గృహ వైద్యం – నిద్రలేమి నివారణలు

0
757

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల మీద నిద్రలేమి తన ప్రభావం చూపుతోంది. సహజంగానే, నిద్ర కొరకు బాధితులు వివిధ నివారణలను ప్రయత్నం చేయడం చూస్తున్నాము. చైనీస్ నిపుణులు సంప్రదాయ వైద్య (TCM -TRADITIONAL CHINESE MEDICINE) పద్దతి వలన కేవలం 10 నిమిషాల్లో నిద్ర పొందవచ్చని చెబుతున్నారు.

1. నిద్రలేమి నివారణ విధానాలలో, అత్యంత ప్రభావవంతమైన 4-7-8 శ్వాస టెక్నిక్ ఒకటి.
నిజానికి, ఈ వ్యాయామం వలన 10 నిమిషాలు లోపల నిద్ర పొందగలరని హార్వర్డ్ డాక్టర్ ఆండ్రూ వెయిల్ ధృవీకరించారు, కానీ ఈ వ్యాయామం యొక్క మూలాలను చైనాకు ఆపాదించవచ్చు.

ఈ పద్ధతి లో మీరు “whoosh” అని శబ్దం చేస్తూ, నోటి ద్వారా పూర్తిగా గాలిని బయటకి వదలాలి (నిశ్వాసం). తరువాత మీరు మానసికంగా నాలుగు నంబర్లు లెక్కించి అప్పుడు, ముక్కు ద్వారా నిశ్శబ్దంగా గాలిని లోనికి పీల్చాలి (ఉశ్వాసం). మీరు ఒకసారి అలా గాలిని లోనికి పీల్చిన (ఉశ్వాసం) తరువాత, మీరు అప్పుడు ఏడు నంబర్లు లెక్కించే వరకు మీ శ్వాసను నిలపాలి. చివరిగా, మీరు ఎనిమిది నంబర్లు లెక్కిస్తూ మీ నోటి ద్వారా గాలిని నిశ్వాసం చేస్తూ మళ్ళీ, “whoosh” ధ్వని చేయ్యాలి. ఇంతవరకు ఒక శ్వాస ఆవృతం (cycle) పూర్తి అవుతుంది. ఈప్రక్రియ 4 ఆవృతాలు పునరావృతం చేయాలి. ఈ శ్వాస టెక్నిక్ వలన శరీరం అంతటా ఒక ఉపశమన భావన కలిగి, చాలా సులభంగా నిద్ర వచ్చేట్లు చేస్తుంది.

2. మంచి నిద్ర కోసం ఆయుర్వేద మెడిసిన్
ఆయుర్వేదం ప్రకారం, దీర్ఘకాలిక రోగాలు, లేదా అధిక ఒత్తిడి Ojasను (ప్రధానంగా తెల్లగా ఉంటూ పసుపు, మరియు ఎరుపు రంగు తో కలసిన దానిని ఓజస్ అని చరక మహాముని నిర్వచించారు). తగ్గిస్తుందని చెబుతారు. రోగనిరోధక శక్తి, పునరుత్పత్తి, అందం, మొత్తం ఆరోగ్యానికి ఓజస్ బాధ్యత వహిస్తుందని చెప్పబడుతుంది.

ఓజస్ శరీరంలో తయారవడానికి 30 రోజులు పడుతుంది, అనేక ఎంజైమ్ చర్యలు యొక్క ఫలితంగా జీర్ణక్రియ ప్రారంభమై శరీరం యొక్క శోషరస (Lymph), రక్తం, కండరాలు, కొవ్వు, ఎముక, నరాల పునరుత్పత్తి కణజాలం (tissues) లోకి సారం ప్రవేశపెట్టబడుతుంది.. ఈ కణజాలం విజయవంతంగా తయారైనపుడు శరీరం తుది ఉత్పత్తిగా ఓజస్ తయారవుతుంది.

ఒత్తిడి, నిద్ర లేకపోవడం, అసమతుల్య ఆహారం, అక్రమ జీర్ణశక్తి, అధిక పని లేదా పని మీద అశ్రద్ధ వంటివి, ఓజస్ క్షీణించుట వలన కలిగి, శరీరం వేగంగా విచ్ఛిన్నమవుతుంది. అదనంగా క్షీణించిన ఓజస్ వలన, తక్కువ సెక్స్ డ్రైవ్, నిద్రలేమి, పొడి చర్మం, వంగని కీళ్ళు, త్వరితగతిలో మసలితనం మరియు వ్యాధి పీడితుడవడం వంటవి కలుగుతాయి.

గాఢ నిద్ర ను మూలికా వైద్యం ద్వారా పొందటమెలా?
ఆయుర్వేదం లో, ప్రధానంగా పాలు కొన్ని మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో కలిసి క్షీణించిన ఓజస్ ను పునర్నిర్మించడానికి ఉపయోగించబడుతుంది.

