జగమెరిగిన సత్యాలకు దాపరికం ఎందుకు?

0
450

అమ్మా…ఈ రోజు స్కూల్ లో గేమ్ ఉంది నేను వెళ్లను.
ఎమ్మా…అమ్మాయి ఇబ్బందిగా చూస్తూ ఉంటుంది..ఎందుకమ్మా ఇబ్బంది..మనకి ఎదో కంపెనీ pads ఉండగా..అంటూ కూతురిని స్కూల్ కి పంపుతుంది..
గేమ్ లో కూతురు గెలుస్తుంది..ఇది వ్యాపార ప్రకటన..

కానీ ఇంట్లో పక్కనే కూర్చున్న మగపిల్లలు ఏమిటమ్మా అది..ఎప్పుడూ గర్ల్స్ కే చెబుతారు అని అడిగినప్పుడు పక్కనే ఉన్న తాత.. బామ్మ గార్లు…ఏమిటో కలికాలం..అన్నీ ఇలా టీవీల్లో…
సిగ్గులేకుండా…అంటూ..తల తిప్పుకుంటారు..
తండ్రి ఆ యాడ్ వచ్చినప్పుడు ఛానెల్ మార్చమన్నాను కదా అంటూ విసుక్కుంటారు..

అసలు విషయం ఎందుకు చెప్పలేరు.. చెప్పి
అది తప్పుకాదని లేదా చీత్కరించుకునే విషయం కాదని మగ పిల్లలకి…..
సిగ్గుపడాల్సిన అవసరం కానీ..ఇబ్బంది పడాల్సిన ఆవశ్యకత లేదని కూతురికి ధైర్యం ఎంత మంది ఇస్తారు..

బహిష్టు అని ఇంట్లో కలపకుండా..గొడ్ల చవాడిలో గడిపిన నాలుగు రోజులయినా..ఇంటిని మోస్తూ ఊరంతా తిరుగుతున్న నేడయినా ఎప్పుడయినా ఎందుకు సిగ్గు..
తప్పొప్పులు ఎంచే మానవ కర్మ కాదుగా…
నెలసరి శరీర ప్రక్రియ…ఇది సక్రమంగా జరిగితేనే రేపు ఓ మాతృత్వపు ఆలయం తెరుచుకునేది..

ఇప్పటికీ pads అందరికీ అందుబాటులో లేవు..సగటు ఆదాయ కుటుంబాలలో పాత బట్టలను…మరల మరల ఉతికి వాడుతున్నారు…
ఇంకా కింది స్థాయి కుటుంబాలలో బూడిద..లేదా మట్టి బట్టలలో చుట్టి వాడుతున్నారు..
ఎన్ని అనారోగ్యాలు దరిచేరినా కూడా ఎందరు వాడలేదు.. అందరికీ లేదుగా అంటారు తప్పించి ఆలోచన రాదు..

పులిరాజా కి ఎయిడ్స్ వస్తుందా… అని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి కండోమ్ అవశ్యకతని చాటిన పెద్దలకు…

PADని చూపుతూ ఎంత అవసరమో తెలియపరచకపోగా..దానికి ధర..దానిపై gst అంటూ విలాస వస్తువుల జాబితాలో చేర్చటం ఎంతవరకు సబబు?


@ Tulasi Sandya 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.