మలబద్ధకం గృహనివారణలు

0
741

మలబద్ధకం మీకు అసౌకర్యాన్ని అనుభవింపజేసి మరియు అదే సమయంలో, ప్రతికూలంగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య అజీర్ణం నుండి మీరు మీ ప్రేగు క్లియర్ చేయలేని పరిస్థితి వలన ఉద్భవిస్తుంది. మలం గట్టిపడి విసర్జన కష్టమవుతుంది, ఈ క్రమం లో బాధా, అసౌకర్యం ఉంటుంది, మరియు ఏ ఉత్పాదక ఫలితం లేకుండా బాత్రూంలో గంటలు గడుపుతారు. అశ్రద్ధ చేస్తే మలబద్ధకం ప్రాణాంతకం కావచ్చు. అది చాలా ప్రమాదకరం, హానికరమైన విషాన్ని ఆవరిస్తాయి.

దుకాణాల్లో దొరికే విరోచనకారులను నివారించండి అవి పరిస్థితిని హానికరం చేయవచ్చు. జీర్ణ వ్యవస్థలో నీరు లేకపోవడం లేదా తక్కువ నీటి గుణం వల్ల కలిగే ఒక సాధారణ సమస్య. కాబట్టి, మలబద్ధకం నివారించే మొదటి నియమం ఆర్ద్రీకరణ. కనుక తగినంత నీరు త్రాగడం అవసరం.


మలబద్దకం కారకాలు అనేకం, నిర్జలీకరణం, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారాలు, వ్యాయామం లేకపోవడం, మందుల సేవన వలన కలుగుతుంది. కొన్ని కారకాలుగా;
• హైపోథైరాయిడిజం,
• చాక్లెట్ (oh no!),
• మోతాదు మించిన భేదిమందు,
• చాలా పాల ఉత్పత్తులు,
• ఆహారంలో ఆకస్మిక మార్పు,
• యాంటిడిప్రేసన్ట్స్,
• డిప్రెషన్,
• పెద్దప్రేగు కాన్సర్,
• పెద్దప్రేగుల అమిత బిర్రు (over-tighten)
• నొప్పిని తగ్గించే మందులు మరియు స్టెరాయిడ్స్,
• నాడీ మరియు కండరాల సమస్యలు,
• చాలా యంటాసిడ్ మందులు (అదనపు కాల్షియం లేదా అల్యూమినియం కలిగినవి),
• రక్తపోటు మరియు అలెర్జీ మందులు,
• తాపజనక ప్రేగు వ్యాధి,
• ప్రసవం వలన స్థంబించిన ఉదర కండరాలు,
• డయాబెటిస్ మరియు నరాల వ్యాధులు,
• వృద్ధాప్యం

మలబద్ధక లక్షణాలు
కుదించబడిన, గట్టిబడిన మలం,
కష్టమైన లేదా బాధాకరమైన విసర్జన,
అధిక వాంతులు,
మూడు రోజుల వరకు ప్రేగు కదలికలు లేకుండుట,
మొలలు మరియు రక్తంతో కలిసిన ఆసన పగుళ్ళుఉండవచ్చు,
అప్పుడప్పుడు తడి, అతిసారం వంటి మలం విసర్జన,
చేతిని ఉపయోగించి పురీషనాళం నుండి మలం తొలగించచే అవసరం,
మల మార్గంలోనూ అవరోధం ఉందనే భావన,
ఉదర తిమ్మిరి,
అధిక అపానవాయువు విడుదల,
ఉబ్బరం,
ఆకలి లేకపోవడం,
గమనిక: మీకు 2 లేదా 3 నెలల కంటే ఎక్కువ ఈ సమస్యలు ఎదుర్కొంటూంటే, అప్పుడు మలబద్ధకం దీర్ఘకాలికాలికమైనదిగా భావిస్తారు.

