ఆస్తమా కోసం గృహ నివారణలు

0
891

ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస ఇబ్బందిని కలిగిస్తుంది. ఆస్తమా తీవ్రమైన లేదా దీర్ఘకాలికమైన వ్యాధిగా బాధించవచ్చు. ఊపిరితిత్తులలో గాలి కి అవరోధం కలిగినప్పుడు ఆస్తమా దాడులు జరుగుతాయి. ఈ వ్యాధి కలగడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ అలెర్జీలు, కొన్ని మందులు వాయు కాలుష్యం, శ్వాసకోశ అంటువ్యాధులు, భావోద్వేగాలు, వాతావరణ పరిస్థితులు, మరియు ఆహారాలలోని సల్ఫైట్ల ద్వారా రావొచ్చు. సాధారణ లక్షణాలుగా దగ్గు, శ్వాసలో గురక, ఛాతీ బిగుతు, మరియు శ్వాస ఆడకపోవుట ఉండవచ్చు.
పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారి పడుతున్నప్పటికీ, పెద్దలు మినహాయింపు కాదు. ఆస్త్మా వలన రోగనిరోధక వ్యవస్థ గణనీయంగా క్షీణిస్తుంది మరియు క్రమంగా శ్లేష్మం ఊటను ప్రేరేపిస్తుంది.

1. అల్లం
అల్లం ఆస్త్మాతో సహా వివిధ రోగాల కోసం ఒక ప్రసిద్ధ సహజ చికిత్స. పరిశోధకులు ఊపిరితిత్తులను చేర్చే గాలి మార్గం మంట తగ్గించేందుకు మరియు వాటి సంకోచం నిరోధించగలదనే విషయం కనుగొన్నారు. అధ్యయనాలు అదనంగా కొన్ని ఆస్తమా మందులు వలన కలిగే కండరాల సడలింపు ప్రభావాలను ఉపశమింప చేస్తుందని సూచిస్తున్నాయి.
• అల్లం రసం, దానిమ్మ రసం మరియు తేనె సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజువారి ఒక టేబుల్ స్పూను రెండు లేదా మూడు సార్లు వినియోగించండి.
• ప్రత్యామ్నాయంగా, ఒకటిన్నర కప్పుల నీటిలో ఒక టీ స్పూను మెత్తగా దంచిన అల్లం కలపండి. నిద్రపోయే వేళ వద్ద ఈ మిశ్రమం ఒక టేబుల్ స్పూను వినియోగించండి..
• ఒక అంగుళం అల్లం సన్నని ముక్కలుగా తరగండి. వేడి నీటిలో 5 నిముషాలపాటు మరగబెట్టండి. చల్లార్చి సేవించండి.
• మీ ఊపిరితిత్తుల హాని తొలగించుటకు, ఒక కప్పు లో నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు మరిగిచండి, దీనికి ఒక టీ స్పూన్ అల్లం రసం, మరియు ఒక టీ స్పూన్ తేనె కలపి మెంతులు కషాయాన్ని సిద్ధం చేయండి. ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఈ కషాయం త్రాగండి.
• ఉప్పు, ముడి అల్లం కూడా కలిపి తినవచ్చు.

2. ఆవనూనె
• ఆస్తమా ఎటాక్ కలిగినప్పుడు, ఆవనూనెతో మర్దనా చేయడం వలన శ్వాస మార్గం తెరవబడి, సాధారణ శ్వాస పునరుద్ధరించబడుతుంది.
• ఆవనూనెతో కర్పూరం కలిపి కొంచం వెచ్చబరచండి. మృదువుగా ఛాతీ పైన, వీపు పై భాగం మసాజ్ చెయ్యండి. ఈ పద్దతి రోజులో చాలా మార్లు చేయండి. ఆస్త్మా తగ్గేవరకు పునరావృతం చెయ్యండి.

3. అత్తి పండ్లు లేదా అంజీర్
• అత్తి పండ్ల లోని పోషక లక్షణాలు శ్వాస ఆరోగ్యాన్ని ప్రోత్సహించి మరియు కఫమును బయటకు పంపి మరియు శ్వాస ఇబ్బందులను తగ్గించే సహాయం అందిస్తుంది.
• రాత్రంతా శుభ్రంగా కడిగిన అంజీరాలు ఒక కప్పు లో నానబెట్టండి. ఉదయం సేవించండి.

