ఆలు నగెట్స్

0
611

ఆలు..బంగాళదుంప ఏ రూపంలో అయినా అందరికీ ఇష్టమే…
ఈ సారి ఇలా ట్రై చేద్దాం..

ఉడికించి గ్రేట్ చేసుకున్న బంగాళాదుంపలు 3

ఉల్లిపాయ సన్నగా తరిగినది 1
పచ్చిమిర్చి సన్నగాతరిగి 1
వెల్లుల్లి 6 రేకలు
కారం 1 స్పూన్
కొత్తిమిర గుప్పెడు
బ్రెడ్ పౌడర్ 3 tbl స్పూన్స్
ఉప్పు సరిపడినంత
(ఎగ్ వైట్ 2 ఇష్టం వుంటే)
పాలు

ఒక బౌల్ లో తురిమిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,వెల్లుల్లి ,కారం, కొత్తిమిర,ఉప్పు,వేసి బాగా కలుపుకోవాలి. 30 నిముషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
తర్వాత బయటికి తీసి చిన్న ఉండలుగా చేసుకోవాలి..

చేతికి అంటుకుపోతుంది..కాస్త నూనె రాసుకుని ఉండలు చేసుకుని పాలలో ముంచి బ్రెడ్ పౌడర్ లో అద్ది ఎర్రగా వేయించుకోవాలి..

టమాటా కెచ్ అప్ తో తింటే చాలా బావుంటాయి..

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.