జీవితం అనే మారథాన్..!

0
483

గత పది రోజుల్లోనే దాదాపు ఇరవై ఆత్మ హత్యలు . చాల చిన్న విషయాలకు { ఫేస్బుక్ వాడొద్దు అని అమ్మ చెప్పిందని ఒక అమ్మాయి , దీపావళి పండుగకు హాస్టల్ లోనే ఉండమని చెప్పిందని ఒక అబ్బాయి } కూడా టీనేజ్ పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది . తల్లితండ్రుల్లో ఆందోళన నెలకొంది . మన పిల్లలు ఇలా చెయ్యకుండా మంచి మార్గాన సాగి సంతోషంగా జీవించాలంటే ఏమి చెయ్యాలి ?

1 . పిల్లలు సెల్ ఫోన్ ను అట వస్తువుగా భావిస్తున్నారు . పిల్లల్ని బిజీ గా ఉంచడం కోసం తల్లితండ్రులే సంవత్సరం వయసులోనే వారి చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారు . దీనిపై వారు వీడియో గేమ్స్ ఆడడం ఒక వ్యసనం గా మార్చుకొన్నారు . చాల వీడియో గేమ్స్ లో చంపడం , చావడం చాల సాధారణం గా ఉంటోంది . ఇది స్లో పాయిజన్ లాగ పిల్లల మెదళ్లను చేరిసేస్తోంది . కోపం వస్తే బ్లేడ్ తో చెయ్యి గీసుకోవడం , లేదా అవతలి వారి పై దాడి చెయ్యడం , ఆత్మ హత్యా చేసుకోవడం ఇవన్నీ సాధారణ విషయాలుగా వారికీ కనిపించడం ఈ హింసాత్మక వీడియో గేమ్స్ వల్లే . గుర్తుంచుకోండి పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ బాంబు లాంటిది . అది ఎప్పుడైనాపేల వచ్చు . హెల్ ఫోన్ కు పిల్లల్ని దూరంగా ఉంచండి . ఇంట్లో కంప్యూటర్ పెట్టి , సేఫ్ బ్రౌసింగ్ అప్షన్స్ తో వారు మంచికోసం ఇంటర్నెట్ ను వాడుకొనేలా చెయ్యండి .

2 . అతివృష్టి – అనావృష్టి :
ఒకప్పుడైతే ఇంట్లో గంపెడు పిల్లలు . ఇప్పుడు ఒక్కరు లేదా ఇద్దరు . తల్లితండ్రుల ప్రాణాలన్నీ వారిపైనే . వారికోసమే బతుకుతున్నారు . కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమే పిల్లలకు శాపం గా మారింది . చిన్నప్పుడు పిల్లని అతి గారాబం చెయ్యడం చాల మటుకు కనిపిస్తోంది . వారు అడిగింది వెంటనే ఇవ్వడం , దేనికి కాదనకా పోవడం తో పిల్లలో మంకుతనం ఎక్కువవు తోంది . నేను ఏడిస్తే, మా అమ్మ నాన్న ఏది కాదనరు అని వారు అర్థం చేసుకొంటున్నారు . అంటే ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, మనమే పిల్లలకు నేర్పుతున్నాము .

ఇక పిల్లలు హై స్కూల్ లో అడుగుపెట్టగానే వారి భవిష్యతు పై గాభరా పెరిగి వారి పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్న తల్లి తండ్రులు ఎంతో మంది . విపరీతమైన గారాబం అటు పై ఒత్తిడి రెండు తప్పే . పేరెంటింగ్ లో balancing ఉండాలి .

3 . పిల్లల్ని శాసించొద్దు . నేను చెప్పిందే నువ్వు వినాలి అని గద్దించొద్దు . ఒకటి ఎందుకో చెయ్యాలో ఇంకొకటి ఎందుకో వద్దో వారికీ అర్తం అయ్యేలా హేతుబద్దంగా చెప్పండి . తప్పు చేస్తే నష్టం తమకే , తమ బాగు కోసమే తల్లి తండ్రి ఇలా చెబుతున్నారు అని వారికీ అర్తం అయ్యేలా చెయ్యండి .

