అలెర్జీని నివారించే 10 ఉత్తమమైన ఆహారాలు

0
1053

మనలో కొందరు కొన్ని రకాల అలెర్జీ కలిగి ఉండవచ్చు. ఈ అలెర్జీలలో కొన్ని;
డ్రగ్ అలర్జీ– ఉపయోగించిన మందుల వలన రోగనిరోధక వ్యవస్థ పై అసాధారణ చర్య కలుగవచ్చును;
ఆహార అలెర్జీలు – ఒక నిర్దిష్ట ఆహారం తిన్న తరువాత, నిరుత్సాహపరచే లేదా ప్రమాదకరమైన ప్రతిస్పందనలు రోగనిరోధక వ్యవస్థ పై కలుగవచ్చును,
చర్మశోథ -చర్మముమీద జంతు పదార్దములు, తదితర పదార్దములు పడినందు వలన చర్మ శోధము కలుగవచ్చును,
పాల అలెర్జీ – సహజ పాలలో కనిపించే కొన్ని ప్రోటీన్ల వలన కలుగుతుంది,
అలెర్జీ ఆస్తమా – ఒక నిర్దిష్ట పదార్ధం సంబంధం వలన కలిగే ప్రతిచర్య, స్కిన్ రాష్ ఆస్తమా అలెర్జీ రావొచ్చును,
సీజనల్ అలెర్జీలు– అలెర్జీ ప్రతిస్పందన వలన దురద, నీరుకారే కళ్ళు, తుమ్ములు మరియు ఇతర సారూప్య లక్షణాలు కలువచ్చును,
జంతు అలెర్జీ– జంతువు యొక్క చర్మం కణాలు, లాలాజలం లేదా మూత్రం, అనాఫిలాక్సిస్ సంబందిత లక్షణములు కలుగుతాయి,
బీజాంశ అలెర్జీ– కీటకముల గుడ్లు, మలము వలన అసామాన్యమైన వ్యాధినిరోధక ప్రతిచర్య కలుగవచ్చును.


పెంపుడు జంతువుల తలలోని చర్మ పొరలు, పుప్పొడి లేదా కీటకాల విషం శరీరాన్ని తాకడం, లేదా లోనికి ప్రవేశించడం ద్వారా తీవ్రసున్నితత్వ వ్యాధినిరోధక ప్రతి స్పందనలు ఎర్పడతాయి, వాటిని అలర్జీ అని వ్యవహరిస్తారు. ఏ పదార్థం వలన అలర్జీ ప్రతిచర్యకు కారణమవుతుందో ఆ పదార్ధానిని “అలెర్జీన్” అంటారు. ప్రతికూలతలు కలిగించే ఇటువంటి పదార్థాలు; ఆహారాలలో, పానీయాలలో లేదా వాతావరణంలో ఉండవచ్చు.

అలెర్జీలన్నీ జన్యు సంబంధమైనవా?
అలెర్జీలు జన్యువులు ద్వారా తరాలకు చేయబడుతుంది. ఇది తరచుగా వంశానుగతంగా సంక్రమిస్తుంది. అయితే, కేవలం మీకు, మీ భాగస్వామికి లేదా మీ పిల్లలలో ఒకరికి అలెర్జీలు ఉన్నంతమాత్రాన, మీ పిల్లలందరు ఖచ్చితంగా వాటిని పొందుతారనే అవకాశం లేదు.

అలెర్జీ ప్రతిచర్య కడుపు లోని చర్మం లైనింగ్, ముక్కు, ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ నాళములు, చెవులను ప్రభావితం చేయవచ్చు. ఇది కారుతున్న ముక్కు , తుమ్ము, దురద, నీరు కారే కళ్ళు, కళ్ళ ఎరుపు, శ్వాసలో గురక, దద్దుర్లు, పొరలుగా ఉండే చర్మం, చర్మం దద్దుర్లు, మరియు శ్వాస ఆడకపోవుట, వాపు లేదా ఉబ్బసం వివిధ లక్షణములకు కారణమవుతుంది. ఈ లక్షణములు అలెర్జిన్ మీద ఆధారపడి చిన్నగా మొదలుకుని తీవ్రం కావచ్చు.

బాధించే మరియు సమస్యాత్మకమైన లక్షణాలు గల అలెర్జీలను నివారించడానికి అనేక చికిత్స మార్గాలు ఉన్నాయి. మీకు అలెర్జీలు సంభవించే అవకాశం ఉంటే, మీరు మీ ఆహారంలో కొన్ని వ్యతిరేక అలెర్జీ ఉత్తమ ఆహారాలు నిరోధించడానికి అలాగే సమస్యను పరిష్కరించేందుకు చేర్చవచ్చు.


