కావలసినవి
పొట్లకాయ 1
పచ్చిమిర్చి 7
చింతపండు కొద్దిగా
కరివేపాకు కొంచెం.
జీలకర్ర 2 tbl స్పూన్స్
వెల్లుల్లి 4 రేకలు
పసుపు కొద్దిగా
ఉప్పు సరిపడినంత
తయారీ విధానం
పోట్లకాయని చెక్కుతీసి ముక్కలు కోసుకుని 1/4 వంతు గ్లాస్ నీళ్లతో కొంచెం ఉప్పు వేసి..నీరు ఇగిరే వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఒక సన్నని గుడ్డలో ముక్కలు వేసి నీరు పోయేవరకు పిండాలి..
పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించుకోవాలి..
స్టౌ ఆపేసాక చింతపండు కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి..
మెత్తగా నలిగాక జీలకర్ర,వెల్లుల్లి కూడా వేసి మెత్తగా చేసుకోవాలి..
ఇందులో ముక్కల్ని వేసి కలుపుకుని పెరుగు కలపాలి..
తాలింపు పెట్టి అందులో వేసుకుని రోటి తో కానీ, అన్నం తో కానీ తినొచ్చు..