కేక్…కేక్…!!

0
554

కేక్…
బలమయిన ఆహారం..పిల్లలకు చాలా మంచిది..
ఓవెన్ ఉంటేనే కేక్ అంటే కష్టం కదా..
సింపుల్ గా కేక్ గిన్నెలో చక్కగా నచ్చిన కేక్ చేసుకోవచ్చు..

కావలసినవి…
వెన్న ఎంత ఉంటే అంతే బరువు ఎగ్స్ ..నేను ఒకటి ఎక్కువ వేస్తాను
అంతే బరువు పంచదార..
అంతే బరువు మైదా పిండి

బేకింగ్ పౌడర్,వెనీలా లేదా ఆరెంజ్ ఎసెన్స్ చాలా మంది వేస్తారు..

చాక్లెట్ కేక్ కోసం కోకో పౌడర్ వాడాలి..దీనిలో వెనీలా ఎసెన్స్ వాడకుండా ఉంటేనే బావుంటుంది..
పంచదార కూడా కాస్త తగ్గించుకోవాలి..

నేను వీటిలో ఏదీ వెయ్యను.

తయారీ విధానం….

ముందుగా వెడల్పు బేసిన్లో వెన్న వేసుకుని చేతితో తిప్పాలి..
వెన్న మొత్తం మెత్తని పేస్ట్ లా అయ్యేవరకు సుమారు 5 నుండి 8 నిమిషాలు తిప్పాలి
దానిలో ఎగ్స్ కొట్టి వేసుకుని మరలా తిప్పాలి..
ఇది కూడా అంతే సమయం తిప్పేప్పటి ఎగ్ ఎల్లో విడిగా మిగిలిన ఎగ్ వైట్ వెన్న కలిపి ముద్దలా వేరు అవుతాయి
అప్పుడు పంచదార వేసుకుని కలపాలి..
డైరెక్ట్ పంచదార అయితే చాలా టైమ్ పడుతుంది
అందుకు పౌడర్ లా చేసుకుని వేస్తె బావుంటుంది.
ఇది కూడా అంతే సమయం కలిపాక మైదా వేసుకుని
ఉండలు కట్టకుండా కలుపుకోవాలి..ఇలా కాసేపు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి..
ఎగ్ వాసన ఇష్టపడని వారు వెనీలా ఎసెన్స్..లేదా ఆరెంజ్ ఎసెన్స్ 1tbl స్పూన్ వేసుకోవాలి..
బేకింగ్ పౌడర్ కావాలనుకున్న వాళ్లు కూడా 3 tbl స్పున్ వేసుకుని బాగా కలుపుకోవాలి..

చాక్లెట్ కేక్ కోసం కోకో పౌడర్ ఇప్పుడే కలుపుకోవాలి..
1 కేక్ గిన్నె కోసం అయితే 4to 5 స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి..

కేక్ గిన్నె కింద ఇంకొ చిన్న గిన్నె ఉంటుంది ..
అందులో మెత్తని ఇసక పోసి కాస్త తడిపి పొయ్యి మీద sim లో పెట్టుకోవాలి..
గిన్నెకు లొపల నెయ్యి రాసి కేక్ మిక్స్ సగం వచ్చే వరకు వేయాలి..
మూత పెట్టి ఇసక పోసిన చిన్న గిన్నె మీద ఈ గిన్నె ఉంచాలి..మంట sim లొనే ఉండాలి.
20 నిమిషాల తరువాత మంచి వాసన వస్తుంది..
అప్పుడు మూత తీసి టూత్ పిక్ ని లోనికి గూచ్చాలి
టూత్ పిక్ కి ఏమి అంటకుండా ఉంటే కేక్ ఐపోయినట్టే…

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.