1. యాపిల్స్
రోజుకు ఒక ఆపిల్ సేవనం ద్వారా మీ రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచవచ్చును మరియు అలెర్జీలను దూరంగా ఉంచవచ్చును. యాపిల్స్ లోని క్వెర్సటిన్ (quercetin), అలెర్జీ ప్రతిచర్యలను సమర్థవంతంగా నిరోధించగలదు. క్వెర్సటిన్ (Quercetin) మీ శరీరంలో అదనపు హిస్టామిన్ ను క్రమంగా విడుదల చేసి, మాస్ట్ సెల్స్ మరియు బాసోఫిల్స్ యొక్క కణత్వచమును స్థిరీకరిస్తుంది.
రోజూ ఒక ఆపిల్ తీసుకోండి, కానీ సహజసిద్ధంగా పెరిగిన ఆపిల్ తినడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. సాదా ఆపిల్ అల్పాహారం వలె తినడానికి, లేదా వోట్మీల్ లో వాటి ముక్కలు కలిపి లేదా సలాడ్ గా తీసుకొనవచ్చును. ఒక గ్లాసు ఆపిల్ రసం సేవనం కూడా ఆరోగ్యకరమైన మంచి ఎంపిక అవుతుంది.

2. పసుపు
పసుపు అలెర్జీలు నిరోధించడానికి ఒక శక్తివంతమైన ఆయుధం. ఇది సక్రియాత్మక పదార్ధం కర్క్యమిన్ (curcumin) కలిగి, అలెర్జీలతో పోరాడటానికి సహాయపడే ఒక శక్తివంతమైన ప్రతిక్షకారిని మరియు శోథ నిరోధక సమ్మేళనం కలిగి. అదనంగా, అది అనేక అలెర్జీ ప్రతిచర్యల లక్షణాల నుండి ఉపశమనానికి ఒక పొర శోధమును నివారించు మందు (decongestant) గా పనిచేస్తుంది.
ఒక గ్లాసు వేడి పాలలో 1 టీస్పూన్ పసుపు పొడి కలపండి మరియు రోజువారీ ఒకసారి త్రాగాలి. మీ వంటలలో, పసుపు ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ మందులు వైద్యుని సంప్రదించిన తరువాత గానీ తీసుకోరాదు.
గమనిక – పసుపు అధిక వినియోగం వలన పిత్తాశయం నొప్పి ఏర్పడగలదు. మరియు మూత్రపిండాల్లో రాళ్ల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు గలవారు రోజువారి 40 – 50 మి.గ్రా మించి పసుపు వినియోగించ రాదు. అన్య వ్యక్తులకు పసుపు రోజువారి 8 గ్రా మించరాదు. ఈ మందులు వినియోగిస్తున్నప్పుడు పసుపు తీసుకొనటం మానివేయుట ఉత్తమం.

3. వెల్లుల్లి
వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చండి. ఇది మరొక వ్యతిరేక అలెర్జీ ఉత్తమ ఆహారం. శరీరంలో అలెర్జీని బలపరచే కాంపౌండ్స్ కు కారకములయే కొన్ని ఎంజైముల ఉత్పత్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే అలెర్జీ ప్రతిచర్యలను నిరోధించడంలో సామర్థ్యం గల ఔషదం. అదనంగా, వెల్లుల్లి శోథ నిరోధక, యాంటీబయాటిక్, ప్రతిక్షకారిని మరియు దీని రోగనిరోధక- లక్షణాలు అలెర్జీ సీజన్లో, అలెర్జీలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

అలెర్జీలతో పోరాడేందుకు రోజూ రెండు నూరిన ముడి వెల్లుల్లి పాయలు తినండి. మీరు వైద్యుని సంప్రదించిన తరువాత వెల్లుల్లి ప్రత్యమ్నాయ మందులు తీసుకోనవచ్చు.

4. నిమ్మకాయలు
నిమ్మకాయలు అలెర్జీలు నిరోధించే ఒక అద్భుతమైన రోగనిరోధక ఫలం. ఇది విటమిన్ C మరియు అనామ్లజనకాలు కలిగి ఉంది. ఇది కూడా ఒక విష నిరోధకారిగా పనిచేస్తుంది మరియు మీ శరీరం ఆల్కలీన్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

మీ శరీరం నిర్విషీకరణకు మరియు మాలిన్యాలు తొలగించుటకు రోజంతా నిమ్మరం కలిపిన నీరు త్రాగండి. మరొక ఎంపికగా ఆలివ్ నూనె తో ఒక నిమ్మకాయ రసం కలపి సలాడ్లు మరియు సాండ్విచ్లు డ్రెస్సింగ్ చేసి ఆరోగ్యకరంగా భుజించవచ్చును .

