగి మోకాలు మొండెం తో సరైన లంబ కోణంలో (90 డిగ్రీలు) వంచి, ఒక గట్టి పరుపు మీద నిద్ర పోవాలి.
• నిలబడినప్పుడు మరియు కూర్చొని ఉన్నప్పుడు సరైన భంగిమ నిర్వహించడాని ప్రయత్నించాలి.
• టమోటాలు, క్యారట్లు, క్యాబేజీ, దోసకాయలు, పాలకూర మరియు ముల్లంగి వంటి ముడి కూరగాయలతో తయారు చేసిన సలాడ్ పుష్కలంగా తినాలి.
• కొవ్వులు, మసాలా మరియు వేయించిన ఆహారాలు, పుల్లని పెరుగు, స్వీట్లు, పంచదార మరియు కాఫీ మానుకోండి.
• ధూమపానం మరియు పొగాకు ఏ ఇతర రూపంలోనూ తీసుకోరాదు.
• అధిక ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం మరియు ఫాస్పరస్ కలిగిన ఆహారాలు తినండి.
• తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు చిన్న వ్యవధులలో ఒక మృదువైన మెడ కలుపు లేదా కాలర్ ధరిస్తారు. దీర్ఘకాలం పాటు ధరించడానికి లేదు.
• రోజూ ఉదయాన్నే 10 నుంచి 15 నిమిషాల పాటు బాధిత ప్రాంతంలో సూర్యరశ్మి పడేలా చూడండి.
• మీ లక్షణాలు మరింత, లేదా ఆకస్మికంగా తిమ్మిరి, బలహీనత లేదా మూత్రపు తిత్తి లేదా ప్రేగుల నియంత్రణ కోల్పోయినట్లైతే, వెంటనే మీ డాక్టర్ ను సంప్రదించండి.
ఈ సాధారణ విషయాలు పని చేస్తాయాన్న సందేహమే వద్దు. విశ్వాసంతో, ధృఢ నిశ్చయంతో ఈ పరిష్కారాలు వినియోగించండి, మీరు ఖచ్చితంగా తిరిగి మీ సంపూర్ణ ఆరోగ్యం పొందగలరు.


Subbarao Kasturi 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.