కేరెట్ కొబ్బరి ఫ్రై

0
414

కావలసినవి
క్యారెట్ 150 gms
సన్నగతరిగిన ఉల్లి ముక్కలు 1కప్
పచ్చిమిర్చి 4
కరివేపాకు కొంచెం
ధనియాల పౌడర్1 స్పూన్
కారం 1 స్పూన్
కొద్దిగా పసుపు
జీలకర్ర పొడి 1 స్పూన్
ఆయిల్ కొద్దిగా
తాలింపు దినుసులు

తయారీ విధానం

కేరెట్ తరిగి కొద్దిగా ఉప్పు,పసుపు,ధనియాల పౌడర్,జీలకర్ర పౌడర్ వేసి 1/4 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.

ఒక పాన్ లో ఆయిల్ వేసి తాలింపు చేసి,ఉల్లి,పచ్చిమిర్చి,వేసి వేయించుకోవాలి. చక్కగా వేగాక కరివేపాకు,కారం వేసి ఉడికించిన కేరెట్ నీళ్లతో సహా వేసి నీరు ఆవిరై పోయే వరకు వేయించుకోవాలి.
కొబ్బరి పొడి చల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించి దించుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడి వేడిగా రోటీతో తింటే బావుంటుంది.


Priyadarshini Krishna

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.