5. సాల్మన్
సాల్మన్ మంచి నీటి చేప, ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు, DHA (DocosaHexaenoic Acid) మరియు EPA (EicosaPentaenoic Acid) ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ అధిక కొవ్వు ఆమ్లాలు చాలా మంచిగా మంటను, వాపును నిరోధించే సామర్ధ్యం కలిగి ఉంది. అందువలన అలెర్జీల ఉధృతిని ఉపశమనం చేయడంలో సహాయం చేస్తుంది. అలాగే, సాల్మన్ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచి ఆస్తమా, రద్దీ (congestion) మరియు జలుబు వంటి అలెర్జీ లక్షణాలు తీవ్రత తగ్గించడంలో సహాయం చేస్తుంది.
ఏడాది పొడవునా ప్రతి వారం కనీసం రెండు భాగాల సాల్మన్ తీసుకొనండి, అలెర్జీ సీజన్లో మూడు భాగాల కు పెంచండి. సాల్మన్ తో పాటు, మీ ఆహారం లో మేక్రెల్ (mackerel), ట్రౌట్ (trout), హెర్రింగ్ (herring) మరియు సార్డైన్ (sardines) చేర్చవచ్చు.

6. గ్రీన్ టీ
అలెర్జీ బాధితులు వారి రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి మరియు అలెర్జీ ప్రతిస్పందనలు నిరోధించడానికి వారి ఆహారంలో గ్రీన్ టీ జతచేయాలి. 2002 అధ్యయనం లో, Fukuok Kyushu యూనివర్శిటీ పరిశోధకులు గ్రీన్ టీ లో methylated epigallocatechin gallate (EGCG) అని పిలిచే ఒక సమ్మేళనం అలెర్జీ నివారించడంలో కీలకపాత్రని నిర్ధారించారు. గ్రీన్ టీ ప్రతిక్షకారిని, శోథ నిరోధక మరియు వ్యతిరేక హిస్టామిన్ లక్షణాలతో ఉంది.
రోజూ 2 కప్పుల గ్రీన్ టీ త్రాగండి. ఈ టీని మరింత సమర్ధవంతంగా చేయడానికి కొంత తేనె మరియు నిమ్మరసం జోడించండి.

7. చిలగడ దుంపలు
చిలగడ దుంపలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ B6 తోపాటు, అధిక బీటా-కెరోటిన్ ఉంది; మరియు శరీరంలో వాపు, మంటను (inflammation) నివారించే సహాయం చేస్తుంది. అదనంగా, విటమిన్ C కలిగి, రోగనిరోధక వ్యవస్థ బలపరచి, హిస్టామిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. వేరులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణములను కలిగిన ప్రోటీన్లు ఉన్న ఏకైక దుంప.
• మీ రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడడానికి మరియు అలెర్జీలు నిరోధించడానికి రోజూ, ఉడికించిన, వేయించిన లేదా కాల్చిన తీపి చిలగడ దుంపలు 1/2 కప్పు తీసుకోండి.

8. అల్లం
అల్లం, శోథ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణములను కలిగిన మరొక శక్తివంతమైన వ్యతిరేక అలెర్జీ ఆహారం. నిజానికి, ఇది నొప్పి, వాపు, మంట ఆపటంలో యాంటిహిస్టామైన్ మందులు కంటే మెరుగైన పనిచేస్తుంది.
అదనంగా, అది వాయు నాళముల సంకోచం నిరోధించగలదు మరియు శ్లేష్మం ఊటను ఉద్దీపన చేసి, ఆస్తమా లక్షణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
• రోజూ 2 కప్పుల అల్లం టీ త్రాగండి. మీ రోజువారీ ఆహారంలోను, మరియు పానీయాలకు అల్లం ముక్కలు జోడించి మంచి ఆరోగ్యాన్ని పొందండి. మీరు అల్లం ప్రత్యమ్నాయ మందులు వినియోగింప దలిస్తే, మొదటగా మీ వైద్యునితో సంప్రదింపులు అత్యవసరమని గమనించాలి.