మలబద్ధకం నిర్లక్ష్యం చేయడం వలన అనేక వ్యాధులు పెరగటానికి దోహదపడతాయి:
• కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదల,
• తలనొప్పి,
• చెడు శ్వాస,
• శరీర దుర్వాసన,
• మొలలు,
• అనారోగ్య సిరలు,
• పేగు / పురీషనాళం / చిల్లుపడే కాన్సర్,


1. పల్లేరు ఆకులు (Devil’s Thorn Leaves) + పాలు
పల్లేరు ఆకులు (శాస్త్రీయ నామం: Tribulus terrestris) మలబద్ధకం కోసం ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన వరం. ఈ మొక్క బహుళ ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. నిజానికి, ఈ మూలికలను విస్తృతంగా దేహదారుడ్యకులు (bodybuilders) భుజిస్తారు. ఆయుర్వేదం లో,దీనిని అనేక వ్యాధులు నయం చేయడం కోసం వాడుతున్నారు. ముఖ్యంగా, వాపు, కడుపునొప్పి ఎక్కువగా తగ్గిస్తుంది.
పాలు, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది, మీ ఎముకలను బలంగా ఉంచి మరియు మీకు కాల్షియం అనుబంధాలనిస్తుంది, పాలు మంచి రాత్రి నిద్రను ప్రోత్సహిస్తుంది. మరోవైపు, మలబద్ధకం శక్తిని తగ్గిస్తుంది. ఈ హెర్బ్ పాలతో కలిసి, ప్రేగుల కండరాల సంకోచాలను మెరుగుపరుస్తుంది.
• ఔన్స్ పల్లేరు ఆకులు తీసుకోండి, శుభ్రపరచి, మిక్సర్లో వాటిని నూరి రసం తీయండ
• ఒక గ్లాసు వెచ్చని పాలు తీసుకోండి.
• ఈ రెండిటిని బాగా కలపండి.
• రోజు విడిచి రోజు త్రాగండి.
• ఉత్తమ ఫలితాల కోసం ఒకటి లేదా రెండు వారాల పాటు ఈ ప్రక్రియ పునరావృతం చెయ్యండి.

ఇది ఎలా పని చేస్తుంది?
పల్లేరు ఆకులలో కొన్ని క్రియాశీల సమ్మేళనాలు, రెసిన్లు మరియు ఆల్కలాయిడ్స్, చక్కెరలు, టానిన్లు, ముఖ్యమైన నూనెలు, స్టెరాల్స్, బీజ శర్కరికము (diastase), గ్లూకోసైడ్ మరియు పెరాక్సిడేజ్ ఉండటం వలన మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిచడంలో సహాయపడుతుంది. మరోవైపు పాలు అన్ని అవసరమైన పోషకాలు కలిగి సహజంగా మలబద్ధకం చికిత్సలో సహాయ పడుతుంది. ఇది లాక్టోజ్, మంచి కొవ్వు, మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, మరియు ఇతర కీలక ఎంజైములు కలిగి ఉంటుంది.

పల్లేరు ఆకుల వినియోగం ఈ క్రింది పరిస్థితులలో మంచిది కాదు:
• లాక్టోజ్ అసహనంతో బాధపడతూండే వారికి,
• గర్భవతి తల్లి పాలిచ్చే సందర్భంలో,
• ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవారికి,
• డయాబెటిస్తో బాధపడే వారికి పల్లేరు ఆకులు బ్లడ్ షుగర్ స్థాయిలు పెంచే అవకాశముంది.
• శస్త్రచికిత్స చేయించుకున్న లేదా, చేయించుకోబోయే వారికి