4. వెల్లుల్లి
ఈ క్రింది వెల్లుల్లి పరిహారం ఆస్తమా యొక్క ప్రారంభ దశలలో ఊపిరితిత్తులలోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది.
• ఒక క్వార్టర్ కప్ పాలలో రెండు లేదా మూడు వెల్లుల్లి పాయలను మరిగించండి. అపై దానిని గది ఉష్ణోగ్రతకు చల్లబరచి, సేవించండి.
• 2 క్యారెట్ల తొక్క తీసి, శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చెయ్యండి. ఒక ఆపిల్ తొక్క తీసి, శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చెయ్యండి. ఒక వెల్లుల్లి తొక్క తీసి, పాయలు చేసి రెండు చివరలు కట్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చెయ్యండి. వీటిని మూడు కప్పుల నీటిలో మరిగించండి.చల్లార్చి నాలుగు టేబుల్ స్పూనులు ఉదయం, రాత్రి తీసుకోండి. ఐచ్ఛికంగా తేనె కలుపవచ్చును.

5. కాఫీ
సాధారణ కాఫీ లోని కెఫీన్ ఒక బ్రాంకోడిలేటరుగా పనిచేస్తుంది అందువలన ఆస్త్మా నియంత్రణలో సహాయపడుతుంది. వేడి కాఫీ శ్వాస మార్గానికి విశ్రాంతినిచ్చి మరియు సులభంగా వాయు ద్వారాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఎంత స్ట్రాంగ్ కాఫీ అయితే అంత మంచి ఫలితం లభిస్తుంది.
కానీ ఒక రోజు బ్లాక్ కాఫీ మూడు కప్పుల కంటే ఎక్కువ త్రాగవద్దు. మీకు కాఫీ నచ్చకపోతే, ఒక కప్పు వేడి బ్లాక్ టీ ఎంచుకోవచ్చు. అయితే సాధారణ చికిత్సగా కెఫిన్ తరచూ వాడకండి.

6. యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం
స్వచ్ఛమైన యూకలిప్టస్ ఆయిల్ పొర శోధమును నివారించు మందు ఎందుకంటే దాని decongestant లక్షణాలు ఉబ్బసమును ప్రభావవంతంగా చికిత్స చేస్తుంది. పరిశోధనలలో దీని లోని eucalyptol అనే ఒక రసాయనం శ్లేష్మమును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.
• రుమాలు మీద యూకలిప్టస్ నూనె కొన్ని చుక్కలు వేసి, నిద్రపోయే ముందు మీ తల వద్ద ఉంచండి, నిద్ర లో వాసన పీల్చుతారు కాబట్టి శ్వాస తేలికై ఉపశమనం దొరుకుతుంది.
• వేడినీటిలో యూకలిప్టస్ నూనె రెండు మూడు చుక్కల వేసి ఆవిరి పీల్చవచ్చు. వేగవంతమైన ఫలితాల కోసం లోతైన శ్వాసలు తీసుకోవాడానికి ప్రయత్నించండి.

7. తేనె
తేనె, ఉబ్బసాన్ని నివారించే పురాతన సహజ నివారణలలో ఒకటి. తేనె లోగల మధ్యం (alcohol) మరియు ఈథరు సంబంధైన నూనెలు (ethereal oils) ఆస్తమా లక్షణాలను తగ్గించవచ్చు.
• కేవలం తేనెను వాసన పీల్చడం కొందరికి సానుకూల ఫలితాలను అందిస్తుంది.
• ఒక గ్లాసు వేడి నీటికి ఒక టీ స్పూను తేనె కలపండి. రోజువారి నెమ్మదిగా చిన్న గుటకలతో మూడు సార్లు త్రాగండి.
• నిదురించే ముందు, సగం టీ స్పూను దాల్చిన పొడి, ఒక టీ స్పూను తేనెతో కలిపి సేవించండి. ఇది గొంతు నుండి కఫం తొలగించడానికి సహాయపడి మరియు మీకు చక్కని నిద్రనిస్తుంది.