9. కొల్లార్డు గ్రీన్స్ (తెలుగులో ఈ పదమునకు తర్జుమా లేదు)
కొల్లార్డు ఆకుకూరలు క్రమబద్ధమైన వినియోగం అలెర్జీ సీజన్లో అలెర్జీ ప్రతిచర్యలు నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ కూరగాయల కెరోటినాయిడ్ అని ఫైటోకెమికల్స్ కలిగి అలెర్జీ ప్రతిచర్యలు నిర్ములించగలవు.
అదనంగా, కొల్లార్డు ఆకుకూరలు మీ రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి సహాయపడే ఇతర ముఖ్యమైన పోషకాలు పాటు విటమిన్ C కూడా ఉంది. అధిక కెరోటినాయిడ్ స్థాయిలు కలిగిన ముదురు రంగు కొల్లార్డు ఆకుకూరలు కొనండి. పూర్తిగా వ్యతిరేక అలెర్జీ ప్రయోజనాలు పొందుటకు, ఆలివ్ నూనె వంటి మంచి నాణ్యతగల కొవ్వు మూలాలతో తేలికగా వాటిని ఉడికించాలి.
హెచ్చరిక: కొల్లార్డు ఆకుకూరలు, అధికంగా విటమిన్ K కలిగి ఉండడం వలన, రక్తాన్ని పలచబరిచే మందులు వినియోగించే వారు, కొల్లార్డు ఆకుకూరలను తినరాదని గమనించాలి.

10. అవిసె గింజలు
సెలీనియం మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉన్న అవిసె గింజలు, అలెర్జీ ప్రతిచర్యలు నిరోధించడానికి సహాయపడుతుంది. కొవ్వు ఆమ్లాలు శరీరంలో తాపజనక రసాయనాలు తగ్గించడం ద్వారా అలెర్జీలు నిరోధించడంలో సహాయపడతాయి. అదనంగా, అది రోగనిరోధక వ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరించుతుంది, మరియు దీనిలో అనామ్లజనకాల చర్య పెంచే సెలీనియం ఉంది.
ఒక గ్లాసు వెచ్చని నీటికి లేదా పాలకు, 1 టేబల్ స్పూను దంచిపొడి చేసిన అవిశ గింజలను జోడించి, రోజువారీ ఒకసారి త్రాగండి. వండిన కాయధాన్యాలు, సలాడ్లు, పెరుగు మరియు ఇతర వంటలలో కూడా కొన్ని దంచిపొడి చేసిన అవిశ గింజలను చల్లవచ్చును.

హెచ్చరిక: సాధారణంగా, ఇవి ఉత్తమ వ్యతిరేక అలెర్జీ సూపర్ ఆహారాలు. అయితే, మీకు ఇక్కడ పేర్కొన్న ఆహారాల వలన ఏ అలెర్జీ అయినాకలిగిస్తే, అవి మీ శరీర తత్వానికి సరి పడలేదని గ్రహించి వాటిని నివారించాలని గమనించడం అతి ముఖ్యం.
అదనపు చిట్కాలు

• దేని వలన ప్రతికూలతల ప్రభావం కలుగుతూందో తెలుసుకొని ఒక డైరీ లో వ్రాసే అలవాటు పాటించండి.
• వెచ్చని, పొడిగా ఉదయం ఉన్న 5 – 10 గంటల మధ్య బయట తిరగడం పరిమితం చేయండి. ఈ సమయంలో పుప్పొడి రేణువులు అత్యధికంగా ఉంటాయి.
• బయట తిరిగి వచ్చిన తర్వాత మీ ముఖం మరియు చేతులు పుప్పొడి తొలగించడానికి శుభ్రం చెయ్యండి.
• నిద్ర పోయే ముందు రోజువారీ మీ జుట్టును శుభ్రపరచడానికి స్నానం చేయండి.
• పెంపుడు జంతువులు మరియు ఆరుబయట సమయం ఎక్కువగా గడిపే వ్యక్తులతో పరిచయం తగ్గించుకోండి.
• మీ కళ్ళను పుప్పొడిబారి నుండి రక్షించుటకు సన్ గ్లాసెస్ లేదా ముఖానికి ముసుగు ధరించండి.
• పుప్పొడి తగ్గించుకొనుటకు, మీ పాదరక్షలు ఇంటిలోనికి తేవద్దు, బయట తలుపుల వద్ద వదలండి.
• అలెర్జీ సీజన్లో, కిటికీలు, వెంటిలేటర్లు మూసి ఉంచండి.
• క్రమం తప్పకుండా మీ ఎయిర్ కండీషనర్ లో filters మార్చండి.
• మీ ఇంటిలో తేమ స్థాయిని సర్దుబాటు చేసుకొనే హ్యుమిడిఫైయ్యర్ ఉపయోగించండి.
• ఆర్ద్రత తక్కువగా, మితమైన ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశాల్లో సంచరించడం నివారించండి.
• అలెర్జీ సీజన్లో తాజాగా గడ్డి కోసే ప్రదేశంలో బహిరంగంగా కూర్చొవడం మానుకోండి.
• బట్టలు బయట కంటే మిషన్లో ఆరబెట్టండి, దీనివలన పుప్పొడి బట్టలకు అతకదు.


Subbarao Kasturi

Source: TOP10 Home Remedies

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.