ఉల్లి మేలు తల్లి మేలు

0
676

ఉల్లి మేలు తల్లి మేలని (Onion is like good mother) ఆయుర్వేదం భావిస్తుంది.

ఉల్లిపాయలలో ఔషధ ప్రయోజనాలు అద్భుతమైన శ్రేణిలో ఉంటాయి మరియు విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం, బోయోటిన్ (biotin), క్రోమియం మరియు కాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు ట్రైగ్లిజరైడ్స్, రక్తం గడ్డకట్టకుండా చేసే శక్తి, ఆస్తమా, సైనస్ ఇన్ఫెక్షన్లు, బ్రోన్కైటిస్, అథెరోస్క్లెరోసిస్ (atherosclerosis) మరియు డయాబెటీస్లను నివారించడానికి సహాయపడే ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన క్వెర్సిటిన్ కలిగిన ఉల్లిపాయలు అత్యంత ఉన్నతమైన ఆహార మూలం. ఉల్లిపాయలు శరీరంలోని కణితి పెరుగుదలని నెమ్మదిగా మరియు రివర్స్ చేయడానికి సహాయపడే శక్తివంతమైన క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కూడా ఉంటాయి.

ఉల్లిపాయలు ముఖ్యంగా ఉదరము, పెద్దప్రేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రాశయం మరియు అండాశయ క్యాన్సర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి గణనీయంగా రోగనిరోధక వ్యవస్థ, మెదడు, మరియు నాడీ వ్యవస్థ బలోపేతం చేసే విలువైన సల్ఫర్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి. ఈ సల్ఫర్ సమ్మేళనాలు కూడా హెవీ మెటల్ నిర్విషీకరణ కారిగా పనిచేస్తాయి మరియు ప్రధానంగా పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్లను శరీరం నుంచి సురక్షితంగా తొలగించటానికి సహాయపడతాయి. ఉల్లిపాయలు జలుబు, దగ్గు, బ్యాక్టీరియల్ అంటువ్యాధులు, ఆంజినా (angina), మరియు శ్వాసనాళాల శోథల చికిత్సకు సహాయపడతాయి.

క్యాన్సర్ కణ పెరుగుదలను నిరోధిస్తుంది: ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలతో పూర్తిగా నిండి ఉంటాయి, కంతులు మరియు వివిధ క్యాన్సర్ల నుండి శరీరాన్ని రక్షించగలదు. ఉల్లిపాయ మూత్ర నాళంలో బాక్టీరియాతో పోరాడుతుంది.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: పచ్చి ఉల్లిపాయలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువలన డయాబెటిక్ రోగగ్రస్తులు (diabetic patients) పచ్చి ఉల్లిపాయలు తినడానికి సలహా ఇస్తారు. రోజువారి 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు తినాలి. 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు 20 గ్రా ఇన్సులీన్ తో సమానం. 7 రోజులు క్రమం తప్పకుండా తింటే హై బ్లడ్ షుగర్ నియంత్రణ అవుతుంది. 50 గ్రా ఒకేసారి తినలేకపోతే రోజు మొత్తం మీద తినవచ్చు. లేదా 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు, పచ్ఛి పులుసుగా తినవచ్చు.

గుండెను కాపాడుతుంది: ఉల్లిపాయ గుండె వ్యాధి (Coronary disease) నుండి రక్షించగలదు. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. రోజువారి 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు మెత్తగా గుజ్జుగా దంచి, తినాలి.
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది: చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

ఉబ్బసం, అలెర్జీ, దగ్గు, నిద్ర లేమి, ఇన్ఫెక్షన్, మరియు స్థూలకాయం: రోజువారి 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు ఏదో రూపంలో తినాలి. వర్షా కాలంలో పాదాలు ఇన్ఫెక్షన్కు గురై దురద పెడుతూంటే ఉల్లి గుజ్జును రాస్తే ఉపశమనం కలుగుతుంది.

ఉబ్బసం: ఉల్లి పాయలుశ్వాస నాళాల సంకోచాన్ని నివారించడంలో సహాయడతాయి. శుభ్రమైన వస్త్రంలో మెత్తగా దంచిన ఉల్లి పాయలను మూటగట్టి ఛాతి మీద ఉంచితే శ్వాస తీసుకోవడం సలభమవుతుంది.

మూత్రంలో మంట: పచ్ఛి ఉల్లి పాయలు సన్నని ముక్కలు చేసి నీటితో మరిగించి త్రాగితే మూత్రంలో మంట నివారణౌతుంది.

మలబద్ధకాన్నినివారిస్తుంది: ఉల్లిపాయలోని పీచు పదార్ధము మలబద్ధక నివారణకు సహాయపడుతుంది. ఈ పీచు పదార్ధము ప్రేగుల నుండి విషాన్ని తొలగిస్తుంది.

ఋతు క్రమ, వీర్య కణ సమస్యలు: రోజువారి 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు ఏదో రూపంలో తినాలి. ఋతు క్రమ సమస్యల నివారణకు, ఋతుచక్ర ఆరంభానికి రెండు నుంచి మూడు రోజులు ముందు తాజా ఉల్లిపాయలను ఉపయోగించడం ప్రారంభించండి మరియు ఫలితాలను చూడండి!

వికారం: రెండు టీస్పూన్లు తాజా ఉల్లిపాయ రసం తదుపరి ఒక కప్పు టీ త్రాగటం వలన వాంతులు ఆపడంలో సహాయపడుతుంది.

