బొప్పాయి ఆకురసం

0
667

అద్భుతంగా ప్లేట్లెట్లను అభివృద్ధి పరచే  ఔషదం బొప్పాయి ఆకురసం..


పరిశోధనా అధ్యయనాలు, బొప్పాయిలోని ఫైటో పోషక (న్యూట్రియంట్) సమ్మేళనాలు రక్తప్రవాహంలో బలమైన ప్రతిక్షకారిని మరియు రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని ప్రదర్శిస్తాయని తెలిపాయి. పాపైన్, అల్కలాయిడ్స్ మరియు ఫినోలిక్ సమ్మేళనాలు వాటి అనుకూల జీవ ప్రభావాలకు బాధ్యత వహిస్తాయి. పపైన్ మరియు చైమపపైన్ (chymopapain) అనే ఎంజైములు బొప్పాయి యొక్క రెండు జీవసంబంధ క్రియాశీల భాగాలు. ప్రోటీన్ల జీర్ణక్రియ లో సహాయపడుతుంది మరియు అజీర్ణం, ఉబ్బరం మరియు ఇతర జీర్ణ రుగ్మతల చికిత్సకు విస్తృతంగా ఉపయోగిస్తారు. అదనంగా, ఆల్కలాయిడ్ సమ్మేళనాలు, కార్పైన్, సూడోకార్పైన్ మరియు డీహైడ్రోకార్పయిన్లు చెమో-నివారణ ప్రభావాలను ప్రదర్శిస్తాయి.

స్పాస్మోడిక్, అనాల్జేసిక్, మరియు బాక్టీరియల్ నివారణ లక్షణాల కారణంగా దీని లోని శుద్ధమైన వేరుచేయబడిన ఆల్కలాయిడ్స్ మరియు వాటి సింథటిక్ ఉత్పన్నాలు ప్రాథమిక ఔషధ కారకాలుగా ఉపయోగించబడతాయి. ఫినోలిక్ సమ్మేళనాలు, కాఫిక్ ఆమ్లం, క్లోరోజెనిక్ ఆమ్లం, క్వెర్సెటిన్ మరియు కెంప్ఫెరాల్ శక్తివంతమైన శక్తి ప్రతిక్షేపణ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఇనుము మరియు మాంగనీస్ వంటి ఖనిజాలలో బొప్పాయి ఆకులలో ఎక్కువగా ఉంటాయి.

బొప్పాయి ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ, కే, బి విటమిన్లు, బి 17 (క్యాన్సర్ చికిత్స కోసం వాడతారు) ఉన్నాయి. ప్లేట్లెట్ల సంఖ్య పెరగడానికి బొప్పాయి జ్యూస్ ఔషదంగా (డెంగ్యూ వంటి జ్వరాలు) పనిచేస్తుంది. ఉష్ణమండల దేశాల్లో, డెంగ్యూ జ్వరము చాలా సాధారణం. వ్యాధి సోకిన Aedes దోమలు ద్వారా ప్రసారం చేయబడుతున్న వైరస్ల వలన డెంగ్యూ సంభవిస్తుంది.

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి.

మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఏ రుగ్మత వలనైనా ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయి ఉంటే తత్ క్షణం లోప నివారణకు గుర్తుకు వచ్చేది బొప్పాయి ఆకురసం. దీనికి శీఘ్రంగా ప్లేట్లెట్స్ సంఖ్యను అభివృద్ధిపరచే శక్తి ఉంది పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేనిది. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే ఆహారాలలో ప్రప్రధానమైనది బొప్పాయి ఆకు రసం. దీని తరువాత ఈ క్రింది 9 ఉత్తమ ఆహారాలు పరిగణలోనికి వస్తాయి.

1. బీట్ రూట్: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో అధికంగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది.

3. బొప్పాయి: రక్త స్ధాయి తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి: శరీరంలో సహజంగా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఆదర్శవంతమైన పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్: ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8. ఎండు ద్రాక్ష: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను సహజంగా పెంచుతుంది.

9. ఖర్జూరం: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, సహజంగా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.


@ బొప్పాయి ఆకు రసం

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.