8. ఉల్లిపాయలు
ఉల్లిపాయలు, ఆస్తమాతో బాధ పడేవారి వాయునాళాల సంకోచం తగ్గించడంలో సహాయపడుతుంది. తాప నివారక లక్షణాలు కలిగి, అలాగే ఉల్లిపాయల లోని గంధకం ఊపిరితిత్తుల మంట తగ్గుదలకు సహాయపడుతుంది.
• కేవలం సరైన శ్వాస కోసం, వాయు మార్గాలు శుభ్రపడుటకు ముడి ఉల్లిపాయలు తినండి. ముడి ఉల్లిపాయల రుచి భరించలేకపోతే, వండిన ఉల్లిపాయలు తినడానికి ప్రయత్నించండి.
• అర టేబుల్ స్పూను నీరుల్లి రసం, అర టేబుల్ స్పూను అల్లం రసం, 5 తులసి ఆకుల రసంతోగాని, లేదా ఒక టేబుల్ స్పూను ముడి తేనెతో గాని కలిపి రోజువారి ఉదయం, రాత్రి సేవంచడం వలన ఉబ్ససం నివారణౌతుంది.మధుమేహం గలవారు తేనె బదులు 5 తులసి ఆకుల రసంతో తీసుకోవాలి. ఉబ్ససం నివారింపబడేవరకు పునరావృతం చెయ్యండి.

9. నిమ్మకాయలు
ఆస్తమా బాధితులలో తరచుగా విటమిన్-C తక్కువ స్థాయిలో ఉంటుంది. నిమ్మకాయలలోని విటమిన్-C, రోగనిరోధక శక్తి మరియు దాని సమ్మేళనాలు మరియు అనామ్లజనకాలు ఆస్తమా లక్షణాలను తగ్గించవచ్చు.
• ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ రసం పిండి, మరియు మీ రుచి ప్రకారం కొంత చక్కెర జోడించండి. ఆస్తమా దాడులు తగ్గించడానికి క్రమం తప్పకుండా ఈ పానీయం పరగడుపున ఉదయం సేవించండి.
• కొంత అల్లం జోడించడం వలన అదనంగా పానీయం యొక్క శక్తి పెరుగుతుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మరియు శ్వాస మార్గాల విషయానికి వస్తే అది చక్కని పానీయం. ఇది ప్రాథమికంగా శ్వాస మార్గాల సంకోచాన్ని అణచివేయడంలో ఘనమైనది
• కమలా, బొప్పాయి, నేరేడు మరియు స్ట్రాబెర్రీలలో ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి సహాయపడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
గమనిక: సీసాలో నిలవ చేసిన నిమ్మ రసం ఉపయోగించవద్దు. ఆస్తమా దాడుల సందర్భంగా లక్షణాలు మరింత తీవ్రమైతే సిట్రస్ పండ్లు తీసుకోకూడదని గ్రహించండి.

10. వాము
వాము, ఊపిరితిత్తులలో శ్వాసనాళము వ్యాకోపించేలా చేయడం ద్వారా bronchodialator గా పనిచేసి, తేలికపాటి ఉబ్బసాన్ని చికిత్స చేస్తుంది
• కొంత నీటిలో ఒక టీ స్పూను వాము వేసి మరిగించి, ఆవిరి పీల్చవచ్చు, లేదా సేవించవచ్చు.
• ప్రత్యామ్నాయంగా, కొన్ని సెకన్ల పాటు మైక్రోవేవ్ లో, వాము గుడ్డలో చుట్టి, సౌకర్యవంతమైన వేడి చేయండి. వేడి ఉన్నప్పుడు, అది చల్లబడే వరకు మీ ఛాతీ మరియు మెడ మీద ఉంచండి. సంతృప్తి ఫలితాలు వచ్చే వరకు రోజూ పునరావృతం చేయండి.
• మరొక ఎంపికగా వాము మరియు బెల్లం పేస్ట్ వేడి చేసి, కొన్ని రోజుల పాటు లేదా ఉపశమనం పొందేవరకు రోజువారీ రెండుసార్లు ఈ పేస్ట్ ఒకటి లేదా రెండు టీస్పూన్లు తినండి.
గమనిక: ఈ ఔషధం మధుమేహ బాధితులకు సిఫార్సు చేయబడలేదు.