కావలసిన పదార్ధములు;
1 కప్పు పాలు
1 టేబుల్ స్పూన్ తరిగిన ఖర్జూరాలు
2 టీ స్పూనులు తరిగిన బాదం
1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముద్ద లేదా కొబ్బరి కోరు
½ టీ స్పూను కుంకుమ పువ్వు
1-2 టీ స్పూన్ నెయ్యి
1/8 టీ స్పూన్ ఏలకులు
1 టీ స్పూన్ ముడి తేనె (buckwheat honey)

తయారు చేయు విధానం
పాలు అన్ని పదార్థాలు వేసి నెమ్మదిగా కాచండి. మీరు పాలతో Shatavari లేదా అశ్వగంధా 1/8 టీ స్పూను జోడించవచ్చు. పాలు, మూలికలు, మరియు సుగంధ ద్రవ్యాలు మరిగిన పిదప. మంటను ఆపి ముడి తేనెను జోడించండి.

ఓజస్ స్థాయిలు పెరగుటకు, నిద్ర పునర్నిర్మాణానికి 3 నెలలు ప్రతి రాత్రి ఈ వేడి పాలు ఒక కప్పు సేవించండి.

3. ఇది కేవలం మూడు పదార్థాలతో తయారు చేసే ఒక అద్భుతమైన ఔషదం. ఇది సాధారణంగా మరియు సులభంగా ఒక నిమిషంలో నిద్ర ఇస్తుంది.

కావలసిన పదార్ధములు;
1/8 టీస్పూను సముద్రపు ఉప్పు
¼ స్పూను. ముడి తేనె
1 టేబుల్ స్పూను కొబ్బరి నూనె

ఈ పదార్థాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవి మీ శరీరం మరియు మనసు కు విశ్రాంతిని ఇస్తుంది. రక్తం లోని, రాత్రంతా మేల్కొని ఉంచే కార్టిసాల్ (cortisol) స్థాయిని తగ్గిస్తుంది.

ఆదేశాలు మరియు వాడుక
గరిష్ట ఫలితాల కోసం రాత్రి పడుకునే ముందు ఈ పానీయం సేవించండి.

ఈ పానీయం రెండు విధాలుగా తీసుకోవచ్చును:
1. తేనె, కొబ్బరి నూనెకు చేర్చండి. సముద్ర ఉప్పు వేసి మరొకసారి వాటిని బాగా కలియ పెట్టండి. ఈ పేస్టు 1 టేబుల్ స్పూను తిని తరువాత ఒక గ్లాసు నీరు త్రాగండి.

2. ముందుగా తేనె తిని, అప్పుడు కొబ్బరి నూనెను త్రాగండి. గ్లాసు నీటి లో ఉప్పు వేసి కలియబెట్టి ఆ మిశ్రమం త్రాగండి.

అప్పటికీ మధ్య రాత్రి లో మేల్కువ వచ్చి నిద్ర పట్టనట్లయితే, మళ్ళీ ఈ పరిహారం పునరావృతం చేయండి, వెంటనే గాఢనిద్ర వస్తుంది.

మీకు గ్లైకోజెన్ లోపం ఉన్నట్లైతే, ఈ లోపం ఒత్తిడి కలుగ చేసి, అడ్రినలీన్ మరియు కార్టిసాల్ వంటి హార్మోన్ల ఉత్పత్తి కి దారితీస్తుంది, వీటి వలన నిద్ర సమస్యలు కలుగుతాయి. ఇది తీయని మిశ్రమమే, అయినప్పటికి, ఇది మీ రక్తంలో చక్కెర పెంచలేదు. మీరు కొన్ని నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది. ఈ మిశ్రమం మీ మెదడు కు తగినంత గ్లైకోజెన్ అందిస్తుంది.

కొబ్బరి నూనె మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది మరియు మీరు తదుపరి రోజు మేల్కొన్నప్పుడు మీకు చాలా ఆకలి వుండదు. రక్తంలో చక్కెర స్థాయి మొత్తం రాత్రి సమయంలో ఉధృతం కాదు. మధ్య రాత్రి లో మేల్కొనడానికి ఇది ఒక ప్రధాన సమస్య.
ఉప్పు మీకు శక్తిని ఇస్తుంది మరియు ఒత్తిడి కలుగజేసే హార్మోన్లను తగ్గిస్తుంది.

4. ఒక నిమిషం లో నిద్ర లోకి జారడానికి, నిద్ర సమస్య పరిహారించుటకు ఒక మంత్రదండము:
మీకు నిద్రలేమి సమస్యలు ఉంటే పాలు, తేనెలు మీకు అనువైనవి. ఇది నిద్ర కోసం వినియోగించే ఉత్తమ సాంప్రదాయ మందులలో ఒకటి. మీరు చేయవలసిందల్లా రాత్రి పడుకునే ముందు ఒక కప్పు సేవించండి, మీకు రాత్రి సమయంలో మంచి మరియు నాణ్యగల నిద్ర పడుతుంది.