2. వండిన గోంగూర ఆకులు (Kenaf)
సహజ నివారణలలో, (Kenaf ను శాస్త్రీయంగా Hibiscus Cannabinus అని పిలుస్తారు) గోంగూర ఆకులు మలబద్ధకం ఎదుర్కోవడంలో ఒక గొప్ప సహాయం చేసే అద్బుతమైన మొక్క. గోంగూర సహజ ప్రోటీన్లు, ఫాస్పరస్, మరియు కాల్షియంలకు ఒక గొప్ప మూలం. దీనిలో కేలరీలు చాలా తక్కువ. దీని విత్తనాలు థోరియం మరియు రేడియం లతో బలోపేతంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంపొందించి క్రమంగా స్పష్టమైన మల విసర్జన జరిగేలా చేస్తుంది.
కొన్ని తాజా గోంగూర ఆకులు తీసుకోండి, పూర్తిగా వాటిని కడగండి.
వాటిని ఉడికించి మరియు ఒక క్రమ పద్ధతిలో మీ భోజనంతో తినండి.
కొన్ని రోజుల పాటు ఈ పద్దతి అనుసరించండి మరియు తేడా చూడండి.

ఇది ఎలా పని చేస్తుంది?
గోంగూర ఆకులు కొన్ని ముఖ్యమైన పండ్ల ఆమ్లాలతో ఉంటాయి అందువలన ఒక సహజ భేదిమందులా పనిచేస్తాయి. పరిశోధకుల ప్రకారం, గోంగూర కొన్ని రసాయన సమ్మేళనాలు కలిగి కడుపు, గర్భాశయం, మరియు ప్రేగుల బిగింపు తగ్గించి, మల విసర్జనను సులభం చేస్తాయి. ఇంతే కాకుండా, సహజ యాంటిబయాటిక్స్ లా పనిచేసి పురుగులు మరియు బాక్టీరియాను నిర్మూలిస్తాయి.

గోంగూర ఆకుల (Kenaf) వినియోగం ఈ క్రింది పరిస్థితులో నిషేధం:
గర్భవతి లేదా తల్లి పాలిచ్చే సందర్భంలో. ఈ ఆకులు ప్రతికూల పిండ ప్రభావితం చేయవచ్చు.
తక్కువ రక్తపోటు ఉన్న వారికి.
డయాబెటిక్ ఉన్నవారికి. ఇది చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.
శస్త్రచికిత్స చేయించుకున్నా లేదా త్వరలోనే చేయించుకోబోతున్నా.


3. ఆలివ్ నూనె
ఈ ముఖ్యమైన నూనె పిత్తాశయంను బలోపేతం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మరియు పెద్దప్రేగుల ఆరోగ్యం నిర్ధారిస్తుంది. ఇది జీర్ణక్రియను ఉద్దీపన చేస్తుంది. మల విసర్జనను సులభతరం చేస్తుంది, మలబద్ధకం ఉపశమనమింప చేస్తుంది. ఆలివ్ నూనె తాజా నిమ్మరసం కలిపి త్రాగితే, జీర్ణంకాని అన్ని వ్యర్థాలు (పెద్దప్రేగు లో గల) మరియు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.
• ఒక టేబుల్ స్పూను ఆలివ్ నూనె ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి
• సేవనం మర్చిపోతే, మీరు కాసేపు వరకు ఏమీ తినకుండా వేచియుండండి.
• దాని రుచి తేలిక పరచడానికి ఒక టీస్పూన్ (ఐచ్ఛికంగా) నిమ్మరసం తో ఆలివ్ నూనె కలపాలి.

నిమ్మకాయ రసం కూడా మలబద్ధకం ఒక సహజ చికిత్సగా పనిచేస్తుంది.
ఇది మీ జీర్ణక్రియను ఉద్దీపన చేసి మరియు వ్యర్ధాలు కదిలిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే, అది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆలివ్ నూనె, కొవ్వులు, అసంతృప్త నూనెలను, ఇనుము, విటమిన్లు E, K, ఒమేగా 3, 6 కొవ్వు ఆమ్లాలు అలాగే అనామ్లజనకాలు కలిగినది. ప్రారంభ దశలో, గట్టిపడిన మలం వలన దెబ్బతిన్న పెద్దప్రేగుల శ్లేష్మ లైనింగ్ను బలపరుస్తుంది. ఇది , పిత్తాశయంను, ప్రేరేపించి పిత్తాన్ని విడుదల చేస్తుంది, మరియు కొవ్వులు జీర్ణాశయంలో జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇది కూడా పేగు కండరాలు సంకోచంలో సహాయపడి మరియు మలాన్ని మృదువు పరచి సులభంగా తొలగించుతుంది.