11. జింగో బిలోబా (Ginkgo Biloba)
జింగో బిలోబా ఉబ్బసం చికిత్స కు సహాయపడుతుంది. ఈ మూలిక ఊపితిత్తులకు చేరే వాయుమార్గంలో ఇన్ఫ్లమేటరీ కణాల చొరబాటు తగ్గించడానికి సహాయపడుతుంది మరియు ఊపితిత్తులకు చేరే వాయుమార్గంలో మంట తగ్గిస్తుంది. ఇది సప్లిమెంట్ రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంది.
మోతాదు కోసం మీ ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి.

12. నిమ్మ గడ్డి (Lemon grass)
ఉబ్బసం, దగ్గును మరియు ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్స కోసం సాంప్రదాయ మందుగా నిమ్మ గడ్డి విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు వాపు తగ్గించే అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అదనంగా, అది మీ రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగుపెడుతుంది విటమిన్-C కలిగి ఉంది.

13. మధుమాష్టికం (Licorice)
మధుమాష్టికం, ఉబ్బసం చికిత్సలో సహాయపడుతుంది. మధుమాష్టికం ఊపిరితిత్తులపై శోథ నిరోధక ప్రభావం కలిగి ఉంది. శ్వాసనాళాల గొట్టాల వాపు తగ్గించి, వాయు ద్వారాలకు ప్రశాంతత నిచ్చి మరియు సాధారణ శ్వాస పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అదనంగా, దీనికి రోగనిరోధక ఉద్దీపన లక్షణాలున్నాయి.
మోతాదు కోసం మీ ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి.

14. స్లిప్పరీ ఎల్మ్
ఈ మూలికకు తెలుగులో అనువాదం లేదు, హింధీలో चीरा बेल, हिन्रोय, मोड అంటారు. ఇది ఉబ్బసం నివారణకు మరొక సమర్థవంతమైన హెర్బ్. ఇది వాయు ద్వారాలను అడ్డగించే శ్లేష్మమును పలచన చేసే వ్యతిరేక నిరోధక గుణాలను కలిగి ఉంది. ఇది కూడా దగ్గు మరియు ఛాతీ బిగుతుల నుండి ఉపశమనం అందిస్తుంది.
మోతాదు కోసం మీ ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి.

15. ఉసిరి పొడి
ఒక టీ స్పూను ఎండిన ఉసిరి పొడితో, ఒక టీ స్పూను ముడి తేనె కలిపి రోజువారి ఉదయం సేవించండి.
అదనపు చిట్కాలు
• మీ ఆస్త్మా ట్రిగ్గర్స్, ప్రతికూలతల ప్రకోపం, గాలిలో కాలుష్య కారకాలు, మరియు శ్వాసకోశ అంటువ్యాధులు వంటివి గుర్తించి వాటిని నివారించేందుకు ప్రయత్నించండి.
• రోజ్మేరీ, వాము, అల్లం, పసుపు వంటి మూలికలు వంటల్లో భాగం చేయ్యండి.
• సాల్మొన్, క్యాడ్, మ్యకరెల్ వంటి చేపలను కనీసం వారం లో రెండు సార్లు తీసుకోండి.మీ వైద్యుని సంప్రదించి ఒమేగా 3 పదార్ధాలు తీసుకోండి.
• మీ ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు చేర్చండి. మెగ్నీషియం, సెలీనియం బీటా-కెరోటిన్, విటమిన్లు C మరియు E వంటి పోషకాలు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
• కృత్రిమ ఆహార సంకలనాలు మరియు నిలవ చేయడానికి ఉపయోగించే పదార్ధాలుగల ఆహారాలు, ప్రాసెస్ మరియు ప్యాకేజీ ఆహారములు తినడం మానుకోండి. ఈ రసాయనాలు ఆస్తమా దాడులను కలిగించగలదు.
• పాలు ప్రోటీన్లతో అసహనం లేదా పడని కారణంగా, లాక్టేస్ లోపం ఉంటే లాక్టోస్ పాలు మరియు పాల ఉత్పత్తుల తీసుకోవడం పరిమితం చేయాలి. అయితే, ఈ సమస్యలు లేకుంటే వారికి, మొత్తం పాల కొవ్వులు ఉబ్బసం లక్షణాలను నివారించే ప్రభావం కలిగి ఉంటాయి, పాలు ఇవ్వవచ్చు.


Subbarao Kasturi

Source: TOP10 Homeremedies

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.