4 . మీ కోపాన్ని కాదు మీ కన్సర్న్ ని వారికీ చూపండి . ఇటీవల జరిగిన సంఘటన . ఎంత చెప్పినా అబ్బాయి సరిగ్గా చదవడం లేదని తండ్రి ” ఇలా మార్కు లు వస్తే నా ఇంటి నుంచి వెళ్ళ గొడుతాను ” అని కోప్పడ్డాడు . మరుసటి రోజు అబ్బాయి స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఎక్కడికో పారిపొయ్యే ప్రయత్నం చేసాడు .” మా నాన్న కు నేనంటే నచ్చదు అమర్నాథ్ సర్ ” అని నా దగ్గర ఏడ్చాడు . ” లేదు మీ నాన్న చిన్న ఉద్యోగి . నీ భవిష్యత్తు గురించి ఆందోళనే ఆయనను ఆలా ప్రపర్తించేలా చేసింది అని ఒక అర గంట అర్తం అయ్యేలా చెబితే తప్పుతెలుసుకొన్నాడు . కాబట్టి పిల్లపై మీకున్న కన్సర్న్ ను వారికీ అర్తం అయ్యేలా చెయ్యండి .

5 . ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి . ఇంట్లో తాత అవ్వ మేనత్త పెద్దనాన్న బాబాయి పిన్ని ఇలా ఎంతో మంది . తన యీడు పిల్లలు ఇంట్లో వుండే వారు . వారితో ఆడుకొనే భావోద్వేగాలను పంచుకొనే అవకాశం పిల్లలకు ఉండేది . ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఒంటరి అయి పొయ్యారు . అమ్మ నాన్న తప్ప ఎవరు ఇంట్లో వుండరు . అమ్మ నాన్న కూడా పనిలో బిజీ . తోడు మాయదారి సెల్ ఫోన్ . అది చెప్పిందే వారు నేర్చుకొంటున్నారు . పిల్లతో సమయాన్ని వెచ్చించండి . అదే మీరు వారికిచ్చే నిజమైన ఆస్థి . ఇంగ్లీష్ లో ఒక మాట వుంది . నో body is బిజీ . its అల్ అబౌట్ ప్రియరిటిస్ అని … అంటే మనం అనుకొంటే మనకు ఇష్టమైన పనులు చెయ్యడానికి మనకు సమయం దొరుకుతుంది . సో స్పెండ్ క్వాలిటీ టైం విత్ చిల్డ్రన్ .

6 . పిల్లల అభిరుచి ని అర్తం చేసుకొని అందుకు తగ్గ కెరీర్ ను వారు ఎంపిక చేసుకొనేలా చుడండి . మీరు సాధించలేక పోయిన దాన్ని వారు సాధించాలని వారి పై మీ ఇష్టాలను బలవంతంగా రుద్దకండి . నేటి IIT ఫౌండేషన్ కోర్స్ లను నేను 21 వ శతాబ్దపు బాల్య వివాహాలుగా పిలిస్తాను . 19 శతాబ్దం లో పిల్లల ఇష్టాయిష్టాలతో పని లేకుండా ముక్కు పచ్చలారని వయసులో వారికీ పెళ్లి చేసేవారు . ఇప్పుడు 5 వ క్లాస్ పూర్తవగానే వారికి మ్యాథ్స్ , ఫిజిక్స్ కు తగ్గ ఆప్టిట్యూడ్ వుందా లేదా అని చూడకుండా { నిజానికి వారు ఆప్టిట్యూడ్ ను మనం కేవలం 9 . 10 తరగతుల్లోనే అంచనా వెయ్యగలం } వారిని కేవలం మ్యాథ్స్ physical స్కిన్స్ మాత్రమే ద్రుష్టి పెట్టె ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పిస్తున్నారు . హై స్కూల్ చదువు పూర్తయ్యే దాక వారికి లైఫ్ స్కిల్స్ తో కూడిన సంపూర్ణాత్మక విద్య అవసరం అని గ్రహించండి .