కాలిన గాయాలు, దోమ, కీటకాల కాట్లు: పచ్ఛి ఉల్లి పాయలు కోసి, ఆ ప్రదేశంలో రుద్దాలి. ఇలా చేస్తే, శరీరం నుండి విషం బయటకు వచ్చి, నొప్పి మరియు వాపులు నిమిషాల్లో తొలగిపోతాయి. సంక్రమణ (Infection) ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు అలాగే మచ్చలను నిరోధిస్తుంది.

నీళ్ళ విరోచనాలు, వాంతులు: రోజువారి 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు మెత్తగా గుజ్జుగా దంచి, పావు టీస్పూను తినాలి.

గొంతునొప్పి, జలుబు నివారణ: ఉల్లిపాయ రసం సాంప్రదాయకంగా జలుబు మరియు గొంతునొప్పికి వ్యతిరేకంగా గొప్ప ఫలితాలతో శీఘ్ర ఉపశమనానికి ఉపయోగించబడుతుంది.
ప్రత్యామ్నాయంగా, ఒక ఉల్లిపాయ టీ తయారుచేసుకొని త్రాగవచ్చు లేదా నీటిలో ఉల్లిపాయ ముక్కలు మరిగించి, ఈ పానీయంతో రెండు నుంచి మూడు సార్లు పుక్కిట (Gurgle) పట్టండి.

ముక్కు నుంచి, పంటినుండి రక్తం కారుట: తాజాగా కోసిమ ఉల్లిపాయ ముక్కను వాసన పీల్చడం, లేదా ఉల్లి రసం మాడుకు రాసినా ముక్కు నుంచి కారే రక్తమును ఆపవచ్చును. ఉల్లి పాయ, ఉప్పు కలిపి నూరి పంటి మీద రుద్దితే పంటినుండి కారే రక్తం ఆగుతుంది.

జీర్ణాశయ సమస్యలు: 50 గ్రా పచ్ఛి ఉల్లి పాయలు మెత్తగా గుజ్జుగా దంచి, 3 టేబుల్ స్పూనుల వెనిగర్ జోడించి సేవిస్తే జీర్ణాశయ సమస్యలు నివారణ అవుతాయి.

ఒక పుడక (Splinter ) గుచ్చుకొని ఇబ్బందిపడుతున్నారా?
కేవలం 40 నిమిషాల పాటు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను పుడక గుచ్చుకొని ఉన్న ప్రాంతలో దానిని తొలగించడానికి చీలిక పైగా పట్టుకోండి (ఒక టేప్ తో ఆ ప్రాంతలో అతికించవచ్చు).
పాదాలపై దుర్మాంసపు కాయలు (Warts on Foot): కొన్ని రోజులు నిరంతరం కాయల పైన ఒక తరిగిన ఉల్లిపాయ రుద్దాలి లేదా వాటిపై ఒక తరిగిన ఉల్లిపాయ కట్టి ఉంచాలి.

జ్వరం: మే జోడులలో (socks) ఒక సన్నగా చక్రంలా తరిగిన ఉల్లిపాయ ముక్కను అరికాలుకు తగిలేలా ఉంచండి, ఆపై నిదురించండి.

తీవ్ర చెవి నొప్పి: మీ చెవి కాలువ లో తాజాగా తరిగి ముద్ద చేసిన ఉల్లిపాయను శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి ఉంచండి మరియు కొన్ని గంటలు ఆ విధంగా ఉంచడం వలన చెవిలో గులిమిని అది మెత్తబరిచి నొప్పిని తేలికగా తగ్గించడంలో సహాయపడుతుంది.
కానీ ఈ పద్దతికి వెల్లుల్లి పాయలు ఉత్తమం. వెల్లుల్లి పాయలు దంచి, శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి చెవికాలువ దగ్గర ఉండేలా టేపు చెయ్యాలి. దీని వలన ఉల్లి చెవిలో దూరే ప్రమాదముండదు. ఉల్లి చెవిలో దూరితే బయటకు తీయడం కష్టమని గమనించండి.

తల నొప్పి: నీరుల్లి సగం కోసి తలమీద రాసినా, నలిపి శ్వాసించినా తల నొప్పి తగ్గుతుంది.
చుండ్రు, పేల నివారణ: ఉల్లి రసం జుత్తు కదుళ్ళకు పట్టించి 2 గంటల వ్యవదినిచ్చి శుభ్రం చెయ్యండి. అదనంగా, దీని వలన జుత్తు గాఢంగా పెరుగుతుంది. ఇది మంట పెడుతుంది కనుక 5 సంవత్సరముల లోపు పిల్లలు తట్టుకొనలేరని గమనించండి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, క్యారట్లు, సెలెరీ, పుట్టగొడుగులు మరియు బంగాళదుంపలతో సాధారణ కూరగాయల సూప్ తయారుచేసుకోండి. ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే మరియు సెల్యులార్ కాయకల్పను (cellular rejuvenation) అందిస్తుంది, ముఖ్యంగా బలహీనత లేదా శక్తిహీనత సందర్భాలలో ఇది ఒక నివారణ మరియు ఉపశమనం కలిగించే ఆహారం.

గమనిక: అయితే, దాని అద్భుతమైన ఆరోగ్య ప్రభావాలు పొందాలనుకొంటే, వాటిని పచ్చిగా తినాలి. ఎందుకంటే, వంట దాని సామర్ధ్యాలను చంపేస్తుంది.


Subbarao Kasturi

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.