తేనె మరియు పాలు రెండు, పురాతన కాలం నుంచి నిద్రలేమి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఈ సమస్య చికిత్సలో ఈ రెండిటిని విడి విడిగా ఉపయోగించవచ్చు, కానీ ఈ రెండిటి కలయక, వాటి శక్తిని రెట్టింపు చేస్తుంది.

పంచదార తీయని ఆహారము అయినప్పటికీ, తేనె నియంత్రిత రీతిలో ఇన్సులిన్ స్థాయిల పెరుగుదల కు కారణమై, మెదడులో ట్రిప్టోఫాన్ విడుదల ఉద్దీపన చేస్తుంది.

ట్రిప్టోఫాన్ సాధారణంగా సెరోటోనిన్ గా రూపాంతరం చెంది విశ్రాంతిని కలుగజేయడానికి కారణమవుతోంది. అదనంగా, సెరోటోనిన్, తిరిగి మెలటోనిన్ మార్పు చెంది మంచి నిద్రను అనుమతిస్తుంది.

కావలసినవి:
పాలు 6 ఔన్సులు
వెనిలా సారం 1 డ్రాపు
ముడి తేనె 1 టీ స్పూను

తయారీ:
చిన్న సాస్ పేన్లో పాలు పోసి నెమ్మదిగా కాచండి, నులివెచ్చగా మారాలి; ఇది మరిగే పాయింట్ (Boiling point) చేరుకోకూడదు.
వేడి నుండి తొలగించి, వెనిలా సారం మరియు తేనె జోడించి ఒక గ్లాసు లో పోయాలి. పదార్థాలన్నీ బాగా కలియబెట్టి, రాత్రి పడుకునే ముందు ఈ పానీయాన్ని త్రాగండి.

గమనిక: మీకు లాక్టోజ్ సరిపడకపోతే, పాలకు ప్రత్యామ్నాయంగా లాక్టోజ్ లేని సోయా, బియ్యం లేదా బాదం పాలు ఉపయోగించవచ్చును. తయారీ పద్ధతిలో మరే బేధము లేదు.

5. గసగసాలు, పటిక బెల్లం
గసగసాలు, పటిక బెల్లం మరియు పాలు నిద్ర సమస్యను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి,

కావలసినవి
½ టీస్పూను గసగసాలు,
½ టీస్పూను పటిక బెల్లం,
1 కప్పు పాలు

గసగసాలు వేయించి పొడి కొట్టండి. ఒక కప్పు పాలలో, అర టీస్పూను గసగసాల పొడి, మరియు అర టీస్పూను పటిక బెల్లం కలపాలి. ఈ పానీయం రాత్రి నిదురపోయేముందు తాగితే చక్కని నిద్ర వస్తుంది.

6. వెచ్చని పాలు మరియు ముడి తేనె
ముడి తేనె తో వెచ్చని పాలు (ముఖ్యంగా ఆవు మరియు మేక) ఒక గ్లాసు త్రాగించడం, చిన్న పిల్లల్లో నిద్ర లోపాల నివారణ కోసం పురాతన, ఇంకా సమర్థవంత సహజ నివారణలలో ఒకటి. పాలలోగల ట్రిప్టోఫేన్ మెదడులో ముఖ్యమైన సెరోటోనిన్ రసాయనాలను పెంపొందించి పిల్లలను నిద్రపోయేలా చేస్తాయి.

ముఖ్యమైన గమనిక: మీ శిశువుకు ఒక సంవత్సరం వయసు దాటే వరకు తేనె ఇవ్వరాదు.

ఎందుకంటే తేనె, చాలా తరచుగా, క్లాస్ట్రిడియమ్ బోట్యులినమ్ అనే సిద్ధబీజ బాక్టీరియం కలిగి ఉంది. ఇది శిశువులకు విషాహారం (విష పూరిత – botulism) యొక్క ఒక అరుదైన రూపం. మీ శిశువు విష పూరితమైతే, బిడ్డ తేనె తిన్న ఎనిమిది గంటల నుండి 36 గంటల లోపు లక్షణాలు చూపించడం మొదలు పెడతాయి. వెంటనే డాక్టరును సంప్రదించడం అతి ముఖ్యం అని తెలుసుకోండి. అంతేకాకుండా ఈ క్రిందనిచ్చిన లక్షణాలు కూడా కలుగవచ్చును;
మలబద్ధకం
విచారంగా ఉండటం
ఆకలి లేకపోవడం
కనుక ఒక సంవత్సరం లోపు శిశువులకు ఏ విధంగానూ తేనె ఇవ్వరాదని తెలుసుకోండి.


@ Subbarao Kasturi

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.