పంజాబీ చికెన్ తంగడి టిక్కామసాలా

0
587

చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీ

కావలసినవి
6 చికెన్ లెగ్స్ (స్కిన్ లెస్)
150 gms తరిగిన ఉల్లిపాయలు
2 పెద్ద పండిన టమాటాలు
4 పచ్చిమిర్చి
1/2 జీలకర్ర
3 స్పూన్స్ గసగసాలు
3 స్పూన్స్ అల్లం,వెల్లుల్లి పేస్ట్
2 స్పూన్ గరం మసాలా
పసుపు
3 స్పూన్స్ పెరుగు
ఉప్పు సరిపడినంత
1 కట్ట కొత్తిమిర
పుదీనా కట్ట

తయారీ విధానం

టమాటా..పచ్చిమిర్చి..కొత్తిమీర.. పుదీనా..గసగసాలు ..గరం మసాలా కలిపి ముద్దగా చేసుకోవాలి.
చికెన్ ముక్కలను వేసి 20 నిముషాలు నానపెట్టుకోవాలి…

ఒక గిన్నెలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి వేగాక ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి..అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని,టమాటా,పచ్చిమిర్చి వేసి పసుపు,గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలి..అందులో నాన బెట్టిన చికెన్ వేసుకుని సన్నని సెగ మీద చికెన్ ఉడికేవరకు ఉడికించుకోవాలి….తర్వాత కొత్తిమిర తో గార్నిష్ చేసుకుని రైస్..రోటిలతో తింటే బావుంటుంది..


Priyadarshini Krishna

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.