ఆలివ్ నూనె వినియోగం ఈ క్రింది పరిస్థితులలో మంచిది కాదు:
• డయాబెటిస్ ఉంటే. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు
• సర్జరీ ముందు, తర్వాత రెండు వారాలు, ఆలివ్ నూనె ఉపయోగించవద్దు.
• మీరు డయాబెటిస్ మందులు తీసుకొటూంటే, glyburide (DiaBeta, Glynase PresTab, Micronase), tolbutamide (Orinase) అలాగే ఇతరుల మందులు ఒకదానిపై ఒకటి పని చేయుట వలన కలుగు పరిణామములు ఏర్పడవచ్చను.
• మీరు తక్కువ రక్తపోటు ఉంటే చెక్కెర స్థాయిలు తక్కువ కావచ్చు. అటువంటి వాటిలో కొన్ని మందులు hydrochlorothiazide (HydroDIURIL), furosemide (Lasix).


4. ఆముదము
ఇది పసుపు రంగుతో ఉండే గొప్ప విరేచనకారి. ఆముదము వేగంగా మలబద్ధకం నివారించి, దాదాపు వెంటనే పనిచేస్తుంది. ఈ కారణంగా, ఆముదము జాగ్రత్తగా నిర్వహించాలి. అందువల్ల, నిద్రపోయె ముందు తీసుకోకూడదని సలహా. ఆముదము రుచి మంచిగా ఉండదు. అందువలన, చల్లబరచి (In Friz) ఆపై నారింజ రసం లేదా ఆ విధమైన తియ్యనివి కలిపి తీసుకోవచ్చును. సహజ ఆముదము ఉపయోగించండి.
• ఆముదము ఒక టేబుల్ స్పూను (పెద్దలకు ), ఒక టీస్పూన్ (పిల్లలకు) ఇవ్వండి.
• దాని చేదు రుచి తొలగించడానికి నారింజ రసం, అల్లం రసం, ఎండు ద్రాక్ష రసం, లేదా వాక్కాయ రసంతో కలుపవచ్చును.
• మూడు రోజులు కంటే ఎక్కువ తీసుకోరాదు. నిరంతరంగా తీసుకోరాదు.

ఆముదము లో 80% ricinoleic ఆమ్లాలును కలిగి ఉంది. ఈ కొవ్వు ఆమ్లం ప్రేగుల లోని నునుపైన కణాల మీద ఉన్న గ్రాహకాలను (receptors) కలుపుతుంది గ్రాహకముల పారస్పరికాలతో (interactions), ricinoleic యాసిడ్, శక్తివంతమైన సంకోచాలు కలిగిస్తుంది. ఆముదము యొక్క విరేచనకారి లక్షణాన్ని ఇలాగ వివరించవచ్చు. ఈ కారణాలు కాకుండా, ఆముదము చిన్న ప్రేగుల ద్రవ శోషణనను నిరోధిస్తుంది. అందువలన, ప్రేగులను తేమగా ఉంచి మల విసర్జనను సులభంగా బయటకు వెళ్ళేలాచేయగలదు. అందువలన, ఆముదము, మల విసర్జన విషయంలో కందెన (lubricant) వలె పనిచేస్తుంది.

ఆముదము వినియోగం ఈ క్రింది పరిస్థితులలో మంచిది కాదు:
• ఆముదము ఒక శక్తివంతమైన విరేచనకారి, దానిని జాగ్రత్తగా వినియోగించాలి. ఆముదము అతిసారానికి కారణమవుతుంది అందువలన మీకు మరుగుదొడ్ల లభ్యత దగ్గరగా ఉండాలి.
• గర్భవతులకు ఖచ్చితంగా ఒక వైద్యుని పర్యవేక్షణలో ఉపయోగం అమలు పర్చాలి.
• కడుపు నొప్పి, పిత్తాశయం సమస్యలు, పిత్త వాహికల లేదా ప్రేగు అడ్డంకులు కలిగి ఉంటే వినియోగం నిషిద్ధం.
• మూత్రవిసర్జన మందులు తీసుకున్నట్లయితే, దీని వాడకం శరీరంలో పొటాషియం స్థాయిలు క్రింద తగ్గి, దుష్ప్రభావాలు కలిగిస్తాయి.


