గోబీ మంచూరియా

0
728

వర్షాకాలం…ఓ పట్టాన ఏదీ తినబుద్దేయదు…పిల్లలు సరేసరి..పెద్దవాళ్ళకు కూడా..
రోజూ బయటి ఫుడ్ తినలేము..అందుకే కాస్త ఓపికతో మనమే నచ్చిన ఫుడ్ చేసుకుందాం…

గోబీ మంచూరియా

కావలసిన పదార్ధాలు
కాలిఫ్లవర్ 1
మైదా 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ 1 లేదా 1/2 స్పూన్
కారం 1 టేబుల్ స్పూన్
ఉప్పు సరిపడినంత
ఆయిల్ వేయించటానికి సరిపడినంత

సాస్ కోసం

ఆయిల్ 2 tbl స్పూన్స్
వెల్లుల్లి 6రేకులు సన్నగా తరిగినవి
అల్లం చిన్న ముక్క సన్నగా తరిగినది
కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్
క్యాప్సికమ్ 1 సన్నగా తరిగినది
సోయా సాస్ 3 tbl స్పూన్స్
చిల్లి సాస్ 3 tbl స్పూన్స్
టమేటా కెచ్ అప్3 tbl స్పూన్స్
మిరియాల పొడి 1/2 స్పూన్
ఉప్పు సరిపడినంత

తయారీ విధానం

నీటిని కొద్దిగా ఉప్పు వేసి మరిగించుకోవాలి
అందులో కాలిఫ్లవర్ ముక్కలని వేసి 2 నిముషాలు ఉడికించాలి.
నీటిలో నుండి తీసేసి చల్లార్చాలి.
ఒక బౌల్ లో మైదా..కార్న్..కరం..ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా కలుపుకోవాలి

ఇప్పుడు ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కల్ని చక్కగా వేగేవారకు ఆయిల్ లో ప్ర్తె చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

పాన్ లో ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి..అల్లం..స్ప్రింగ్ ఆనియన్స్..క్యాప్సికమ్..వేసి చక్కగా వేయించుకోవాలి..

అన్నీ వేగాక అందులో సోయా సాస్..చిల్లి సాస్..కెచ్ అప్..వేసి బాగా కలియబెట్టాలి.
ఉడుకు పట్టక మిరియాల పౌడర్..ఉప్పు వేయాలి..

దగ్గరయ్యాక వేయించి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కలిబెట్టాలి..వేడి వేడిగా తింటే బావుంటాయి…

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.