వ్యంగ్యచమత్కారం

0
432

మన దేశంలో వ్యంగ్యం..చమత్కారం….అనేది ప్రాచీన కాలం నుండీ ఉంది..
కవులు చమత్కారంగా మాట్లాడటం ఉండేది….ఓ సరదా ప్రశ్నకు అంతకంటే సరదాగా.. ఇంకాస్త లోనికి వెళుతూ జవాబివ్వటం జరిగేది…సాహితీ పరంగా కూడా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రక్రియ.. ఒకరినొకరు నొప్పించుకోవటానికో ..లేక ఇబ్బంది పెట్టటానికో కాక హాస్య చతురతతో తర తరాలకు వారసత్వ సంపదగా ఇచ్చారు…కానీ…

తరాలు మారుతున్న కొద్దీ..

రూపాలు మార్చుకుంటూ..వెటకారం..ఎగతాళి కూడా సామాన్య విషయాలైపోయాయి..
హేళన కూడా అందులోని భాగమే అనుకునేంతగా అసలుని మరచిపోయి వీటిని ఆకళింపు చేసుకున్నాం….

మార్పు అనేది ఎవరికి వారికి రావాలి..

ప్రభుత్వాలు..చట్టాలు..ఏమీ చేయలేవు..

మారండి మారండి అంటూ చర్యలు తీసుకున్నా..మనసులోకి వెళ్లని ఏదయినా వ్యర్థం..ఇదీ అంతే.. మన సమాజ నిర్మాణం దగ్గరనుండీ ఓ వివక్ష అలా నడుస్తుంది..మారుతున్నాం..మారుతున్నాం..అంటూ మాటలలో మార్పులతోనే సగం గడిచి ఇప్పటికి ఓ మోస్తరు మార్పులు చేతలలో చేస్తున్నాం..
ఈ మధ్య పేరుకోసం negative publicity ఇచ్చుకుంటున్నారు…ఈ negative publicity కి కూడా మంచి డిమాండ్..అలా ఉన్నాయి మన ఆలోచనలు…మంచిగా లేదా చెడుగా ఎలా అయినా తమకంటూ ఓ స్థానం కావాలి… సమాజంలోకి వెళ్ళాలి..తద్వారా వారి ఆలోచనను తమవైపు తిప్పుకోవాలి..అప్పుడు వారనుకున్న success వస్తుంది..ఇది కాస్త ముందు వరకు సినిమాలు..సిరియల్స్..కొన్ని కొన్ని వాటిల్లో ప్రజా మాధ్యమాలకు మాత్రమే వర్తించేవి..

ఇప్పుడు.. క్రేజ్ ఒక ఫ్యాషన్..దీనికి ప్రతి ఒక్కరూ దాసోహమే..మినహాయింపు లేదు..ప్రతి ఒక్కరికి ఎవరికి వారుగా ఓ పేరు కావాలి..మంచిదో..చెడ్డదో..పిచ్చిదో..ఎదో ఓ పేరు.. ఆ పేరు తలవగానే వారే గుర్తు రావాలి…చిన్న పిల్లల దగ్గర నుండి 60..70 ఏండ్ల వరకు ..తమలో ఉన్న టేలెంట్ ని బయటికి తీసి తమను తాము తీర్చి దిద్దుకున్నవారు కొందరు..అ క్రమంలో వారిని అనుసరించి గుర్తింపు తెచ్చుకున్న వారు ఇంకొందరు..విమర్శించి ఆకట్టుకున్న వారు ఇంకొందరు..దెబ్బలాడి నిరూపించుకున్న వారు కొందరు..ఏమీ లేదంటే ఏడ్చి సాధించిన వారు ఇంకొందరు…ఇదో క్రేజ్..

ఆ క్రమంలో ఎవరో ఒకరు కొన్ని ఆలోచించని..లేదా కావాలని (పిచ్చి) మాటలు మాట్లాడటం..వాటికి అవసరానికి మించి విలువ ఇచ్చి వారిని మాధ్యమాల ద్వారా పరిచయం చేస్తూ….అప్పటివరకూ సమాజంలో వారికి లేని ఒక ప్రత్యేకతని (తప్పో..ఒప్పో) కల్పిస్తాం…ప్రతి ఒక్కరికీ పరిచయం చేసేస్తాం.. అసలెవరో ఏమిటో తెలియని స్థానం నుండి గుర్తింపు ప్రాముఖ్యత ఇచ్చేస్తాం…

ఇక తర్వాతి అంకం..
వారికి అనుగుణంగా కొందరు..
వ్యతిరేకంగా కొందరు అదే విషయం పై పదే పదే చర్చలు సాగిస్తారు..
అసలు విషయం వదిలేసి..ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు..
వారేం మాట్లాడుతున్నారో..ఎందుకు మాట్లాడుతున్నారో వారికే తెలియదు కొన్ని సార్లు…అలా సాగే క్రమంలో..

అసలు విషయం మరచి
వారిలో వారు ఒకరిపై ఒకరు (స్వ విషయాలపై ) అభాండాలు వేసుకుంటూ వీరు ఒకరికొకరు శత్రువులవుతారు…
అసలేం చేయాలని కార్యక్రమాన్ని మొదలెడతారో..అది ఎటు పోతుందో..చివాఖారుకి ఏమవుతుందో ఎవరికీ తెలియదు…
అసలు విషయం కంచికి..వీరి పగలు మొదలు…
అక్కడే తప్పుని తప్పు..అని ఖండించే హక్కు అందరికీ ఉంటుంది..
కానీ ఎవరూ ఏమీ చేయరు..అనరు..

తప్పు మాట్లాడినప్పుడే అక్కడికక్కడే వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేస్తే మరోసారి మరొకరు..మరో విధంగా ఈ అనవసరపు మాటలు..వ్యర్ధ ప్రేలాపనలు..అనుచిత చర్యలు తప్పకుండా తగ్గుతాయి..ఒక్కసారిగా తగ్గకపోయినా క్రమక్రమంగా తగ్గటానికి అవకాశాలు ఉన్నాయి…ఎక్కడో ఎవరో మొదలు పెడతారని చూడకుండా మనమే మన నుండే మొదలు పెడితే సరి……._/\_

తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.