5. సోపు గింజలు
ఏ విభ్రమ (hallucinogenic) లక్షణాలు లేనిది, alcohol absinthe, ప్రధాన భాగాలుగా కలిగినది. మలబద్ధకం విషయంలో, సోపు గింజలను తక్షణ ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. ఇది సులువుగా మలమును బయటకు పంపగలదు. సోపు గింజలు భోజనం తర్వాత వినియోగిస్తే బాగా పని చేస్తాయి. ఒక బోనస్గా ఇది నోటి నుండి చెడు శ్వాస ను తొలగిస్తుంది.

విధానం 1: సోపు గింజల నీరు
సోపు గింజల పొడి ఉపయోగం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఒక కప్పు సోపు గింజల పొడిని వేయించి వాటిని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చెయ్యండి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో సోపు గింజల పొడి ఒక స్పూన్ కలపండి. నిదురించే ముందు త్రాగండి.
గోరు వెచ్చని నీరు జీర్ణ వ్యవస్థ ప్రేరేపిస్తుంది అయితే సోపు, ఫైబర్ మంచి మొత్తంలో కలిగి ఉంది. ఫైబర్ కడుపు యొక్క సరైన కార్యాచరణకు చాలా ముఖ్యం.

విధానం 2: సోపు టీ
సోపుతో ఒక అద్భుతమైన ఔషధ టీ చేయవచ్చు.
• ఒక టీ స్పూను సోపు గింజలు తీసుకోండి, మరియు మెత్తగా నలగగొట్టండి.
• నలగొట్టే చర్య నూనెలు మరియు క్రియాశీల సమ్మేళనాలను ప్రేరేపిస్తుంది. తర్వాత, సోపు గింజలు పైగా తాజాగా మరగించిన నీరు పోయండి.
• పది పదిహేను నిమిషాలపాటు మరిగించండి. వడపోసి త్రాగండి.
సోపులో కనుగొన్న పలు ఆమ్లాలలో ఆస్పార్టిక్ యాసిడ్ ఒకటి, ఇది ant flatulent గా ప్రాచుర్యం పొందింది. దీనిలోని ఇతర ఔషధ కాంపౌండ్స్ anetol & cineole యాంటీ బాక్టీరియా మరియు క్రిమిసంహారాలను లక్షణాలు కలిగి ఉంటాయి. సోపు గింజలలో కనిపించే అమైనో ఆమ్లాలలోని హిస్టిడైన్ జీర్ణక్రియ మరియు జీర్ణ వాహిక యొక్క సరైన నిర్వహణ లో సహయం చేస్తాయి. 100 గ్రా సోపు గింజలలో 40 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంది, మరియు అద్భుతమైన ప్రతిక్షకారిని లక్షణాలను ప్రదర్శించే ఫ్లేవనాయిడ్స్ ను phytonutrients quercetin మరియు rutin అని పిలుస్తారు. ఇవి మంట తగ్గించడం కోసం, మరియు క్యాన్సర్ నివారణ కోసం వినియోగిస్తారు.

సోపు వినియోగం ఈ క్రింది పరిస్థితులలో మంచిది కాదు:
సోపు సాధారణంగా తాగడానికి సురక్షితమేనని భావిస్తారు. అయితే, ప్రతిదీ చాలా అతిగా తీసుకొవడం మంచిది కాదు. సోపు అదిక వినియోగం శ్వాస క్లిష్టత, దడ, వివిధ నాడీ సమస్యలు, మరియు అపక్రమ గుండె చప్పళ్లకు కారణమవుతుంది.


Subbarao Kasturi 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.