చికెన్ షాహీకబాబ్

0
460

వేసవి కదా అని మసాలాలు తగ్గించి కాస్త సాదా వంటలకే ప్రాముఖ్యత..ఎంత ఇష్టం ఉన్నా వేసవి వేడికి భయపడి తగ్గి ఉంటాము..వానలు మొదలు..ఆహారంలో కూడా మార్పులు సహజంగా చేరిపోతాయి..పులుసులు,పప్పు,చారు,పప్పుచారు నిదానంగా..ప్రై,మసాలా కూరలుగా మారుతుంది.

ఈ రోజు మన వంట “చికెన్ షాహీ కబాబ్”….అది కూడా చక్కగా ఇంట్లోనే నాన్ స్టిక్ పాన్ లో!

కావలసిన పదార్ధాలు

1 కప్ శనగపప్పు (అరగంట నాన బెట్టుకోవాలి)

500గ్రామ్ చికెన్ మెత్తటి ముక్కలు బోన్ లెస్

1 టేబుల్ స్పూన్ కారం

7 ఎండు మిరపకాయలు

2టేబుల్ స్పూన్ల జీలకర్ర

2 టేబుల్ స్పూన్స్ ధనియాలు

7 లవంగాలు

10మిరియపు గింజలు

2 చిన్న దాల్చిని చెక్కలు

1టేబుల్ స్పూన్ వాము

6ఎగ్స్

1/2 కట్ట కొత్తిమీర

1/2కట్ట పుదీన

6 పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి అల్లం సన్నగా తరిగినది

1/2 స్పూన్ 10వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరగాలి ఆయిల్ ఫ్రై కి సరిపడినంత ఉప్పు సరిపడినంత.

తయారీ విధానం:

శనగపప్పు,చికెన్,మసాలాలు అన్నీ కలసి బాగా ఉడకనివ్వాలి..దించి పక్కనపెట్టి చల్లారనివ్వాలి. చల్లారాక మెత్తగా కలుపుకోవాలి.. 3 గుడ్లు,తరిగిన కొత్తిమిర,పుదీనా,పచ్చిమిర్చి,అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలియబెట్టాలి.

మిగిలిన 3 గుడ్లని ఒక బౌల్ లో వేసి మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి.

పై మిశ్రమాన్ని రౌండ్ షేప్ లో చేసుకుని ఎగ్ మిక్స్ లో ముంచి పాన్ మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకోవాలి. చికెన్ షాహీ కబాబ్ రెడీ… వీటిని స్ప్రింగ్ అనియన్స్,నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి..

ఇవి పుదీనా చట్నీ లేదా చింతపండు చట్నీతో వడ్డిస్తే బావుంటుంది.


ప్రియదర్శిని కృష్ణ

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.