లిప్స్టిక్ ఆరోగ్యానికి ఎంత మంచిదో…!!!

0
407

అబ్బ ఎంత బవుందో …
ఆ రంగు..ఊహూ ఈ రంగు..
అబ్బో ఎన్ని రంగులో…మా కంపెనీ వాడండి…
ఊహూ మాది…
మా లిప్స్టిక్ లో కెమికల్స్ లేవు….సహజ సిద్ధమైనది..
ఇలా ఒకటా రెండా…టీవీ పెడితే చాలు…ఎన్నో యాడ్స్..
నెట్ ఆన్ చేస్తే మా కంపెనీవి కొంటే 20% అఫర్…
ఇంకో కంపెనీ ఇంకొచెం…
మరో కంపెనీ ఒకటి కొంటే ఒకటి ఉచితం..
కొనేది లిప్ స్టిక్ కాదు జబ్బులను అని తెలియకుండానే కొనేస్తున్నాం…అదీ ఎదురు డబ్బులిచ్చి మరీ…

ఆలోచించండి …ముందు..

లిప్స్టిక్ ఆరోగ్యానికి ఎంత మంచిదో చూద్దాము..
నన్ను తిట్టుకోవద్ఢు ముందే చెప్తున్నా..
లిప్స్టిక్ ల వల్ల పెదవులకి అందం ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం..
ఎందుకో చూద్దాం.

క్రోమియం, కాడ్మియం,మెగ్నీషియం,లెడ్, పెట్రో కెమికల్స్,ఫార్ములా డి హైడ్ ,మినరల్ ఆయిల్,
పారాబీన్స్ ,బిస్ముత్ ఆక్సీ క్లోరైడ్
ఇవి ఒకప్పుడు చదువుకునే రోజుల్లో లాబ్స్ లో టెస్టింగ్ చెయ్యటానికి ప్రాక్టికల్ చేసేవాళ్ళు
అప్పుడు ఎంతో జాగ్రత్త గా చేతులకి గ్లౌజ్ లు వేసుకుని టెస్ట్ చేసే వాళ్ళం..
కాని ఇవే కెమికల్స్ ఇప్పుడు లిప్స్టిక్ లో ఉపయోగిస్తున్నారు.
ఇవి టెస్టింగ్ చేసేటప్పుడు చేతులూ పాడయిపోతాయి అని జాగ్రత్త గా ఉండేవాళ్ళం
ఇప్పుడు ఎంతో సున్నిత భాగం అయిన పెదవులకి డైరెక్ట్ రాస్తున్నాము.
దీని వల్ల తాత్కాలిక ఆనందం అందం తప్ప రానున్న రోజులలో ఎంతో తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతారు.
తెలియని వయసులో గ్లౌజ్ లు చేతికి వేసుకుని
ఇప్పుడు తెలిసి కూడా డైరెక్ట్ గా ఈ కెమికల్స్ ని పెదవులకి రాస్తుంటే…..
కాదు కాదు పూస్తుంటే ఇంకా ఆరోగ్యం వదిలేసినట్లు కదా…
మనకి ఆరోగ్యం కన్నా అందం ముఖ్యం. ఇలాంటి జనరేషన్ లో ఉన్నాము.

1.క్రోమియం, కాడ్మియం,మెగ్నీషియం:-
ఈ కెమికల్స్ వల్ల తీవ్రమైన అనారోగ్యం వ్యాధుల బారిన పడే రిస్క్ చాలా ఎక్కువ.
వీటి వల్ల ఆర్గాన్ లు డామేజ్ అవుతాయి.
మరియు ఎక్కువ కాడ్మియం కిడ్నీ లో పేరుకు పోవటం వల్ల కిడ్నీ లు ఫెయిల్ అవుతాయి.
అదే విధం గా ఎక్కువ సార్లు లిప్స్టిక్ ఉపయోగించటం వల్ల మనం తినే తిండి కన్నా ఇదే ఎక్కువ పొట్ట లోకి పోతది
దీని కారణం గా కడుపు లో కణితి లు వస్తాయి.

2.లెడ్:-
ఇకపోతే మాములుగా మనం ఆలోచిస్తేనే తల నొప్పి
ఇంకా ఈ లిప్స్టిక్ లో ఈ లెడ్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్ డామేజ్ అవుతది.

3.పెట్రో కెమికల్స్:-
ఇవి కూడా లిప్స్టిక్ లో ఉంటాయి.వీటి ప్రభావం శరీర పెరుగుదల మీద పడుతుంది.

4.ఫార్ములా డి హైడ్ ,మినరల్ ఆయిల్ పారాబీన్స్ ,బిస్ముత్ ఆక్సీ క్లోరైడ్:-
దీనివల్ల దగ్గు,పిల్లి కూత లు,కళ్ళు నొప్పులు,కళ్ల కు సంబందించిన రోగాలు,చర్మ సంబంద రోగాలు వస్తాయి
.చర్మ రంద్రాలు మూసుకుపోతాయి
రీసెంట్ గా కాన్సర్ కూడా వస్తదని ఎదో రీసెర్చ్ లో కూడా తేలింది మరి…

మరి చూసారు గా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… ఇంకెందుకు ఆలస్యం మీ డబ్బులు…
మీ లిప్స్టిక్ …మీ పెదవులు …
ఆరోగ్యం హాస్పిటల్ లో….
ఆహా ఎమన్నా కాంబినేషన్!

ఇకనైనా ఇలాంటి కెమికల్స్ వాడటం తగ్గించి ఆరోగ్య౦ మీద ద్రుష్టి పెడితే అందరు సంతోషం గా ఉంటారు.

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.