తాటి ఇడ్లీ

0
755

బాగా పండిన తాటి పండును పీచు తీసిన తరువాత రేకు జల్లెడ మీద గుజ్జు తీయాలి. పీచు లేకుండా ఒక బట్ట లో వడగట్టాలి. తాటి పండ్లు అప్పటి కప్పుడు పడిన తాజావి అయితే మంచింది. అప్పటికే క్రింద పడి వున్న వాటిని వాడకపోవటమే మంచిది.

ఒక కప్పు తాటి గుజ్జు
ఒక కప్పు బియ్యపు రవ్వ
అర కప్పు బెల్లం తురుము
చిటికెడు ఉప్పు

ఒక కప్పు తాటి గుజ్జు ఒక కప్పు బియ్యపు రవ్వ అర కప్పు బెల్లం తురుము చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

 

 

 

దీనిలో బియపు రవ్వను వేసి బాగా కలిపి ఒక గంట సేపు నాననివ్వాలి.

నెయ్యి రాసిన ఇడ్లి రేకులలో అ పిండిని వేసి – ఇడ్లి పాత్రలో నీరు పోసి 15 నిమషాలు పాటు మీడియం సెగలో ఉడికించాలి.

 

వేడి వేడి తాటి ఇడ్లీ లకు తాజా వెన్న జోడించి తింటే బాగుంటుంది.


తాటి అప్పాలు

తాటి గుజ్జు ఒక కప్పుకు
ఒక కప్పు బొంబాయి రవ్వ
అర కప్పు బెల్లం తురుము
2 స్పూన్ ల కొబ్బరి తురుము
1 స్పూన్ గసగసాలు

ఒక కప్పు తాటి గుజ్జు ఒక కప్పు బొంబాయి రవ్వ అర కప్పు బెల్లం తురుము, గసగసాలు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి పక్కన పెటుకోవాలి.

బూర్లె మూకుడు లో కావలసినంత నూనె ను పోసి బాగా వేడి చేయాలి.

కలిపి వుంచిన మిశ్రాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బట్టర్ పేపర్ పై అప్పాలుగా వత్తి, చేతి లోకి తీసుకొని కాగిన నూనెలో దోరగా వేయించి తీయాలి. వేడి వేడిగా తింటే బాగుంటాయి.


@ RGB Infotain

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.