7 . నేటి కార్పొరేట్ కాలేజీ ల హాస్టల్స్ నరక కూపాలుగా వున్నాయి . జైళ్లలో ఖైదీలకు కంటి నిద్ర కావలిసినప్పుడు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది . ఇక్కడ టాయిలెట్ కు పోవడానికి అర్ధ రాత్రి లేవాల్సిన పరిష్టితి . పిలల్లకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకొనే అవకాశం ఇస్తున్నారు . ఇంత తక్కువ నిద్ర పొతే చదువు సంగతి దేవుడెరుగు , మెదడు దెబ్బ తింటుంది . డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధులు వస్తాయి . ఒక మాట లో చెప్పాలంటే పిచ్చివాళ్ళు అయిపోతారు . అంటే పార్టీ ఒక్కరు జుట్టు చించుకొనే స్థాయి పిచ్చి వాళ్ళు అయిపోతారని కాదు . ఎంతో కొంత మానసిక సమస్య ఇలాంటి హాస్టల్ లో వుండే ప్రతి ఒక్కరి లో వస్తుంది .

జీవితం అనేది వంద మీటర్ ల పరుగు పందెం కాదు . వరుస పెట్టి ఎన్ని అపజయాలు సాధించినా , ఓటమి నుంచి పాటలు గ్రహిస్తే జీవితం లో విజయం సాదించ వచ్చు . ఓటమి శాపం కాదు . ఓటమి అనుకూల శత్రువు . అది నేర్పే పాటలు గ్రహిస్తే విజేతలు మనమే . మా అమ్మ నాన్న చిన్నప్పుడే నాకు డాక్టర్ అని పేరు పెట్టేసారు. అండర్ ఏజ్ కారణం గా ఎంబీబీస్ ఎంట్రన్స్ రాసె అవకాశం నాకు డిగ్రీ పూర్తయ్యేదాకా రాలేదు . అప్పటికి ఇంటరెస్ట్ పొయ్యింది . అటు పై ఐఏఎస్ కావాలి అనుకున్నా. మూడు సార్లు ప్రిలిమ్స్ mains దాటి INTERVIEW దాక వెళ్లినా ఏదో ఒక సర్వీస్ వచ్చింది కానీ నేను ఆనుకొన్న ఐఏఎస్ రాలేదు . అంటే అనేక స్ప్రింట్ రేస్ లో నేను ఓటమి పాలయ్యాను .

కానీ జీవితం అనే మారథాన్ రేస్ లో నేను విజేతనే . నేను ఓడిన స్ప్రింట్ రేస్ { ఎంబీబీస్ , ఐఏఎస్ పరీక్షలు } లో విజేతలు అయ్యిన వారికంటే సంతోషంగా జీవితం సాగిస్తున్నా. పరాజయం పాలవగానే అమర్నాథ్ ఆత్మ హత్యా చేసుకొని ఉంటే ఈ రోజు వాసిరెడ్డి అమర్నాథ్ ఉండేవాడు కాదు కదా ! పాటలు చెప్పడం నా PASSION , దీని లో వుండే సంతృప్తి నేను డాక్టర్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయివుంటే పొంది వుండే వాడిని కాదు .

మనం సంతోషంగా జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యం . పిల్లల సంతోషకర జీవనానికి మంచి పునాది వెయ్యండి . లైఫ్ స్కిల్స్ నేర్పండి . చదువు అంటే మార్కు లు రాంక్ లు కాదు . చదువు అంటే సంతోషకర జీవనానికి పిల్లలని సన్నధం చేసే సాధనం.


@ Amarnath Vasireddy

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.